Indian Railways: ప్రయాణీకులకు మెరుగైన సేవలు అందించమే లక్ష్యంగా సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయాలు తీసుకుంటున్నది. చర్లపల్లి రైల్వే స్టేషన్ అందుబాటులోకి వచ్చిన నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి రాకపోకలు కొనసాగించే పలు రైళ్లను అక్కడి నుంచి నడిపిస్తున్నది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ పునర్నిర్మాణ పనులు కొనసాగుతున్న నేపథ్యంలో ప్రయాణీకులకు ఇబ్బంది కలగకుండా ఈ నిర్ణయం తీసుకుంది. అటు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టిన కొన్ని రైళ్లకు సంబంధించి అందుబాటులోకి తీసుకొచ్చిన తాత్కాలిక హాల్టింగ్ ల విషయంలోనూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ స్టాప్ లను మరో 6 నెలల పాటు కొనసాగించనున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన చేసింది.
ఏ రైళ్లకు ఎక్కడ హాల్టింగ్ ఇచ్చారంటే?
సౌత్ సెంట్రల్ పరిధిలో కొన్ని రైళ్లకు తాత్కాలిక స్టాపేజీలను ఇస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే ఇటీవలే నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయాన్ని మరో 6 నెలల పాటు పొడిగిస్తూ తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సికింద్రాబాద్- తిరుపతి మధ్య నడిచే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలుకు మిర్యాలగూడలో తాత్కాలిక స్టాపేజి ఇచ్చారు. రేపల్లె-సికింద్రాబాద్ మధ్య నడిచే ఎక్స్ ప్రెస్ కి సిరిపురంలో హాల్టింగ్ ఇచ్చారు. లింగంపల్లి- విశాఖపట్నం మధ్య నడిచే జన్మభూమి ఎక్స్ ప్రెస్ కి, విజయవాడ-సికింద్రాబాద్ మధ్య శాతవాహన ఎక్స్ ప్రెస్ కి, హైదరాబాద్ – సిర్పూర్ కాగజ్ నగర్ మధ్య నడిచే ఇంటర్ సిటీ ఎక్స్ ప్రెస్ కి చర్లపల్లి స్టేషన్ లో స్టాప్ ఇచ్చింది. అటు నర్సాపూర్- నాగర్ సోల్ ఎక్స్ ప్రెస్‌కి మహబూబాబాద్ లో, దానాపూర్-సికింద్రాబాద్ ఎక్స్ ప్రెస్ కి జమ్మికుంటలో స్టాప్ లు ఇచ్చారు. ప్రయోగాత్మకంగా ఈ స్టాప్ లు అమల్లో ఉంటాయి.
మార్చి 14 నుంచి 32 రైళ్లకు పలు స్టేషన్లలో హాల్టింగ్
మార్చి 14 నుంచి మొత్తం 32 రైళ్లకు వివిధ స్టేషన్లలో తాత్కాలిక హాల్ట్ లు ఇస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే కీలక ప్రకటన విడుదల చేసింది. ఇందులో నాగర్ సోల్, సిర్పూర్ కాగజ్ నగర్, బీదర్, విజయవాడ, సికింద్రాబాద్, గుంటూరు, రేపల్లె, తిరుపతి, పూరి, తిరుపతి, బిలాస్ పూర్, హౌరా, పుదుచ్చేరి, యశ్వంత్ పూర్, బెంగళూరు, నాందేడ్, కాజీపేట, పూణే, నరసాపూర్ వంటి నగరాలు, పట్టణాల మధ్య ప్రయాణించే పలు రైళ్లు, పలు స్టేషన్లలో ఆగనున్నట్లు వెల్లడించింది. ఈ రైళ్లను సుమారు 6 నెలల పాటు కొనసాగించి, ప్రయాణీకులు అభిప్రాయల ఆధారంగా వాటిని కొనసాగించాలా? లేదా? అని నిర్ణయించనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు.
Read Also: అయ్య బాబోయ్.. ఆన్ లైన్ లో టికెట్లు బుక్ చేసుకునే వాళ్లు అంత మందా?
హోలీ రద్దీ నేపథ్యంలో ప్రత్యేక రైళ్లు
అటు హోలీ పండుగ నేపథ్యంలో చర్లపల్లి- పాట్నా మధ్య ప్రత్యేక రైళ్లను ప్రారంభించింది. ఈ రైళ్లు 17 మార్చి నుంచి మే 28 వరకు ప్రతి సోమ, బుధవారాల్లో మధ్యాహ్నం 3 గంటలకు చర్లపల్లి- పాట్నా మధ్య ప్రత్యేక రైలు నడపనున్నారు. అటు 19 మార్చి నుంచి.. ప్రతి బుధవారం రాత్రి 10 గంటలకు ప్రత్యేక రైలు, 21 మార్చి నుంచి మే 30 వరకు ప్రతి శుక్రవారం రాత్రి 9 గంటలకు మరో ప్రత్యేక రైలు నడపనున్నట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది.
Read Also: ఎయిర్ పోర్ట్ తరహాలో బేగంపేట రైల్వే స్టేషన్, లోపలికి వెళ్తే కళ్లు చెదిరిపోవాల్సిందే!