Veena Vani: ఇటీవల కాలంలో వరుసగా విమాన ప్రమాదాలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో విమానంలో ప్రయాణం చేయాలంటే కూడా చాలామంది భయపడుతున్నారు. మన ఈ జీవన ప్రయాణంలో ముందుకు సాగాలి అంటే కొన్నిసార్లు ఇలాంటి కఠినమైన, ప్రమాదకరమైన ప్రయాణాలు కూడా చేయాల్సి ఉంటుంది. అయితే అహ్మదాబాద్ విమాన ఘటన తర్వాత విమానం ఎక్కిన ప్రతి ఒక్కరు తిరిగి సేఫ్ గా ల్యాండ్ అవుతామా? లేదా? అన్న ఆందోళనలోనే ఉన్నారు. తాజాగా వేణు స్వామి (Venu Swamy)భార్య వీణా వాణి(Veena Vani)కి కూడా ఇలాంటి అనుభవమే ఎదురయింది అంటూ ఈమె ఒక వీడియోని సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు.
పనిచేయని ఏసీలు..
ఈ వీడియోలో భాగంగా ఆమె విమాన ప్రయాణం (flight journey)చేయాల్సి వచ్చిందని అయితే విమానంలోకి ఎక్కినప్పటి నుంచి దిగే వరకు ఎంతో భయంగానే ఉందని తెలిపారు. అసలు సేఫ్ గా భూమి మీదకు ల్యాండ్ అవుతామా? లేదా? గాల్లో ప్రాణాలు గాల్లోనే పోతాయా? అనే భయంతోనే విమాన ప్రయాణం చేశానని తెలిపారు. ఈ విమానంలో ప్రయాణిస్తున్నంత సేపు భగవంతుడిపైనే భారం వేసానని ఈమె అసలు విషయం తెలిపారు. విమానం టేకాఫ్ అయినప్పటి నుంచి ల్యాండ్ అయ్యేవరకు ఏసీలు పనిచేయలేదని తెలియజేశారు. ఏసీ పనిచేయకపోవడం వల్ల ప్రయాణికులు అందరూ కూడా చాలా ఇబ్బందులకు గురి అయ్యారని వెల్లడించారు.
విమానంలో సాంకేతిక లోపం..
ఇలా ఏసీలు పనిచేయకపోవడంతో విమానంలో ఏదైనా సాంకేతిక లోపం(Techonical Issue) ఉందా? అనే సందేహాలు ప్రతి ఒక్కరికి కలిగాయని, ఇదే విషయం గురించి సిబ్బందిని ప్రశ్నించిన సరైన సమాధానం మాత్రం రాలేదు అంటూ ఈమె సదురు విమాన సమస్థ పై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలా ఏసి పనిచేయకపోవడంతో ఇదేదో చెడుకు సంకేతంగా(Bad Sign) భావించామని విమానం దిగే వరకు క్షణక్షణం భయంతోనే గడిపామని వీణా వాణి తెలిపారు. వందల మందితో ప్రయాణం చేస్తున్నటువంటి విమానంలో ఇంత పెద్ద సమస్య ఉంటే ఎవరు సమస్యను పట్టించుకోవడం లేదు? ఈ సమస్య గురించి ప్రశ్నిస్తే సిబ్బంది మాత్రం చిన్న సారీ చెబుతున్నారు. సారీ చెబితే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా అంటూ మండిపడ్డారు.
https://www.facebook.com/reel/1422381148911955
ఏది ఏమైనా వీణ వాణి ప్రయాణిస్తున్న విమానంలో ఎలాంటి ప్రమాదకర సంఘటనలు జరగకుండా చాలా సేఫ్ గా ల్యాండ్ అయ్యాము అంటూ ఈమె తనకు జరిగిన సంఘటన గురించి అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక వీణ వాణి వేణు స్వామి భార్యగా మాత్రమే కాకుండా వీణ వాయిద్యకారిణిగా కూడా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా వృత్తి పరంగా ఎంతో బిజీగా ఉండే ఈమె సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటూ నిత్యం ఎన్నో రకాల వీడియోలను షేర్ చేస్తూ సోషల్ మీడియా వేదికగా ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు.
Also Read: బాహుబలికి ది ఎపిక్ విడుదల అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన జక్కన్న?