Chanakyaniti: నేటి కాలంలో చాణక్య నీతికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆచార్య చాణక్యుడు ప్రాచీన భారతదేశంలో గొప్ప పండితుడిగా చెబుతారు. అర్థ శాస్త్రం అనే గ్రంథాన్ని కూడా చాణక్యుడు రాశాడు. ఆయన గొప్ప వ్యూహకర్త, అంతే కాకుండా జ్ఞానవంతుడు కూడా. చాణక్య నీతిలో నేటి సమాజానికి అవసరమయ్యే అనేక విషయాలను ప్రస్తావించారు.
ఈ విధానాలు నేటి తరానికి మార్గ నిర్దేశం చేస్తాయి. చాణక్య నీతి ప్రకారం వ్యక్తి చేసే తప్పులు అతడిని పేదవాడిగా మారుస్తాయి. అంతే కాకుండా అతడి దగ్గర డబ్బు లేకుండా కూడా చేస్తాయి. ధనవంతులు పేద వారిగా మారడానికి గల కారణాలను గురించి చాణక్యుడు వివరించాడు. మరి ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
గొడవల ఇల్లు:
ఆచార్య చాణక్యుడి ప్రకారం.. తరచుగా గొడవలు జరిగే ఇంట్లో ఆర్థిక నష్టం పెరుగుతుంది. అంతే కాకుండా సంపదకు దేవత అయిన లక్ష్మీ దేవి కోపంగా ఉంటుంది. తగాదాల కారణంగా.. మీ ఇంటి వాతావరణం ప్రతికూలంగా మారుతుంది. అంతే కాకుండా ఇంట్లో ఆనందం , శాంతి అదృశ్యమవుతాయి. అందుకే గొడవలు పడకుండా ఉండటం మంచిది. వీలైనంత సంతోషంగా ఉండటం అలవాటు చేసుకోవాలి. ఇది ఇంట్లో ప్రశాంతతను పెంచుతుంది.
ఇతరులను అవమానించడం:
చాణక్య నీతి ప్రకారం.. స్త్రీలను అవమానించే ఇల్లు పేదరికంలోకి కూరుకుపోతుంది. అంతే కాకుండా ఇంటి పెద్దలను అవమానించడం వల్ల ఇంట్లో ఆనందం , శ్రేయస్సు తొలగిపోతుంది ఫలితంగా మీరు పేదవారిగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి. స్త్రీలను పూజించే ఇంటిలో సంతోషం పెరుగుతుంది. అంతే కాకుండా సిరి, సంపదలకు కూడా ఏ లోటూ ఉండదు.
అక్రమంగా సంపాదించిన డబ్బు:
చాణక్య నీతి ప్రకారం.. అక్రమ మార్గాల ద్వారా డబ్బు సంపాదించిన ఇంట్లో ఎప్పుడూ ఆనందం ఉండదు. తప్పుడు మార్గాల ద్వారా సంపాదించిన డబ్బు చాలా త్వరగా నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయి.
సమయానికి విలువ:
సమయానికి విలువ ఇవ్వని, సమయాన్ని వృధా చేసుకునే, పనిని వాయిదా వేసుకునే వ్యక్తుల దగ్గర కూడా డబ్బు ఉండదు. సమయానికి నిద్ర లేవని, పని చేయడంలో సోమరితనం ఉన్న ఇళ్లలో ఎప్పుడూ డబ్బు కొరత ఉంటుంది.
ఆచార్య చాణక్యుడి ప్రకారం.. మూర్ఖులతో సహవాసం చేయడం, దుష్ట స్త్రీకి మద్దతు ఇవ్వడం , దుఃఖం ఉన్న పురుషుడితో సహవాసం చేయడం దుఃఖాన్ని, బాధను తెస్తుంది.
సరైన నిర్ణయం తీసుకోవడం:
చాణక్య నీతి ప్రకారం.. తెలివైన వ్యక్తి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోలేకపోతే అతని తెలివితేటలు పనికి రావు. తెలివైన వ్యక్తి ఎలాంటి పరిస్థితికైనా సిద్ధంగా ఉండాలి.
Also Read: ఈ రాశులపై సూర్య గ్రహణ ప్రభావం.. ఎలా ఉండబోతుందంటే ?
తప్పు ఒప్పుకోవాలి :
ఒక తెలివైన వ్యక్తి తప్పుడు వ్యక్తులతో సహవాసం చేస్తే అది అతని వ్యక్తిత్వంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుంది. అంతే కాకుండా తప్పుడు సహవాసం చేయడం అనేది తెలివైన వ్యక్తి చేసే అతి పెద్ద తప్పు. అలాంటి వ్యక్తులు తెలివైన వ్యక్తికి హాని కలిగిస్తారు.
మూర్ఖుడు:
చాణక్య నీతి ప్రకారం.. తెలివైన వ్యక్తి ఎప్పుడూ మూర్ఖులతో ఉండకూడదు. మూర్ఖులకు ఏదైనా వివరించడం వల్ల ఉపయోగం లేదు. మూర్ఖులు ఎప్పుడూ తమ మనసు చెప్పినట్లు చేస్తారు. మూర్ఖులకు విషయాలను వివరించడం వ్యర్థం, అది తెలివైన వ్యక్తికి హాని చేస్తుంది.