CSIR-CEERI Jobs: డిప్లొమా, బీఎస్సీ పాసైన అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. సీఎస్ఐఆర్- సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్(CEERI) పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికషన్ విడుదలైంది. అర్హత గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో ఎంపికైన అభ్యర్థులకు మంచి వేతనం కూడా కల్పిస్తారు. ఎవరికై ఎలిజిబిలిటీ ఉంటుందో వారు తప్పకుండా ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోండి.
రాజస్థాన్, పిలానీలోని సీఎస్ఐఆర్- సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ రిసెర్చ్ ఇన్ స్టిట్యూట్(CEERI) టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికషన్ విడుదలైంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఒకసారి పూర్తి నోటిఫికేషన్ డిటెయిల్స్ చూద్దాం.
మొత్తం ఉద్యోగాల సంఖ్య: 11 (యూఆర్-04, ఈడబ్ల్యూఎస్-01, ఓబీసీ-03, ఎస్సీ-02, బ్యాక్ లాగ్ (పీడబ్ల్యూబీడీ-01))
ఇందులో టెక్నిలక్ అసిస్టెంట్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.
విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో డిప్లొమా, బీఎస్సీ(ఫిజిక్స్/ ఎలక్ట్రానిక్స్/ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్/కంప్యూటర్ సైన్/ ఇన్ స్ట్రుమెంటేషన్/ అప్లైడ్ ఎలక్ట్రానిక్స్ అండ్ సైన్స్/ ఫిజికల్ సైన్స్, డేటా సైన్స్/ సాఫ్ట్ వేర్ ఇంజినీరింగ్) పాస్తో పాటు వర్క్ ఎక్స్ పీరియన్స్ ఉండాలి.
వయస్సు: వయస్సుకు సంబంధించి 28 ఏళ్లు మించకూడదు.
వేతనం: ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి నెలకు రూ.56,916 జీతం ఉంటుంది.
దరఖాస్తు ఫీజు: రూ.500 ఉంటుంది (ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలు, ఎక్స్ సర్వీస్ మెన్ అభ్యర్థులకు ఫీజు చెల్లింపులో మినహాయింపు ఉంటుంది.)
ఉద్యోగ ఎంపిక విధానం: ట్రేడ్ టెస్ట్, రాత పరీక్ష ఆధారంగా ఉద్యోగానికి సెలక్ట్ చేస్తారు.
ఆన్ లైన్ దరఖాస్తు ప్రారంభ తేది: 2024 డిసెంబర్ 10
ఆన్ లైన్ దరఖాస్తు చివరి తేది: 2025 జనవరి 9
అఫీషియల్ వెబ్ సైట్: https://www.ceeri.res.in/
Also Read: HPCL Jobs: బీటెక్ అర్హతతో పోస్టులు.. నెలకు రూ.25,000 స్టైఫండ్.. పూర్తి వివరాలివే..
అర్హత ఉన్న అభ్యర్థులు ఇంత మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవచ్చు. ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థికి ప్రారంభ వేతనమే రూ.56,916 వరకు ఉంది. ఉద్యోగానికి అప్లై చేసుకోండి. జాబ్ సాధించండి ఆల్ ది బెస్ట్.