BigTV English

Bahubali The Epic: బాహుబలికి ది ఎపిక్ విడుదల అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన జక్కన్న?

Bahubali The Epic: బాహుబలికి ది ఎపిక్ విడుదల అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన జక్కన్న?

Bahubali The Epic: టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ (Prabhas)నటించిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం బాహుబలి(Bahubali). అప్పటివరకు తెలుగులో స్టార్ హీరోగా కొనసాగుతున్న ప్రభాస్ బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోగా మారిపోయారు. రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ప్రభాస్ కెరియర్ కు టర్నింగ్ పాయింట్ అని చెప్పాలి. ఈ సినిమా తర్వాత ప్రభాస్ పూర్తి స్థాయిలో పాన్ ఇండియా సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా బిజీగా ఉన్నారు. ఇలాంటి ఒక అద్భుతమైన బ్లాక్ బస్టర్ సినిమా వచ్చి నేటికి సరిగ్గా 10 సంవత్సరాలు కావడంతో చిత్ర బృందం బాహుబలి సినిమా జ్ఞాపకాలను నెమరు వేసుకుంటున్నారు.


అనేక ప్రయాణాలకు నాంది..

ఈ క్రమంలోనే చిత్ర దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి బాహుబలి సినిమా విడుదల అయ్యి పది సంవత్సరాలు కావడంతో ఆయన తన అధికారిక ఎక్స్ ఖాతా ద్వారా ఈ సినిమాకు సంబంధించిన అనుభవాలను అభిమానులతో పంచుకున్నారు. “బాహుబలి… అనేక ప్రయాణాలకు నాంది.. లెక్కలేనన్ని జ్ఞాపకాలు, అంతులేని ప్రేరణ, 10 సంవత్సరాలు అయ్యింది” అంటూ ఈ సినిమా గురించి ఆసక్తికరమైన పోస్ట్ చేశారు. అలాగే బాహుబలి ది ఎపిక్ (Bahubali The Epic)విడుదల గురించి కూడా ఈయన క్లారిటీ ఇచ్చారు.


అక్టోబర్ 31న విడుదల..

బాహుబలి సినిమా రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. అయితే ఈ రెండు భాగాలను కలిపి ఒక సినిమాగా రూపొందించారు. ఈ సినిమాని “బాహుబలి ది ఎపిక్” పేరుతో విడుదల చేయటానికి చిత్ర బృందం సిద్ధమయ్యారు. అయితే ఈ చిత్రాన్ని అక్టోబర్ 31వ తేదీ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కాబోతుంది అంటూ ఈ సందర్భంగా రాజమౌళి తెలియచేశారు. అయితే ఈ రెండు భాగాలను ఏమాత్రం డిస్టర్బ్ చేయకుండా కొని కీలకమైన సన్నివేశాలతో బాహుబలి ది ఎపిక్ విడుదల కాబోతుందని తెలుస్తోంది. మరి ఈ సినిమాకు ఎలాంటి ఆదరణ వస్తుందో తెలియాల్సి ఉంది.

రాజమౌళి దర్శకత్వంలో తెరికెక్కిన ఈ సినిమాలో ప్రభాస్, రానా, అనుష్క, తమన్నా ప్రధాన పాత్రలలో నటించగా రమ్యకృష్ణ ,నాజర్, సత్యరాజ్ వంటి తదితరులు కీలక పాత్రలలో నటించారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ రేంజ్ పూర్తిగా మారిపోయింది. అలాగే బాహుబలి సినిమా తెలుగు చిత్ర పరిశ్రమకు ఎంతో గొప్ప పేరు ప్రఖ్యాతలను తీసుకువచ్చిందని చెప్పాలి. అప్పటివరకు తెలుగు సినీ ఇండస్ట్రీ అంటేనే చులకన భావన చూసేవారికి తెలుగు సినిమా సత్తా ఏంటో రాజమౌళి ఈ సినిమా ద్వారా అందరికీ పరిచయం చేశారు. ఇక ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి ఎంతోమంది దర్శకులు తమ సినిమాలను పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఇక రాజమౌళి ప్రస్తుతం మహేష్ బాబుతో మరో పాన్ ఇండియా సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.

Also Read: కార్డెక్స్ ఆధ్వర్యంలో కుమార్ సాను లైవ్ కన్సర్ట్… ఎప్పుడు? ఎక్కడంటే?

Related News

Little Hearts Collection : ‘లిటిల్ హార్ట్స్‌’కి బిగ్ రెస్పాన్స్.. ఫస్ట్ వీకెండ్ సూపర్ కలెక్షన్స్..

Pongal 2026: సంక్రాంతి రేస్ లో శర్వా కూడా.. ఎన్ని సినిమాలు దింపుతార్రా బాబు

Ghaati Collection : దారుణంగా పడిపోయిన కలెక్షన్స్… పాపం అనుష్కకు ఐదు కోట్లు కూడా రాలేదు

Kamal Haasan: రూమర్స్ కి ఆజ్యం పోసిన కమలహాసన్.. రజనీకాంత్ తో అది నిజమే అంటూ!

Kayadu Lohar: వెకేషన్స్ లో సందడి చేస్తున్న కాయాదు లోహర్.. ఫోటోస్ వైరల్

SP Charan : నన్ను వేధిస్తున్నాడు… అసిస్టెంట్ డైరెక్టర్‌పై ఎస్పీ చరణ్ ఫిర్యాదు

Big Stories

×