Hitec City Railway Station Development Work: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా దేశ వ్యాప్తంగా పలు రైల్వే స్టేషన్లను రైల్వేశాఖ అద్భుతంగా తీర్చి దిద్దుతోంది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ను అత్యాధునిక హంగులతో పునర్నిర్మిస్తోంది. ప్రస్తుత రైల్వే స్టేషన్ రూపురేఖలు పూర్తిగా మారిపోనున్నాయి. రైల్వే ప్రయాణీకులకు సరికొత్త అనుభూతితో పాటు ప్రపంచ స్థాయి సౌకర్యాలను అందించే లక్ష్యంతో దీనిని నిర్మిస్తోంది. ఈ రైల్వే స్టేషన్ పనులు దాదాపు 80 శాతం పనులు పూర్తయ్యాయి. ఎంట్రీ ర్యాంప్‌లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు దాదాపు పూర్తయ్యాయి.
రూ.26.60 కోట్లతో పునరాభివృద్ధి పనులు
అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ లో భాగంగా హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ ను రూ. 26.60 కోట్ల వ్యయంతో నిర్మిస్తోంది. గతేడాదే ప్రతిపాదిత నమూనాను రైల్వే శాఖ ఖరారు చేయగా… డిజైన్ కు అనుగుణంగా పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగా దాదాపు పనులు చివరి దశకు చేరుకున్నాయి. మిగతా పనులు కూడా త్వరలో పూర్తి చేసేల అధికారుల చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు 80 శాతం పనులు పూర్తయ్యాయి. కీలమైన ఎంట్రీ ర్యాంప్, ఫుట్ ఓవర్ బ్రిడ్జి లాంచ్ పనులు కంప్లీట్ అయ్యాయి. స్టేషన్ బిల్డింగ్, సర్యులేటింగ్ ఏరియా, లిఫ్ట్, ఎస్కులేటర్, ఫ్లాట్ ఫామ్ ఫేసింగ్ పనులు కొనసాగుతున్నాయి. అప్ గ్రేడ్ చేయబడిన పార్కింగ్ స్థలం, దివ్యాంగులకు అనుకూలమైన మౌలిక సదుపాయాలు, గ్రీన్ ఎనర్జీని ఉపయోగించి పర్యావరణ అనుకూల భవనం మొదలైనవి రెడీ అవుతున్నాయి. ఆధునిక నిర్మాణం, ప్రపంచ స్థాయి సౌకర్యాలతో రైల్వే స్టేషన్‌ను అభివృద్ధి చేస్తున్నారు.
హైదరాబాద్ లోని పలు రైల్వే స్టేషన్ల పునర్నిర్మాణం
ఇప్పటికే చర్లపల్లిలో అద్భుతమైన రైల్వే టెర్మినల్ అందుబాటులోకి రాగా, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. మరికొద్ది రోజుల్లోనే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ కూడా పూర్తి స్థాయిలో నిర్మాణం కంప్లీట్ కానుంది. హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ కూడా మరికొద్ది రోజుల్లోనే అందుబాటులోకి రానుంది. హైదరాబాద్ లోని మల్కాజ్ గిరి, హఫీజ్ పేట్, బేగంపేట్, ఉప్పుగూడ రైల్వే స్టేషన్లు కూడా ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్నాయి.
హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ లో ప్రత్యేకతలు
⦿ స్టేషన్ భవనం ముఖభాగం అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారు.
⦿ ఎంట్రీ పోర్టికో ఏర్పాటు చేస్తున్నారు.
⦿ FOB, లిఫ్ట్ లు, ఎస్కలేటర్ల నిర్మాణం కొనసాగుతోంది.
⦿ ప్లాట్ ఫారమ్ అభివృద్ధి చేస్తున్నారు.
⦿ వెయిటింగ్ హాల్ ను నిర్మిస్తున్నారు.
⦿ సర్క్యులేటింగ్ ఏరియా డెవలప్ మెంట్ చేస్తున్నారు.
⦿ ప్రయాణీకులకు అవసరమైన సైన్ బోర్డులు,ట్రైన్ ఇండికేషన్ బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు.
త్వరలోనే హైటెక్ సిటీ రైల్వే స్టేషన్ పనులు పూర్తి చేసి, ప్రయాణీకులకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులు భావిస్తున్నారు.
Read Also: దేశం రిచ్చెస్ట్ రైలు ఇదే, ఏడాది ఎన్ని కోట్లు సంపాదిస్తుందంటే?