E-Paper
Advertisement

Railway Jobs: శుభవార్త.. సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో 4232 ఉద్యోగాలు..

Railway Jobs: శుభవార్త.. సికింద్రాబాద్ రైల్వే జోన్‌లో 4232 ఉద్యోగాలు..
Advertisement
Railway Jobs: టెన్త్, ఐటీఐ పూర్తి చేసిన  విద్యార్థులకు ఇంత మంచి అవకాశం రాదు. సౌత్ సెంట్రల్ రైల్వే భారీ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఇంత మంచి అవకాశాన్ని అర్హత ఉన్న అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవచ్చు.

దక్షిణ మధ్య రైల్వేలో 4232 పోస్టులతో భారీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ పోస్టులకు తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల వారు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, మన్యం, విజయనగరం,  విశాఖపట్నం జిల్లాలు మినహాయించి మిగతా జిల్లాల వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.

మొత్తం ఉద్యోగాల సంఖ్య: సౌత్ ఈస్టర్న్ రైల్వే లో 4232 అప్రెంటిస్ పోస్టులు వివిధ ట్రేడ్స్ లో భర్తీ చేయడం జరుగుతోంది.

Advertisement

ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. AC మెకానిక్, ఎయిర్ కండిషనింగ్, కార్పెంటర్, డీజిల్ మెకానిక్, ఎలక్ట్రానిక్ మెకానిక్, ఇండస్ట్రియల్ ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రీషియన్, ఎలక్ట్రికల్ ( S&T)(ఎలక్ట్రీషియన్) , ట్రైన్ లైటింగ్ (ఎలక్ట్రీషియన్), ఫిట్టర్, మోటర్ మెకానిక్ వెహికల్ (MMV) , మెషినిస్ట్, మెకానిక్ మిషన్ టూల్ మెయింటెనెన్స్ (MMTM) , పెయింటర్, వెల్డర్ అనే ట్రేడ్లలో ఈ పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఆసక్తి గల అభ్యర్థులు వెంటనే ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

విద్యార్హత: టెన్త్ పాస్‌తో పాటు 50 శాతం మార్కులతో సంబంధిత  విభాగంలో ఐటీఐ కంప్లీట్ చేసి ఉండాలి.

Advertisement

అప్రెంటీస్ శిక్షణ కాల పరిమితి: వన్ ఇయర్ ఉంటుంది. వన్ ఇయర్ పాటు అప్రెంటీస్ శిక్షణ ఉంటుంది.

దరఖాస్తు చివరి తేది: 2025 జనవరి 27 లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు విధానం: అర్హత  ఉన్న అభ్యర్థులు ఆన్ లైన్ లో దర ఖాస్తు చేసుకోవాలి.

వయస్సు: 2024 డిసెంబర్ 28 నాటికి 15 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి.  (SC, ST అభ్యర్థులకు ఐదు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది.
OBC అభ్యర్థులకు మూడు సంవత్సరాలు వయస్సులో సడలింపు ఉంటుంది)

Also Read: Jobs in Tata Memorial: డిప్లొమా, డిగ్రీ, బీటెక్ అర్హతతో జాబ్స్.. భారీగా జీతం.. ఇంకెందుకు ఆలస్యం

దరఖాస్తు ఫీజు: రూ.100 ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, మహిళా, దివ్యాంగ అభ్యర్థులకు ఎలాంటి ఫీజు ఉండదు)

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×