RCFL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. ముంబైలోని రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్ (ఆర్‌సీఎఫ్ఎల్) లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, పోస్టులు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, తదితర వివరాల గురించి తెలుసుకుందాం.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 74
ఇందులో ఆపరేటర్ ట్రైనీ, బాయిలర్ ఆపరేటర్ గ్రేడ్-3, జూనియర్ ఫైర్ మెన్ గ్రేడ్ -2, నర్స్ గ్రేడ్-2, టెక్నీషయిన్ ట్రైనీ, టెక్నీషియన్ మెకానిక్ ట్రైనీ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: 2025 ఫిబ్రవరి 1 నాటికి 33 నుంచి 36 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. ఆపరేటర్ కు రూ.22వేల నుంచి రూ.60వేలు, బాయిలర్ ఆపరేటర్ ఉద్యోగానికి రూ.20వేల నుంచి రూ.55వేల జీతం, జూనియర్ ఫైర్ మెన్ ఉద్యోగానికి రూ.18వేల నుంచి రూ.42వేలు, నర్స్ గ్రేడ్ -2 ఉద్యోగానికి రూ.22వేల నుంచి రూ.60వేలు, టెక్నీషియన్ ఉద్యోగానికి రూ.22వేల నుంచి రూ.60వేల జీతం ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జులై 9
దరఖాస్తుకు చివరి తేది: జులై 25
ఉద్యోగ ఎంపిక విధానం: ఆన్ లైన్ టెస్ట్, స్కిల్ టెస్ట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.rcfltd.com/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. ఆపరేటర్ కు రూ.22వేల నుంచి రూ.60వేలు, బాయిలర్ ఆపరేటర్ ఉద్యోగానికి రూ.20వేల నుంచి రూ.55వేల జీతం, జూనియర్ ఫైర్ మెన్ ఉద్యోగానికి రూ.18వేల నుంచి రూ.42వేలు, నర్స్ గ్రేడ్ -2 ఉద్యోగానికి రూ.22వేల నుంచి రూ.60వేలు, టెక్నీషియన్ ఉద్యోగానికి రూ.22వేల నుంచి రూ.60వేల జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 74
దరఖాస్తుకు చివరి తేది: జులై 25
ALSO READ: Indian Coast Guard: ఇండియన్ కోస్ట్ గార్డులో ఉద్యోగాలు.. రూ.1.23లక్షల జీతంతో జాబ్స్, డోంట్ మిస్