Michael Bracewell: మేజర్ లీగ్ క్రికెట్ 2025 {MLC} లో భాగంగా నేడు ఎమ్ఐ న్యూయార్క్ – శాన్ ఫ్రాన్సిస్కో జట్ల మధ్య ఆసక్తికర పోరు జరిగింది. ఈ మ్యాచ్ లో శాన్ ఫ్రాన్సిస్కో తప్పకుండా గెలుస్తుంది అనుకున్న సందర్భంలో అనూహ్యంగా 47 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే ఈ మ్యాచ్ లో ఓ హాస్యాస్పద సంఘటన చోటుచేసుకుంది.
Also Read: Sai Sudarshan – Pant: ఐపీఎల్ లో ఎవడైనా ఆడతాడు.. ఇండియాకు ఆడితేనే మగాడు అవుతాడు
ఎమ్ఐ న్యూయార్క్ బ్యాటర్ మైఖేల్ బ్రేస్ వెల్ ఎదుర్కొన్న మొదటి బంతికే రొమారియో షెఫర్డ్ బౌలింగ్ లో డకౌట్ గా పెవిలియన్ చేరాడు. ఆ బంతి బ్రేస్ వెల్ బ్యాట్ కి తగిలి వికెట్లను తాకింది. ఇది గమనించని బ్రేస్ వెల్.. వెనక్కి తిరిగి చూడకుండానే వెంటనే రివ్యూ తీసుకున్నాడు. దీంతో క్లీన్ బౌల్డ్ అయ్యాక రివ్యూ తీసుకున్నాడు అని సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన వీడియోను షేర్ చేస్తూ తెగ నవ్వుకుంటున్నారు నెటిజెన్లు. ఓసారి వెనక్కి తిరిగి చూసుకోవాల్సింది కదా..? అని కామెంట్స్ చేస్తున్నారు.
ఇక ఈ మ్యాచ్ లో ఎంఐ న్యూయార్క్ జట్టు కెప్టెన్ నికోలస్ పూరన్ టాస్ గెలిచి మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. దీంతో మొదట బ్యాటింగ్ చేసిన శాన్ ఫ్రాన్సిస్కో జట్టు మైదానంలో బౌండరీల వర్షం కురిపించింది. కెప్టెన్ మ్యాథ్యూ షార్ట్ 91 పరుగులు చేయగా.. జేక్ ప్రెజర్ మెక్ గర్క్ 64 పరుగులు చేశాడు. చివర్లో హసన్ ఖాన్ 9 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సర్లతో 31 పరుగులు బాదాడు. అలాగే టిమ్ సైఫర్టీ 26, సంజయ్ కృష్ణమూర్తి 27 పరుగులు చేశారు.
ఈ క్రమంలో శాన్ ఫ్రాన్సిస్కో జట్టు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 246 పరుగులు చేసింది. ఈ క్రమంలో భారీ టార్గెట్ తో బరిలోకి దిగిన ఎంఐ న్యూయార్క్ జట్టు ఆరంభంలో దీటుగానే బదులిచ్చింది. ఓపెనర్లు క్వింటన్ డికాక్, మోనాన్క్ పటేల్ తొలి వికెట్ కి 119 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. 9.3 ఓవర్లలోనే 119 పరుగులు చేయడంతో ఇక ఎమ్ఐ గెలుస్తుందని అంతా ఫిక్స్ అయ్యారు. కానీ క్వింటన్ డికాక్ 70 పరుగులు చేసి 17వ ఓవర్ లో అవుట్ కావడంతో ఎమ్ఐ ఓటమి తప్పలేదు.
Also Read: Dhoni Fan: ఆ లేడీతో Ms ధోని రిలేషన్… సీక్రెట్ గా పార్టీలు.. వీడియో చూస్తే షాక్ అవ్వాల్సిందే
ఈ క్రమంలో ఎంఐ 20 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 199 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ నేపథ్యంలో శాన్ ఫ్రాన్సిస్కో జట్టు 47 పరుగుల తేడాతో విజయం సాధించింది. పూరన్ కెప్టెన్ అయిన తర్వాత వరుసగా విఫలమవుతూ వస్తున్నాడు. ఇక ఈ విజయంతో శాన్ ఫ్రాన్సిస్కో జట్టు తన టాప్ ప్లేస్ ని నిలబెట్టుకుంది. ఇప్పటివరకు ఐదు మ్యాచ్ లు ఆడిన షాన్ ఫ్రాన్సిస్కో జట్టు ఐదింటిలోనూ విజయం సాధించడం విశేషం. మరోవైపు ఎమ్ఐ జట్టు ఐదు మ్యాచ్ లు ఆడి కేవలం ఒక మ్యాచ్ లోనే గెలుపొంది పాయింట్ల పట్టికలో నాలుగవ స్థానంలో ఉంది.
Michael Bracewell tried to take a review after getting bowled out. 🤣pic.twitter.com/ypeWzcb3yc
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 24, 2025