BigTV English

Kalyan Ram : అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీపై కళ్యాణ్ రామ్ కొడుకు రివ్యూ… ఏం అన్నాడంటే..?

Kalyan Ram : అర్జున్ సన్నాఫ్ వైజయంతి మూవీపై కళ్యాణ్ రామ్ కొడుకు రివ్యూ… ఏం అన్నాడంటే..?

Kalyan Ram : నందమూరి కళ్యాణ్ రామ్, విజయశాంతి కీలక పాత్రలో నటించిన సినిమా అర్జున్ S/O వైజయంతి. సయీ మంజ్రేకర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించారు. ఈ సినిమా ఈరోజు(ఏప్రిల్18)న థియేటర్లలో రిలీజ్ చేసారు. సినిమా రిలీజ్ అయిన ప్రతి చోటా హిట్ టాక్ తో దూసుకుపోతుంది. సినిమాలో వచ్చే ఫైటింగ్స్, యాక్షన్ ఎపిసోడ్స్ అన్ని అద్భుతంగా సినిమా ను మరో స్థాయి లో నిలబెట్టాయి. విడుదల అయినా ప్రతి చోట సక్సెస్ దిశగా దూసుకుపోతుంది.ఇందులో భాగంగా కళ్యాణ్ రామ్, మూవీ టీమ్ తో, కలిసి సక్సెస్ మీట్ నిర్వహించారు. తాజాగా ఆయన ఈ సినిమా గురించి, సినిమా పై తన కొడుకు ఇచ్చిన రివ్యూ గురించి, తెలిపారు. కళ్యాణ్ రామ్ సినిమా గురించి ఏం చెప్పారో చూద్దాం..


ఇండియన్ స్క్రీన్ పై ఇప్పటివరకు చూడలేదు ..

టాలీవుడ్ లో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమా భారీ అంచనాలతో ఈరోజు రిలీజ్ అయింది. తల్లి కొడుకుల ఎమోషన్ సీన్స్ కు అభిమానులు ఫిదా అవుతున్నారు. సినిమాకు సక్సెస్ దిశగా దూసుకుపోతుంది. ఇందుకుగాను చిత్ర యూనిట్ ఘనంగా సక్సెస్ మీట్ ని సెలెబ్రేట్ చేసింది. హీరో కళ్యాణ్ రామ్,దర్శకుడు ప్రదీప్ చిలుకూరి, నిర్మాత అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బలుసు, శ్రీకాంత్ ఇతరులు ఈ సక్సెస్ మీట్ లో పాల్గొన్నారు. ఈవెంట్ లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ..’ఈ సినిమా నా కెరియర్ లోనే, బిగ్గెస్ట్ చిత్రంగా నిలిచింది. విజయశాంతి గారితో కలిసి నటించడం నా అదృష్టం ఈ సినిమాలో తల్లి కొడుకుల బంధం ఎంత బలంగా ఉంటుందో, ఒక తల్లి తన బిడ్డ కోసం ఎటువంటి త్యాగాన్ని చేస్తుంది అనేది ఈ సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరికి  తల్లి కొడుకుల పాత్ర నచ్చుతుంది. ముఖ్యంగా క్లైమాక్స్ ప్రతి ప్రేక్షకుడికి కన్నీళ్లు తెప్పిస్తాయి. ఈరోజు మా అబ్బాయి ఈ సినిమాకు రివ్యూ ఇచ్చాడు సినిమా చూసి మా అబ్బాయి నాతో మాట్లాడుతూ..’క్లైమాక్స్ఈ సినిమాకి అద్భుతమైనసీక్వెన్స్  నాన్న. ఇలాంటి సీన్స్ ని ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటివరకు చూడలేదు. ఇలాంటి సీక్వెన్స్,చూసి నేను ఆశ్చర్యపోయాను. అసలు నిజంగా జరిగిందా లేదా అని, నేను చాలా షాక్ అయ్యాను నేను నిన్నుచూసి చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను నాన్న’ అని అన్నాడు.తన కొడుకు గురించి కళ్యాణ్ రామ్ సక్సెస్ మీట్ లో తెలపటం విశేషం.


వైజయంతి ఐపీఎస్ ..

ఈ సినిమాలో వైజయంతి ఐపీఎస్ పాత్రలో విజయశాంతి నటించి మెప్పించారు. కర్తవ్యం సినిమాలో వైజయంతి ఐపీఎస్ పాత్ర ప్రేక్షకులను ఎంత బాగా ఆకట్టుకుందో ఈ సినిమాలో ఆమె పాత్ర అంతే అద్భుతంగా ఆదరించారని, తెలిపారు. ఈ సినిమాలో శ్రీకాంత్ కీలక పాత్రలో కనిపించారు. ఈ సినిమా కళ్యాణ్ రామ్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బిజినెస్ సాధించిన చిత్రంగా నిలిచిందని,మూవీ టీమ్ తెలిపారు. విడుదలైన ప్రతి చోటా ఈ సినిమా అటు ఫ్యామిలీ ఆడియన్స్ ని, ఇటు యూత్ ని మరియు నందమూరి అభిమానులను, అలరిస్తోందడంలో ఆశ్చర్యం లేదు.

Hrithik Roshan : అంతా ఎన్టీఆర్ వల్లే… వార్ 2 మూవీలో ఇదే హైలెట్

Related News

Allu Arha – Manchu Lakshmi: ఆ భాష ఏంటి.. మంచు లక్ష్మీ పరువు తీసిన అల్లు అర్జున్ కూతురు!

Sravanthi Chokkarapu: ఆ విషయంలో అక్కినేని కోడలను ఫాలో అయిన యాంకర్ స్రవంతి..

Alekhya pickles Ramya: చాక్లేట్ తిని మా తమ్ముడు పెద్ద మనిషి అయ్యాడు.. ఇదేం కర్మ రా బాబు..

The Big folk night-2025: ఫ్యాన్స్ కి శుభవార్త.. అలా చేస్తే టికెట్ పై 20% డిస్కౌంట్.. తుదిగడువు అప్పుడే

Gaza: గాజాలో చిన్నారుల ఆకలి కేకలు.. కన్నీళ్లు పెట్టిస్తున్న దృశ్యాలు

Ali Wife : కొత్త బిజినెస్ మొదలుపెట్టిన అలీ వైఫ్ జుబేదా…మీ సపోర్ట్ కావాలంటూ?

Big Stories

×