Income Tax: నిరుద్యోగులకు ఇది సూపర్ న్యూస్. టెన్త్ క్లాస్, ఇంటర్, డిగ్రీలో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం అనే చెప్పవచ్చు. ప్రిన్సిపల్ కమినర్ ఆప్ ఇన్ కమ్ ట్యాక్స్ తెలంలగాణ అండ్ ఏపీ స్పోర్ట్స్ కోటాలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న అభ్యర్థుల ఆన్ లైన్ లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. నోటిఫికేషన్ పూర్తి వివరాలు చూసేద్దాం.
హైదరాబాద్‌లోని ప్రిన్సిపల్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కమ్ ట్యాక్స్ తెలంగాణ అండ్ ఏపీ స్పోర్ట్స్ కోటాలో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. ఏప్రిల్ 5న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఉద్యోగం పొందిన అభ్యర్థులు మంచి వతేనం కూడా కల్పించనున్నారు.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 56
ఇందులో పలు రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. స్టెనోగ్రాఫర్- గ్రేడ్-2, ట్యాక్స్ అసిస్టెంట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ (ఎంటీఎస్) ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బిలియర్డ్స్ అండ్ స్నూకర్స్, బాస్కెట్‌బాల్, బాడీ బిల్డింగ్, బ్రిడ్జి, క్యారమ్స్, చెస్, క్రికెట్, ఫుట్‌బాల్, హాకీ, కబడ్డీ, స్వ్కాష్, స్విమ్మింగ్, టెన్నిస్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్ స్పోర్ట్స్ విభాగాల్లో రాణించి ఉండాలి.
వెకెన్సీ వారీగా పోస్టులు:
స్టెనోగ్రాఫర్-గ్రేడ్-2: 02
ట్యాక్స్ అసిస్టెంట్: 28
మల్టీ టాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్): 26
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్ట సంబంధిత విభాగంలో టెన్త్ క్లాస్, ఇంటర్, డిగ్రీ పాసై ఉంటే సరిపోతుంది.
దరఖాస్తు ప్రక్రియకు చివరి తేది: ఏప్రిల్ 5
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. 2025 జనవరి 1వ తేదీ నాటికి స్టెనోగ్రాఫర్, ట్యాక్స్ అసిస్టెంట్‌కు పోస్టుకు 18 నుంచి 27 ఏళ్లు, ఎంటీఎస్ పోస్టులకు 18 నుంచి 25 ఏళ్ల వయస్సు ఉండాలి.
వేతనం: ఉద్యోగాన్ని బట్టి వేతనం నిర్ణయించారు. నెలకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టుకు రూ.25,500 – రూ.81,100, ట్యాక్స్ అసిస్టెంట్‌కు రూ.25,500 – రూ.81,100, ఎంటీఎస్ పోస్టులకు రూ.18,000 – రూ.56,900 వేతనం ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://incometaxhyderabad.gov.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సొంత రాష్ట్రంలో ఉద్యోగ చేయవచ్చు. ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. ఉద్యోగాన్ని బట్టి వేతనం నిర్ణయించారు. నెలకు స్టెనోగ్రాఫర్ గ్రేడ్-2 పోస్టుకు రూ.25,500 – రూ.81,100, ట్యాక్స్ అసిస్టెంట్‌కు రూ.25,500 – రూ.81,100, ఎంటీఎస్ పోస్టులకు రూ.18,000 – రూ.56,900 వేతనం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 56
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఏప్రిల్ 5
ALSO READ: JOBS: ఇంటర్, డిగ్రీ అర్హతతో మన హైదరాబాద్‌లోఉద్యోగాలు.. ఇంటర్వ్యూతోనే జాబ్ భయ్యా..