Sekhar Kammula: మామూలుగా ప్రతీ దర్శకుడికి ఒక ఫార్ములా ఉంటుంది. ఆ ఫార్ములాతోనే సక్సెస్ అవుతుంటారు. దానివల్లే ప్రేక్షకుల నుండి ఆదరణ కూడా సంపాదించుకుంటారు. అలాంటి దర్శకుల్లో శేఖర్ కమ్ముల కూడా ఒకటి. ఫీల్ గుడ్ సినిమాలు తెరకెక్కించడం, హీరోయిన్స్‌కు ప్రాముఖ్యత ఇవ్వడం.. ఇదే శేఖర్ కమ్ముల స్టైల్. ఈ ఫార్ములా నుండి ఆయన ఎప్పుడూ పక్కకు తప్పుకోలేదు. కానీ మొదటిసారి ‘కుబేర’ కోసం ఆయనలో చాలా మార్పులు జరిగాయని మూవీ విడుదలయ్యే ముందే ప్రేక్షకులకు అర్థమయిపోతోంది. ప్రస్తుతం ఈ సినిమా నుండి ఎలాంటి అప్డేట్ లేకపోయినా దర్శకుడిలో వచ్చిన మార్పు గురించి మాత్రం ఆడియన్స్ గ్రహిస్తున్నారు.
తక్కువ బడ్జెట్
‘కుబేర’ సినిమాలో ధనుష్ హీరోగా నటించగా నాగార్జున మరొక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. రష్మిక మందనా హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన పోస్టర్స్, టీజర్.. ప్రేక్షకుల్లో అంచనాలు పెంచేశాయి. అంతా బాగానే ఉన్నా.. ఇందులో ఏ ఒక్క చోట కూడా ఇది శేఖర్ కమ్ముల సినిమా అని అనిపించేలా లేదని ప్రేక్షకులు అప్పట్లోనే అభిప్రాయం వ్యక్తం చేశారు. మామూలుగా శేఖర్ కమ్ముల సినిమాలు ఫీల్ గుడ్‌గా ఉండడంతో పాటు అతి తక్కువ బడ్జెట్‌తో తెరకెక్కుతాయి. అనవసరమైన చోట ఎక్కువ బడ్జెట్ పెట్టడం, నిర్మాతలపై అదనపు భారం వేయడం తన స్టైల్ కాదు.. కానీ ‘కుబేర’ విషయంలో అదే జరుగుతోంది.
Also Read: విజయ్ చివరి సినిమా రీమేకా.? కాదా.? క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
విడుదల వాయిదా
ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ‘కుబేర’ మూవీ రూ.100 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతోంది. ఇప్పటివరకు శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఏ సినిమాకు కూడా ఈ రేంజ్‌లో బడ్జెట్ అవ్వలేదు. అంతే కాకుండా ఈ సినిమా విషయంలో మరొక పెద్ద మార్పును ప్రేక్షకులు గమనించారు. మామూలుగా శేఖర్ కమ్ముల (Sekhar Kammula) సినిమా.. ఒక టైమ్ చెప్పి అదే టైమ్‌కు ఎట్టి పరిస్థితుల్లో అయినా విడుదల అవుతుంది. కానీ ‘కుబేర’ విషయంలో అలా జరగడం లేదు. ముందుగా 2024 డిసెంబర్‌లో ఈ మూవీ విడుదల అవుతుందని ప్రకటించారు మేకర్స్. పలు కారణాల వల్ల ఈ మూవీని ఏకంగా 2025 సమ్మర్‌కు పోస్ట్‌పోన్ చేశారు. శేఖర్ కమ్ముల సినిమాలు ఇలా జరగడం అసహజం.
భారీ వీఎఫ్ఎక్స్
2025 జూన్ 20న విడుదల తేదీని ఫిక్స్ చేసుకుంది ‘కుబేర’ (Kubera). గతేడాది విడుదల చేద్దామంటే అప్పటికే షూటింగ్ అవ్వలేదని, పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చాలా ఉన్నాయని విడుదల తేదీని చాలాకాలం పోస్ట్‌పోన్ చేశారు మేకర్స్. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా మొదలు కాగా ఇందులో ఎక్కువ వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ లాంటివి ఉపయోగిస్తున్నారట మూవీ టీమ్. సంక్రాంతి సందర్భంగా ‘కుబేర’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటిస్తారని ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఇలా అన్ని విషయాలు గమనిస్తూ ఉంటే శేఖర్ కమ్ముల కూడా రొటీన్ కమర్షియల్ డైరెక్టర్ లాగా సినిమాల బడ్జెట్ పెంచడం, రిలీజ్ డేట్ పోస్ట్‌పోన్ చేయడం చేస్తున్నారని నిరాశ వ్యక్తం చేస్తున్నారు.