ESIC Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. ఎంస్, ఎండీ, ఎంసీహెచ్, డీఎం, డి.ఎ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ, డీపీఎం పూర్తి చేసిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూద్దాం.
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ESIC) దిల్లీ డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా స్పెషలిస్ట్ గ్రేడ్-2 పోస్టల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. మే 26వ తేదీ వరకు అర్హత గల అభ్యర్థులు ఆఫ్ లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 558
ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. స్పెషలిస్ట్ గ్రేడ్-2 ఉద్యోగాలు ఇందులో వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీలు:
స్పెషలిస్ట్ గ్రేడ్-2 (సీనియర్ స్కేల్) : 155 ఉద్యోగాలు
స్పెషలిస్ట్ గ్రేడ్-2 (జూనియర్ స్కేల్): 403 ఉద్యోగలు
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 26
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో ఎంస్, ఎండీ, ఎంసీహెచ్, డీఎం, డి.ఎ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ, డీపీఎంలో ఉత్తీర్ణతతో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: 2025 మే 26 తేదీ వరకు 45 ఏళ్లు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ప్రక్రియ విధానం: ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలి.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి జీతం ఉంటుంది. నెలకు స్పెషలిస్ట్ గ్రేడ్-2 సీనియర్ స్కేల్‌కు రూ.78,800, స్పెషలిస్ట్ గ్రేడ్-2 జూనియర్ స్కేల్ పోస్టుకు రూ.67,700 జీతం ఉంటుంది.
నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాల కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.esic.gov.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. నెలకు స్పెషలిస్ట్ గ్రేడ్-2 సీనియర్ స్కేల్‌కు రూ.78,800, స్పెషలిస్ట్ గ్రేడ్-2 జూనియర్ స్కేల్ పోస్టుకు రూ.67,700 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
Also Read: HURL Recruitment: ఈ జాబ్ వస్తే రూ.1,00,000కి పైగా జీతం.. ఈ అర్హత ఉన్న వాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు..
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 558
దరఖాస్తుకు చివరి తేది: మే 26
విద్యార్హత: ఎంస్, ఎండీ, ఎంసీహెచ్, డీఎం, డి.ఎ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ, డీపీఎం