Malayalam Movie :మోహన్ లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ నటించిన రీసెంట్ మూవీ ఎల్2: ఏంపురాన్ బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్స్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా విడుదలై ఎనిమిది రోజుల్లోనే అత్యధిక వసూలు సాధించిన మలయాళం సినిమాగా ఎల్ 2 నిలిచింది. మోహన్ లాల్ హీరోగా మాలీవుడ్ లోనే కాదు టాలీవుడ్ లో కూడా మంచి ఆదరణ గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన చిత్రాలన్నీ తెలుగులో విడుదలై మంచి విజయాన్ని సాధిస్తున్నాయి. పృధ్విరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా ముందు నుంచి భారీ అంచనాలే ఉన్నాయి. మేకర్స్ ప్రమోషన్స్ కూడా చాలా బాగా చేశారు. టాలీవుడ్ లో దిల్ రాజు విడుదల చేస్తుండడంతో ఈ చిత్రానికి తెలుగులో కూడా మంచి హైప్ క్రియేట్ అయింది. భారీ అంచనాల మధ్య మార్చి 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా రికార్డ్స్ ని ఏ విధంగా కొల్లగొడుతుందో ఇప్పుడు చూద్దాం..
ఎంపురాన్ బాక్సాఫీస్ కలెక్షన్ ..
మలయాళం లో సూపర్ బ్లాక్ బస్టర్ హిట్గా థ్రిల్లర్ మూవీగా మజ్ను బాయ్స్ రికార్డు సృష్టించింది. ఆ సినిమా తర్వాత మాలీవుడ్ స్టార్ హీరోలు మోహన్ లాల్ పృథ్వీరాజ్ సుకుమారన్, నటించిన ఎల్ 2: ఎం పురాన్ సినిమా ఎనిమిది రోజుల్లో ఆ రికార్డులను బ్రేక్ చేసింది. మజ్ను బాయ్స్ రికార్డులను బ్రేక్ చేసి ఇప్పుడు మలయాళంలో అత్యధిక వసూలు సాధిస్తున్న సినిమా గా నిలిచింది. సినిమా రిలీజ్ కి ముందే ఎన్నో వివాదాలను నెలకొల్పింది. ఈ సినిమాలో గుజరాత్ లో జరిగిన అల్లర్లను చూపిస్తున్నారని విలన్ కి పెట్టిన పేరు పై వివాదం చెలరేగడం జరిగింది. అవి ఏమాత్రం సినిమా హిట్ ని ఆపలేకపోయాయి. బాక్సాఫీస్ వద్ద దూసుకుపోతూ కనీసం రోజుకి రూ.10 నుంచి 12 కోట్లు వసూలు చేస్తుందని లో ఆశ్చర్యం లేదు. ఈ సినిమా 300 కోట్ల మార్కు అందుకుంటుందని, మలయాళం లో ఇంత ఎక్కువ కలెక్షన్స్ రికార్డు సాధించిన సినిమాగా ఎల్ 2 నిలుస్తుంది.
ఇండస్ట్రియల్ హిట్ ..
మోహన్ లాల్ ఆరేళ్ల కిందట లూసీఫర్ సినిమాతో బాక్సాఫీస్ రికార్డులను తిరగరాశారు. ఇప్పుడు ఈ సినిమాతో ఆ రికార్డులను రిపీట్ చేశారు. తాజాగా ఈ మూవీ 8 రోజుల్లోనే 250 కోట్లు పైగా వసూళ్లు సాధించింది. విడుదల అయిన 10 రోజులకి 300 కోట్లు రాబడుతున్న ఫస్ట్ మాలీవుడ్ సినిమా గా ఎల్ 2: ఎంపురాన్ నిలిచింది. అంతేకాక మజ్ను బాయ్స్ సినిమా రికార్డులను బ్రేక్ చేసినట్లుగా, మలయాళం లో అత్యధిక వసూలు సాధించిన సినిమాగా, ఇండస్ట్రీ హిట్గా ఎల్ 2 : ఎం పురాన్ నిలిచినట్టు మేకర్స్ ఎక్స్ వేదికగా తెలిపారు. ఇండస్ట్రియల్ హిట్ అనే పోస్టర్ ను ఎక్స్ వేదికగా రిలీజ్ చేసారు. రిలీజ్ అయిన కొద్ది రోజుల్లోనే సూపర్ హిట్ నిలిచిన ఈ మూవీ రానున్న రోజుల్లో బాక్సాఫీస్ రికార్డ్స్ ని కొల్లగొడుతుంది అనడంలో ఎలాంటి ఆశ్చర్యం లేదు.
NEW INDUSTRY HIT IN MALAYALAM :#Enpuraan breaks WW gross of #ManjummelBoys & emerges as the new Industry hit in Kerala. pic.twitter.com/Mq78djqgb3
— Friday Matinee (@VRFridayMatinee) April 5, 2025