Jobs in Tata Memorial: డిప్లొమా, డిగ్రీ, బీఈ/బీటెక్, బీఎస్సీ, బీఈ పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. భారీ వేతనంతో కూడిన ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ముంబైలోని టాటా మెమోరియల్ సెంటర్- అడ్వాన్స్ డ్ సెంటర్ ఫర్ ట్రీట్ మెంట్, రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ ఇన్ క్యాన్సర్ (ACTREC) ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజైంది. అర్హత ఉన్న అభ్యర్థులు ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 17
ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. సైంటిఫిక్ ఆఫీసర్, నర్ ఏ, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్ బీ, టెక్నీషియన్ ఏ, లోయర్ డివిజన్ క్లర్స్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
సైంటిఫిక్ ఆఫీసర్ -1
నర్స్ ఏ- 04
అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్- 02
సైంటిఫిక్ అసిస్టెంట్ బీ- 04
టెక్నీషియన్ ఏ- 05
లోయర్ డివిజన్ క్లర్స్-01 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిప్లొమా, డిగ్రీ, బీఈ, బీటెక్, బీఎస్సీ, బీఈ, హెచ్ ఎస్ సీ, పీహెచ్ డీ పాస్ తో పాటు ఉద్యోగ అనుభవం, కంప్యూటర్ అవగాహన కూడా ఉండాలి.
వేతనం: నెలకు లోయర్ డివిజన్ క్లర్క్ కు రూ.19,900, సైంటిఫిక్ అసిస్టెంట్ కు రూ.35,400, నర్స్, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు రూ.44,900, సైంటిఫిక్ ఆఫీసర్ కు రూ.78,800 జీతం ఉంటుంది.
వయస్సు: సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగానికి 45 ఏళ్లు, నర్స్, సైంటిఫిక్ అసిస్టెంట్ కు 30 ఏళ్లు, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కు 40 ఏళ్లు, టెక్నీషియన్, లోయర్ డివిజన్ క్లర్స్‌కు 27 ఏళ్లు మించి ఉండరాదు. (ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.)
వర్క్ ప్లేస్: ఎసీటీఆర్ఈసీ, టాటా మెమోరియల్ సెంటర్, ఖర్ఘర్ నవీ ముంబయి
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ఉద్యోగానికి అప్లై చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 జనవరి 24
అఫీషియల్ వెబ్ సైట్: https://actrec.gov.in/
Also Read: Endowment Department: దేవాదాయ శాఖలో జాబ్స్.. ఇవాళే లాస్ట్ డేట్.. APPLY NOW..!
మంచి వేతనంతో కూడిన జాబ్ కావాలంటే ఇది మంచి అవకాశం. మంచి వేతనం కూడిన ఉద్యోగం సమాజంలో మనకు దక్కే గౌరవం గొప్పగా ఉంటుంది. ఇలాంటి ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.