E-Paper
Advertisement

Intelligence Bureau: టెన్త్ క్లాస్‌తో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. నెలకు రూ.56,900 జీతం, అప్లికేషన్ ఎప్పటినుంచంటే?

Intelligence Bureau: టెన్త్ క్లాస్‌తో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. నెలకు రూ.56,900 జీతం, అప్లికేషన్ ఎప్పటినుంచంటే?
Advertisement

Intelligence Bureau: ప్రభుత్వ ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే నిరుద్యోగ అభ్యర్థులకు ఇది భారీ గుడ్ న్యూస్. ఇంటెలిజెన్స్ బ్యూరో నుంచి పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల అయ్యింది. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అర్హత కలిగిన అభ్యర్థులకు ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. పపదో తరగతి పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, పోస్టులు- వెకెన్సీలు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, దరఖాస్తు ఫీజు, తదితర విధానాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.

ఇంటెలిజెన్స్‌ బ్యూరో (INTELLIGENCE BUREAU) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో దేశ వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 362 మల్టీ టాస్కింగ్‌ స్టాఫ్‌(ఎంటీఎస్‌) ఉద్యోగాల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు నవంబర్‌ 22వ తేదీ నుంచి డిసెంబర్ 14 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోండి.

Advertisement

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 362

తెలుగు రాష్ట్రాల్లో..

Advertisement

1. హైదరాబాద్‌: 06
2. విజయవాడ: 03

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్ క్లాస్ పాసై ఉండాలి.

వయస్సు: 2025 డిసెంబర్‌ 14వ తేదీ నాటికి  18 నుంచి 25 ఏళ్లు ఉండాలి. ఓబీసీకి 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు 5 ఏళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10 ఏళ్లు వయోపరిమితిలో సడలింపు ఉండును.

జీత: సెలక్ట్ అయిన అభ్యర్థులకు రూ.18వేల నుంచి రూ.56,900 జీతం ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తుకు ప్రారంభ తేది:  2025 నవంబర్ 22

దరఖాస్తుకు చివరి తేది: 2025 డిసెంబర్ 14

దరఖాస్తు ఫీజు: జనరల్ , ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు రూ.650 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, ఈఎస్‌ఎం, పీడబ్ల్యూబీడీ, మహిళా అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: ప్రిలిమినరీ, మెయిన్స్‌ (టైర్‌-1, 2) పరీక్షల ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://www.mha.gov.in/

ALSO READ: Flight Operations Close: అలర్ట్.. రేపు ఈ విమానాశ్రయంలో 6 గంటల సేపు విమాన సేవలు బంద్, వెంటనే చెక్ చేసుకోండి!

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×