BigTV English

Sunny Deol: సౌత్ వాళ్లను చూసి నేర్చుకోండి.. బాలీవుడ్ మేకర్స్‌కు సీనియర్ హీరో సలహా

Sunny Deol: సౌత్ వాళ్లను చూసి నేర్చుకోండి.. బాలీవుడ్ మేకర్స్‌కు సీనియర్ హీరో సలహా

Sunny Deol: ఈరోజుల్లో బాలీవుడ్‌తో పోలిస్తే టాలీవుడే స్పీడ్‌గా దూసుకుపోతోంది అన్నది అందరికీ తెలిసిన ఓపెన్ సీక్రెట్. హిందీలో ఏడాదికి ఒక సినిమా బ్లాక్‌బస్టర్ హిట్ అవుతుంటే టాలీవుడ్ నుండి మాత్రం అలాంటివి అరడజను సినిమాలు వస్తున్నాయి. ఈ విషయంలో బాలీవుడ్ మేకర్స్ కూడా ఫీలవుతున్నారు. ఇక బాలీవుడ్ స్టార్ హీరోలు సైతం సౌత్ సినిమాలతో తమ సినిమాలను పోలుస్తూ అలా మన సినిమాలు ఉండడం లేదని ఓపెన్ కామెంట్స్ చేస్తున్నారు. ఇటీవల బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ అలాంటి కామెంట్స్ చేయగా.. తాజాగా ఆ లిస్ట్‌లోకి మరొక హీరో కూడా యాడ్ అయ్యాడు. తనే ‘జాట్’ (Jaat) ఫేమ్ సన్నీ డియోల్. ప్రస్తుతం ఈ హీరో సౌత్ మేకర్స్‌పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.


చూసి నేర్చుకోవాలి

ప్రస్తుతం సన్నీ డియాల్ (Sunny Deol) లాంటి సీనియర్ బాలీవుడ్ హీరో.. గోపీచంద్ మలినేని (Gopichand Malineni) లాంటి తెలుగు దర్శకుడితో సినిమా చేయడానికి సిద్ధమయ్యాడు. వీరిద్దరి కాంబినేషన్‌లో ‘జాట్’ అనే సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. అందులో సౌత్ మేకర్స్‌ను తెగ పొగిడేశాడు సన్నీ డియోల్. ‘‘నా నిర్మాతలు చాలా మంచివాళ్లు. ముంబాయ్‌కు చెందిన ప్రొడ్యూసర్స్ వీరిని చూసి నేర్చుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాను. మనమంతా దానిని బాలీవుడ్ అని పిలుస్తాం కానీ ముందుగా దానిని హిందీ సినిమా అని పిలుస్తూ ప్రేమతో సినిమాలు ఎలా తెరకెక్కించాలో నేర్చుకుందాం’’ అంటూ టాలీవుడ్, బాలీవుడ్‌ను పోలుస్తూ మాట్లాడాడు.


సౌత్‌లో సెటిల్

‘‘సౌత్ వాళ్లు సబ్జెక్ట్‌పై ఫోకస్ చేస్తారు. దర్శకుడిని ఎంపిక చేసుకుంటారు. తన విజన్‌ను నమ్ముతారు. వాళ్లు అనుకుంది సాధించడంలో ఒక్క అవకాశం కూడా వదులుకోరు. కథే వాళ్లకు హీరో. వీళ్లందరితో కలిసి పనిచేయడం నాకు చాలా సంతోషంగా అనిపించింది. నేను ఇప్పటికే వీరితో మరొక సినిమా చేయండి అని అడిగేశాను. నేను సౌత్‌లోనే వెళ్లి సెటిల్ అయిపోతే బాగుంటుంది అనిపిస్తోంది. సౌత్ సినిమాలు నమ్మకంపై నిలబడతాయి. అందుకే అవి పాన్ ఇండియా స్థాయిని చేరుకున్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు సౌత్ సినిమాలకు కనెక్ట అవుతారు. హిందీ సినిమా కూడా ఇదే ఫాలో అయితే బాగుంటుంది. నేను నటించిన ఘటక్, దామిని, అర్జున్ లాంటి సినిమాలను మళ్లీ చేస్తే బాగుంటుంది’’ అని చెప్పుకొచ్చాడు సన్నీ డియోల్.

Also Read: అలా చేయకపోతే టాలీవుడ్‌లో ఉండలేం.. పూర్తిగా ఓపెన్ అయిపోయిన ప్రభాస్ బ్యూటీ

ఇంట్రెస్ట్ పోయింది

‘‘మొదట్లో ఒక దర్శకుడు కథ చెప్పగానే నిర్మాతకు నచ్చేది. వాళ్లిద్దరూ కలిసి ఆ కథకు కమిట్ అయ్యి తెరకెక్కించేవాళ్లు. ఆ తర్వాత ఇందులోకి కార్పరేట్స్ వచ్చేశారు, అంతా కమర్షియల్ అయిపోయింది. అదే క్రమంలో చాలామందికి ఫిల్మ్ మేకింగ్‌పై ఇంట్రెస్ట్ పోయింది. అందరూ బాధితులే అయిపోయారు. ఫిల్మ్ మేకింగ్‌పై ఆశ ఉన్నవారు వెనకబడిపోయారు. ఒక్కసారిగా నార్త్‌లో ఇదంతా మారడం కష్టమే. హైదరాబాద్‌లోని నిర్మాతలు మాత్రం డైరెక్టర్‌కు మొత్తం ఫ్రీడమ్ ఇచ్చేశారు. అక్కడ దర్శకులను తమ పని తమను చేయనిస్తారు. అక్కడ డబ్బులు కూడా ఎక్కువగానే ఖర్చుపెడతారు ఎందుకంటే అది అవసరం కాబట్టి. దేనికైనా ఓపిక ఉండడం ముఖ్యం’’ అని తెలిపాడు సన్నీ డియోల్.

Related News

Big Tv Vare wah: వారెవ్వా.. క్యా షో హై.. టేస్టీ తేజ.. శోభా శెట్టి  యాంకర్లుగా కొత్త షో.. అదిరిపోయిన ప్రోమో!

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Big Stories

×