E-Paper
Advertisement

IHMCL Recruitment: ఈ ఉద్యోగం వస్తే లైఫ్ సెట్ భయ్యా.. ఈ అర్హత ఉన్నవాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు..

IHMCL Recruitment: ఈ ఉద్యోగం వస్తే లైఫ్ సెట్ భయ్యా.. ఈ అర్హత ఉన్నవాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు..
Advertisement

IHMCL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసీఎల్) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఏదైనా డిగ్రీ లేదా గేట్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి భవిష్యత్తు కూడా ఉంటుంది. నెలకు రూ.40వేల నుంచి రూ.1,40,000 జీతం ఉంటుంది. అర్హత ఉన్న వారు దరఖాస్తు చేసుకోండి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.

ఇండియన్ హైవేస్ మేనేజ్‌మెంట్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్ఎంసీల్ ) లో డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ విధానంలో ఇంజినీర్ (ఐటీఎస్) పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. జూన్ 2న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Advertisement

⦿ మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 49

ఇండియన్ హైవేస్ మేనేజ్ మెంట్ కంపెనీ లిమిటెడ్‌లో ఇంజినీర్ ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

Advertisement

⦿ పోస్టులు – ఖాళీలు:

ఇంజినీర్ (ఐటీఎస్) : 49 పోస్టులు

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 2

⦿ దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 2

⦿ విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఐటీ, కంప్యూటర్ సైన్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్, డేటా సైన్స్ అండ్ ఏఐలో డిగ్రీ పాసై ఉండాలి. లేదా గేట్ పాసై ఉండాలి.

⦿ వయస్సు: 2025 జూన్ 2వ తేదీ నాటికి 21 నుంచి 30 ఏళ్ల మధ్య వయస్సు కలిగి ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు, దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

⦿ దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

⦿ ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: గేట్ స్కోర్ లో మెరిట్ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట చేస్తారు.

⦿ జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు భారీ వేతనం ఉంటుంది. మొదటి నెలనే రూ.40వేల జీతం ఉంటుంది. ఎక్స్ పీరియన్స్ బట్టి రూ.40వేల నుంచి రూ.1,40,000 జీతం ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్‌ను సంప్రందించండి.

⦿ అఫీషియల్ వెబ్ సైట్: https://ihmcl.co.in

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

Also Read: AIIMS Recruitment: సొంత రాష్ట్రంలో ఉద్యోగం చేసే అవకాశం.. ఈ అర్హత ఉంటే చాలు భయ్యా..

⦿ నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 49

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 2

జీతం: రూ.40,000 నుంచి రూ.1,40,000

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×