Rythu Bharosa Scheme: తెలంగాణ సర్కార్ ఏమని రైతులకు, వ్యవసాయ కార్మికులకు భరోసా అందించేందుకు నిర్ణయం తీసుకుందో, నాటి నుండి బీఆర్ఎస్ పెడుతున్న గగ్గోలు అంతా ఇంతా కాదంటున్నారు రైతన్నలు. కాంగ్రెస్ ప్రభుత్వం రుణమాఫీ అమలు చేసింది. ఇప్పుడు రైతు భరోసా కూడ అందిస్తోంది. మరెందుకు ఈ గగ్గోలు అంటున్నారు రైతన్నలు. అంటే వ్యవసాయ కార్మికులకు కూడ భరోసా కల్పిస్తామని చెప్పడమే సీఎం రేవంత్ సర్కార్ చేసిన తప్పా అంటూ బీఆర్ఎస్ పార్టీని రైతన్నలు ప్రశ్నిస్తున్నారు.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి జనవరి 26 నుండి రైతు భరోసా పథకాన్ని అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. గత ప్రభుత్వం కేవలం రూ. 10 వేలు అందజేస్తే, ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రూ. 12 వేలు అందజేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే ఎందరో వ్యవసాయ కార్మిక కుటుంబాలకు కూడ ఈ పథకం వర్తించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే ఎవరైతే సాగు చేయని రైతులు ఉంటారో, వారికి పథకం వర్తించదన్నది ప్రాథమిక సమాచారం.
ఎన్నడూ లేనివిధంగా వ్యవసాయ కార్మికులకు కూడ భరోసా కల్పిస్తామన్న నిర్ణయాన్ని కార్మికులు స్వాగతిస్తున్నారు. భూమి లేక, సాగుకు అవకాశాలు లేక కేవలం వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్న వారికి ఈ పథకం వరం. ఏడాదికి రూ. 12 వేలు అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 26 నుండి బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టనుంది ప్రభుత్వం.
ఇక్కడే బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న వ్యవహారంపై రైతులు, కూలీలు సీరియస్ అవుతున్నారు. పథకం అమలు చేయకపోతే చేయలేదని విమర్శలు, చేస్తే మాత్రం ఏదొక వంక ఇలా చేయడం తగదంటున్నారు తెలంగాణ రైతులు. ఇక వ్యవసాయ కూలీలైతే మరీ సీరియస్ కామెంట్స్ చేస్తున్నారు. కూలీలందరూ ఇలాగే ఉండాలా.. మాకు ప్రభుత్వం ఇస్తున్న ప్రోత్సాహం నచ్చింది.. మధ్యలో మీ గోల ఏందయ్యా అంటూ వారు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Tirumala News: HMPV వైరస్.. భక్తులకు కీలక సూచన చేసిన టీటీడీ చైర్మన్
ఇప్పటికే రుణమాఫీ, సన్నబియ్యం కు అదనంగా రూ. 500 పెంపు, ఉచిత విద్యుత్, జాబ్ నోటిఫికేషన్స్, ఫ్రీ బస్, రూ. 500 కే సిలిండర్లు ఇలా ఎన్నో పథకాలు అమలు చేస్తూ కూడ భరోసా ప్రకటించడం అభినందనీయమని సర్కార్ కి రైతులు తమ మద్దతు ప్రకటిస్తున్నారు. ఇప్పటికైనా ప్రజలు నమ్ముకోకుండ సోషల్ మీడియానే నమ్ముకున్న బీఆర్ఎస్ పార్టీ కళ్లు తెరిచి చూడాలని వారు కోరుతున్నారు. మొత్తం మీద తెలంగాణ రైతాంగం, కూలీలు మాత్రం భరోసా అమలైతే చాలు అంటూ, జనవరి 26 కోసం ఎదురుచూపుల్లో ఉన్నారు.