AP STATE JUDICIAL SERVICE: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నిరుద్యోగులకు ఇది గుడ్ న్యూస్. లా చేసిన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్ లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగం లో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం కల్పించనున్నారు. ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.
ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్ (AP STATE JUDICIAL SERVICE) ఖాళీగా ఉన్న జిల్లా జడ్జి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. మార్చి 27న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఉద్యోగ ఖాళీల సంఖ్య: 14
ఏపీ స్టేట్ జ్యుడీషియల్ సర్వీస్ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. జిల్లా జడ్జి (ఎంట్రీ లెవల్) ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో నోటిఫికేషన్ విడుదలైన తేదీ నాటికి ఏడేళ్లకు తక్కువ కాకుండా న్యాయవాద వృత్తిలో వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.
దరఖాస్తు చివరి తేది: మార్చి 27
వయస్సు: 2025 మార్చి 1 నాటికి 35 నుంచి 45 ఏళ్ల మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీలకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
చిరునామా: దరఖాస్తును ది చీఫ్ సెక్రటరీ టు ది గవర్నమెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్, సెక్రటేరియట్ బిల్డింగ్స్, వెలగపూడి, అమరావతి, గుంటూరు జిల్లా, పిన్ కోడ్-522238 చిరునామాకి పంపాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రూ.800 ఫీజు ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
జీతం: ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.1,44,840 నుంచి రూ.1,94,660 జీతం ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://aphc.gov.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కల్పించనున్నారు. ఉద్యోగానికి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు రూ.1,44,840 నుంచి రూ.1,94,660 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 27
మొత్తం పోస్టుల సంఖ్య: 14
ALSO READ: AIIMS Recruitment: గుడ్ న్యూస్.. సొంత రాష్ట్రలో ఉద్యోగం.. జీతమైతే నెలకు రూ.26,500