Landslides: ఉత్తరాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. అక్కడున్న కొండచరియలు విరిగి పడటంతో యాత్రకు వెళ్లిన వారందరు చిక్కుల్లో పడ్డట్లు తెలిపారు. అయితే ఒక్కసారిగి కొండచరియలు విరిగి పోవడంతో అనేక యాత్రికులు ఈ ప్రమాదంలో చిక్కుకున్నారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని పితోర్‌గాఢ్ జిల్లాల్లో మంగళవారం జరిగిన ఘటనలో భారీ కొండచరియలు విరిగిపడటంతో కైలాస్ యాత్ర మార్గం తీవ్రంగా ప్రభావితమైంది. పోలీసులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
రోడ్డుపై పడిన బండరాళ్లను తొలగించి రోడ్డు పునరుద్ధరణకు కృషి చేస్తున్నారు. పర్వత ప్రాంతం కావడంతో సహాయక చర్యలకు సాంకేతికంగా కొన్ని అవాంతరాలు ఎదురవుతున్నాయి. అయితే, విపత్తు నిర్వహణ బృందాలు యాత్రికులను సురక్షితంగా బయటకు తీసుకుని వచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నాయి.
రహదారులు మూసుకుపోవడంతో, యాత్రికులను రక్షించడానికి హెలికాప్టర్ సేవలు ప్రారంభించబడ్డాయి. సమాచారం ప్రకారం, 10 మంది యాత్రికులు ఖేలా ప్రాంతం నుండి ధార్చులా సైనిక హెలిప్యాడ్‌కు రక్షించబడ్డారు. అదే విధంగా, తమిళనాడు నుండి వచ్చిన 30 మంది యాత్రికులు బుడీ ప్రాంతం నుండి రక్షించబడ్డారు.
Also Read: రూ.50 లక్షలకు ఓ వ్యక్తి నోటీసు.. బెంగళూరు మహానగర పాలిక సంస్థ అధికారులకు షాక్
అయితే ఐదేళ్లుగా నిలిచిపోయాన కైలాస్-మానస సరోవర్ యాత్ర మళ్లీ ఇప్పుడు ప్రారంభించారు. అయితే ప్రారంభించిన తర్వాత అనేక మంది యాత్రికులు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అక్కడి వెళుతుంటారు. అయితే అనేక మంది యాత్రికులు వెలుతున్న సమయంలో అనుకోకుండా అక్కడ ప్రమాదం జరగడం జరిగింది. ఒక్కసారిగా అందరు ఉలిక్కిపడ్డారు. అయితే ఈ ప్రమాదంకి సంబందించి ప్రాణ నష్టం జరిగిందా? లేదా? అనేది తెలియాల్సి ఉంది.