ISRO Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. బీఈ, బీటెక్(మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సీఎస్), గేట్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగం సాధించిన అభ్యర్థులకు భారీ వేతనం అందిస్తారు. ప్రారంభ వేతనమే నెలకు రూ.56 వేల వరకు ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించి పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్(ISRO) సైంటిస్ట్, ఇంజినీర్ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. మే 19 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 63
ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ లో పలు రకాల పోస్టులు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో సైంటిస్ట్, ఇంజినీర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
పోస్టులు – వెకెన్సీల వారీగా చూసినట్లయితే..
సైంటిస్ట్/ఇంజినీర్(ఎలక్ట్రానిక్స్): 22 పోస్టులు
సైంటిస్ట్/ఇంజినీర్(మెకానికల్): 33
సైంటిస్ట్/ఇంజినీర్(కంప్యూటర్ సైన్స్): 08
దరఖాస్తుకు ప్రారంభ తేది: ఏప్రిల్ 29
దరఖాస్తుకు చివరి తేది: మే 19
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీఈ, బీటెక్(మెకానికల్, ఎలక్ట్రానిక్స్, సీఎస్), గేట్‌లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయస్సు: 28 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: నెలకు రూ.56వేల వరకు జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
దరఖాస్తు ఫీజు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు రూ.250 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://www.isro.gov.in
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం కూడా ఉంటుంది. నెలకు రూ.56 వేల జీతం అందజేస్తారు. మరి ఇలాంటి అవకాశాన్ని అర్హత ఉన్న వారు సద్వినియోగం చేసుకోండి. ఇస్రో ఉద్యోగ అవకాశం వచ్చినప్పుడే సద్వినియోగం చేసుకోవాలి. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే దరఖాస్తు చేసుకుండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
Also Read: Pilot job: ఇండియాలో పైలట్, ఎయిర్ హోస్టెస్‌కు వచ్చే జీతం ఎంత? ఆ జాబ్స్‌కు ఎలా అప్లై చేయాలి?
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం వెకెన్సీల సంఖ్య: 63
దరఖాస్తుకు చివరి తేది: మే 19
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ
జీతం: రూ.56,000