NHPC Recruitment: నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్. నేషనల్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లో పలు ఉద్యోగాలను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. గ్రాడ్యుయేట్ లేదా డిప్లొమా లేదా ఐటీఐ లేదా బీకామ్, బీటెక్, బీఈ, ఎల్ఎల్ బీ, ఎంఏ, పీజీ డిప్లొమా పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ సంబంధించిన విద్యార్హత, వయస్సు, స్టైఫండ్, దరఖాస్తు ప్రక్రియ, ఉద్యోగ ఎంపిక ప్రక్రియ, జీతం, తదితర వివరాల గురించి తెలుసుకుందాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 361
ఇందులో గ్రాడ్యుయేట్ అప్రెంటీస్, డిప్లొమా అప్రెంటీస్, ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీకామ్, బీటెక్, బీఈ, ఎల్ఎల్ బీ, డిప్లొమా, ఐటీఐ, బీఎస్ డబ్ల్యూ, ఎంఏ, ఎంబీఏ, పీజీడీఎం లేదా పీజీ డిప్లొమా పాసై ఉండాలి.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదిహేనళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
స్టైఫండ్: ఎంపికైన అభ్యర్థులకు స్టైఫండ్ ఉంటుంది. నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు రూ.15వేలు, డిప్లొమా అప్రెంటీస్ పోస్టుకు రూ.13,500, ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు రూ.12000 స్టైఫండ్ ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జులై 11
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఆగస్టు 11
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.nhpcindia.com/welcome/job
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించిన వారికి స్టైఫండ్ కూడా ఉంటుంది. . నెలకు గ్రాడ్యుయేట్ అప్రెంటీస్ పోస్టుకు రూ.15వేలు, డిప్లొమా అప్రెంటీస్ పోస్టుకు రూ.13,500, ఐటీఐ ట్రేడ్ అప్రెంటీస్ పోస్టుకు రూ.12000 స్టైఫండ్ ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 361
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్ట్ 11
ALSO READ: MTS JOBS: పదితో భారీగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.56వేల జీతం
ALSO READ: RCFL: పదితో ఉద్యోగాలు.. సింపుల్ ప్రాసెస్.. జీతమైతే అక్షరాల రూ.55,000