BigTV English

Oral cancer: జాగ్రత్త! నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందట..

Oral cancer: జాగ్రత్త! నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల కూడా క్యాన్సర్ వస్తుందట..

Oral cancer: దంతాలను బలంగా ఉంచడానికి సరైన సంరక్షణ చాలా ముఖ్యమని చిన్నప్పటి నుంచి మనకు చెబుతూనే ఉంటారు. అందుకే డాక్టర్లు కూడా రెండుసార్లు బ్రష్ చేసుకోమని చెబుతారు. కానీ మనం వింటే కదా.. ఒక్కసారి వేయడానికే బద్డకంగా ఉంటారు. కొందరు ఇంకా రెండు సార్లు వేయాలంటే అవసరమా అనుకుంటారు. అయితే దంతాలను సరిగ్గా శుభ్రం చేసుకోవడం వల్ల దంతాలను బలంగా చేయడమే కాకుండా మీ నోటి ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం నోటికి మాత్రమే కాదు, మీ ఆరోగ్యానికి కూడా చాలా ముఖ్యం.


నోటి ఆరోగ్యం మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. ఇటీవలి అధ్యయనంలో ఇది వెల్లడైంది. ఈ పరిశోధన ప్రకారం, మీరు మీ నోటి ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోకపోవడం వల్ల అది అనేక వ్యాధులకు కారణమవుతుందని వైద్యుల పరిశోధనలు వెల్లడైంది.

అధ్యయనం ఏం చెబుతోంది?
పలు అధ్యయనా ప్రకారం నోటి ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోకపోతే, అనేక తీవ్రమైన వ్యాధుల ప్రమాదాన్ని పెంచుతుందని వెల్లడించింది. అందువల్ల, దంతాలు, చిగుళ్ళను ప్రతిరోజూ శుభ్రం చేసుకోవాలి. శుభ్రపరచడం అంటే కావిటీస్ లేదా దుర్వాసనను నివారించడమే కాకుండా, మొత్తం ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి.


నోటి ఆరోగ్యం సరిగా లేకపోతే క్యాన్సర్, గుండె జబ్బులు , మధుమేహం, గర్భధారణ సమయంలో వచ్చే సమస్యలు, అల్జీమర్స్ వ్యాధి వంటి ప్రాణాంతక వ్యాధులకు దారితీయవచ్చని అధ్యయనం తెలిపింది. అందువల్ల, ఆరోగ్యంగా ఉండటానికి, నోటి ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోవడం కూడా ముఖ్యమని తెలుసుకోవడం ముఖ్యమంటున్నారు.

నోటి ఆరోగ్యం, క్యాన్సర్ మధ్య సంబంధం
నోటి ఆరోగ్యం సరిగ్గా లేకపోవడం వల్ల క్యాన్సర్, ముఖ్యంగా తల, మెడ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. వాస్తవానికి, నోటిలో ఉండే పోర్ఫిరోమోనాస్ జింగివాలిస్, ప్రీవోటెల్లా ఇంటర్మీడియా వంటి హానికరమైన బ్యాక్టీరియా క్యాన్సర్‌కు కారణమవుతుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

నోటి ఆరోగ్యాన్ని ఎలా జాగ్రత్తగా చూసుకోవాలి?
నోటి ఆరోగ్యాన్ని సరిగ్గా చూసుకోవడానికి, రోజుకు రెండుసార్లు బ్రష్ చేయండి.

. సరైన బ్రషింగ్ టెక్నిక్ ఉపయోగించండి. చాలా తీవ్రంగా బ్రష్ చేయడం మానుకోండి ఎందుకంటే ఇది నష్టాన్ని కలిగిస్తుంది.
. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఫ్లాసింగ్ కూడా చాలా ముఖ్యం. బ్రష్ చేరుకోలేని భాగాలను ఇది శుభ్రం చేస్తుంది.
. మీ దంతాలు, చిగుళ్ళను శుభ్రంగా ఉంచుకోవడానికి మీరు మౌత్ వాష్‌ను కూడా ఉపయోగించవచ్చు.
. చక్కెర హానికరమైన బ్యాక్టీరియా పెరుగుదలను ప్రోత్సహిస్తుంది కాబట్టి, చక్కెర ఎక్కువగా ఉండే ఆహారాలు, పానీయాలను తీసుకోవడం తగ్గించండి.
. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి, పుష్కలంగా నీరు త్రాగండి, ఇది ఎక్కువ లాలాజలాన్ని ఉత్పత్తి చేస్తుంది, బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది.
. ఒకే టూత్ బ్రష్‌ను ఎక్కువసేపు వాడటం మానుకోండి. ప్రతి 3-4 నెలలకు ఒకసారి లేదా ముళ్ళగరికెలు అరిగిపోయినప్పుడు దాన్ని మార్చండి.
. ధూమపానం లేదా పొగాకు మానుకోండి. ఇది చిగుళ్ల వ్యాధి, నోటి క్యాన్సర్, దుర్వాసన ప్రమాదాన్ని పెంచుతుంది.

Also Read: జీవో 49కు వ్యతిరేకంగా ఆదివాసీ ధర్నా.. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో బంద్

Related News

Non-vegetarian food: ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా ? అయితే జాగ్రత్త !

Parenting Tips: పిల్లల అరుపులు ఎలా అర్థం చేసుకోవాలి? తల్లిదండ్రులకు అవసరమైన సమాచారం

Chapati: నిజమా.. చపాతి అలా తింటే ఆరోగ్యానికి ప్రమాదమా..?

Hair Loss: ఈ విటమిన్ లోపమే.. జుట్టు రాలడానికి కారణమట !

Ajwain Water Benefits: వాము నీరు తాగితే.. ఈ ఆరోగ్య సమస్యలు పరార్ !

Fact Check: నవ్వితే కళ్ల నుంచి నీరు వస్తుందా? అయితే కారణం ఇదీ?

Big Stories

×