BigTV English

HURL Recruitment: ఈ జాబ్ వస్తే రూ.1,00,000కి పైగా జీతం.. ఈ అర్హత ఉన్న వాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు..

HURL Recruitment: ఈ జాబ్ వస్తే రూ.1,00,000కి పైగా జీతం.. ఈ అర్హత ఉన్న వాళ్లందరూ అప్లై చేసుకోవచ్చు..

HURL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. బీటెక్‌, బీఈ, డిప్లొమా, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ డిప్లొమా పాసైన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అనే చెప్పవచ్చు. హిందుస్థాన్‌ ఉర్వక్‌ రసాయన్‌ లిమిటెడ్‌ (హెచ్‌యూఆర్ఎల్) లో వివిధ రకాల ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు అప్లై చేసుకోండి. సెలెక్ట్ రూ.లక్షల్లో జీతాలు ఉంటాయి. నోటిఫికేషన్ కు సంబంధించిన పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.


హిందుస్థాన్‌ ఉర్వక్‌ రసాయన్‌ లిమిటెడ్‌ (HURL) లో వివిధ విభాగాల్లో ఉన్న పలు పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు.  మే 6న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఆన్ లైన్ లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 108


హిందుస్థాన్‌ ఉర్వక్‌ రసాయన్‌ లిమిటెడ్‌ లో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. మేనేజర్, ఇంజినీర్ / సీనియర్ ఇంజినీర్, అసిస్టెంట్ మేనేజర్ / డిప్యూటీ మేనేజర్, అడిషనల్ చీఫ్ మేనేజర్, సీనియర్ మేనేజర్, జూనియర్ ఇంజినీర్ అసిస్టెంట్- 2 – గ్రేడ్ -2 పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు:

⦿  మేనేజర్‌: 03
⦿  ఇంజినీర్‌/సీనియర్‌ ఇంజినీర్‌: 35
⦿  అసిస్టెంట్ మేనేజర్‌/డిప్యూటీ మేనేజర్‌: 21
⦿  అడిషనల్ చీఫ్‌ మేనేజర్‌: 01
⦿  సీనియర్‌ మేనేజర్‌: 01
⦿  జూనియర్‌ ఇంజినీర్‌ అసిస్టెంట్-2-గ్రేడ్‌-2: 47

దరఖాస్తు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 15

దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 6

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీటెక్‌, బీఈ, డిప్లొమా, ఎంబీఏ, పీజీడీఎం, పీజీ డిప్లొమా పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. జూనియర్‌ ఇంజినీర్‌ అసిస్టెంట్-2-గ్రేడ్‌-2కు 30 ఏళ్లు, సీనియర్‌ మేనేజర్‌కు 42 ఏళ్లు, అడిషనల్ చీఫ్‌ మేనేజర్‌కు 44 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌కు 35 ఏళ్లు, డిప్యూటీజీ మేనేజర్‌కు 37 ఏళ్లు, సీనియర్‌ ఇంజినీర్‌కు 32 ఏళ్లు, మేనేజర్‌కు 40 ఏళ్లు వయస్సు మించరాదు.

నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఉద్యోగం ఎంపిక విధానం: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

వేతనం: ఉద్యోగాన్ని బట్టి జీతాన్ని నిర్ణయించారు.  నెలకు మేనేజర్‌కు రూ.70,000 – రూ.2,00,000, డిప్యూటీ మేనేజర్‌కు రూ.60,000 – రూ.1,80,000, అసిస్టెంట్‌ మేనేజర్‌కు రూ.50,000 – రూ.1,60,000, సీనియర్ ఇంజినీర్‌కు రూ.45,000 – రూ.1,50,000, ఇంజినీర్‌/ఆఫీసర్‌కు రూ.40,000 – రూ.1,40,000, జూనియర్ ఇంజినీర్‌ అసిస్టెంట్-2-గ్రేడ్‌-2కు రూ.25,000 – రూ.86,4000, సీనియర్‌ మేనేజర్‌కు రూ.80,000 – రూ.2,20,000, అడిషనల్ చీఫ్ మేనేజర్‌కు రూ.90,000 – రూ.2,40,000 జీతం ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://jobse2.hurl.net.in/

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 108

దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 6

Also Read: High Court Exam: తెలంగాణ హైకోర్టు ఎగ్జామ్‌లో ఎలాంటి ప్రశ్నలు వస్తున్నాయంటే..? ఇవి చదవండి.. జాబ్ మీదే..

Related News

Rohit Sharma : ఓవల్ టెస్టు సమయంలో రోహిత్ శర్మ ధరించిన వాచ్ ఎన్ని కోట్లో తెలుసా..

Agniveer Notification: అగ్నివీర్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల.. ఇంకా 2 రోజుల సమయమే..!

James Cameron: అవతార్ 4,5 పార్ట్స్ కి కొత్త డైరెక్టర్… జేమ్స్ కామెరూన్ ఆన్సర్ ఇదే

Kesireddy – Chevireddy: న్యాయస్థానంలో కన్నీళ్లు.. మొన్న చెవిరెడ్డి, నేడు రాజ్ కెసిరెడ్డి

Russia Tsunami: ఇండియాకు సునామీ ముప్పు ఉందా? అమెరికా.. జపాన్‌లో ఎగసిపడ్డ సముద్రం.. నెక్ట్స్ ఏ దేశం?

Nithya Menon: వీళ్ళిద్దరూ నన్ను చాలా ట్రై చేస్తారు, అంత మాట అనేసావ్ ఏంటి నిత్యా ?

Big Stories

×