E-Paper
Advertisement

IPPB Recruitment: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. మంచి వేతనం.. దరఖాస్తుకు ఇంకా 4 రోజులే గడువు

IPPB Recruitment: డిగ్రీ అర్హతతో ఉద్యోగాలు.. మంచి వేతనం.. దరఖాస్తుకు ఇంకా 4 రోజులే గడువు
Advertisement

IPPB Recruitment: నిరుద్యోగులకు గుడ్ న్యూస్. ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసైన అభ్యర్థులకు ఇదే మంచి అవకాశం. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పించనున్నారు.

☀దరఖాస్తుకు ఇంకా నాలుగు రోజుల సమయం మాత్రమే ఉంది. (మార్చి 21 తో దరఖాస్తు గడువు ముగియనుంది. )

Advertisement

ఢిల్లీ, ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్(IPPB) లో ఖాళీగా ఉన్న ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మార్చి 21న ఈ ఉద్యోగాలకు దరఖాస్తుకు గడువు ముగియనుంది. ఆ లోగా అర్హత ఉన్న అభ్యర్థులు ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో మొత్తం 51 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.  ఓసారి నోటిఫికేషన్ పూర్తి వివరాలను చూద్దాం.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 51

Advertisement

ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

దరఖాస్తు ప్రక్రియకు ప్రారంభ తేది: మార్చి 1

దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: మార్చి 21

దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.750 ఫీజు ఉంటుంది. (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు రూ.150 ఉంటుంది.)

విద్యార్హత: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.

వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 2025 ఫిబ్రవరి 1 నాటికి 21 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు  ఉండాలి. వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

జీతం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000 జీతం ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://ippbonline.com/

అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు గౌరవప్రదమైన జీతం ఉంటుంది. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.30,000 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

ముఖ్యమైన సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 51

విద్యార్హత: ఏదైనా డిగ్రీ

వయస్సు: 35 ఏళ్లు మించరాదు.

జీతం: రూ.30000 ఉంటుంది.

దరఖాస్తుకు చివరి తేది: 2025 మార్చి 21

ALSO READ: Agniveer Recruitment: ఎనిమిది, పదో తరగతి అర్హతలో భారీగా అగ్నివీర్ జాబ్స్.. నోటిఫికేషన్ వచ్చేసింది.. జీతం రూ.30,000

ALSO READ: IIPE Recruitment: డిగ్రీ పాసైతే చాలు.. ఏపీలో జాబ్స్.. నెలకు రూ.32,000 జీతం..

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×