BigTV English

Masoom Sharma: గాంధీజీని అలా మార్చేశావేంటయ్యా? ఇది తప్పు అనిపించడం లేదా?

Masoom Sharma: గాంధీజీని అలా మార్చేశావేంటయ్యా? ఇది తప్పు అనిపించడం లేదా?

Viral Video: సోషల్ మీడియాలో ట్రెండింగ్ టాపిక్ తీసుకుని నెటిజన్లు రకరకాల రీల్స్, మీమ్స్ చేస్తుంటారు. మరికొంత మంది పెయింటర్స్ కూడా వివాదాస్పద అంశాలను బేస్ చేసుకుని పెయింటింగ్స్, కార్టూన్స్ వేస్తుంటారు. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంటాయి. తాజాగా సుఖ్‌ వేందర్ సంగ్వాన్ అనే ప్రొఫెషనల్ కార్టూనిస్ట్.. కరెన్సీ నోటుపై వేసిన ఓ పెయింటింగ్ నెట్టింట వైరల్ అవుతోంది. నెటిజన్లు ఈ ఫోటోపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఇంతకీ కరెన్సీ నోటుపై ఆయన వేసిన పెయింటింగ్ ఏంటి? ఎందుకు వివాదాస్పదం అయ్యింది?


గాంధీ ఫోటో మసూమ్ శర్మగా మార్పు

తాజాగా హర్యానీ గాయకుడు మసూమ్ శర్మ వార్తల్లోకి ఎక్కాడు. తన కచేరీలో వివాదాస్పద అంశాలను ప్రసావించడం తీవ్ర దుమారం రేపింది. కొన్ని నిషేధిత పాటలు పాడటంతో హర్యానా, పంజాబ్ రాష్ట్రాల మధ్య గొడవకు కారణం అయ్యింది. ఈ నేపథ్యంలో సుఖ్‌ వేందర్ సంగ్వాన్ రూ. 20 నోటుపై గాంధీ ఫోటోను మసూమ్ శర్మగా మార్పు చేశాడు. గాంధీని మసూమ్ శర్మగా పెయింట్ చేశాడు. “ఈ ఫోటో అనేది కేవలం ఎంటర్ టైన్ మెంట్ కోసమే. ఇది నిజం కరెన్సీ నోటు కాదు” అని సుఖ్ వేందర్ వెల్లడించాడు. ఈ వీడియోను చూసి కొంత మంది నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరికొంత మంది ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు. సుఖ్ వేందర్ మంచి పెయింటర్ అనే గౌరవం ఉన్నప్పటికీ, జాతిపిత ఫోటోను ఓ వివాదాస్పద గాయకుడి ఫోటోగా మార్చడం కరెక్ట్ కాదంటున్నారు. ఇలా మార్చడం నిజంగా నిబంధనలను ఉల్లంఘించడమే అవుతుందని.. కచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందేనని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.


ఎవరీ మసూమ్ శర్మ?

మసూమ్ శర్మ ఓ హర్యానీ గాయకుడు. కంపోజర్, లిరిసిస్ట్. ఎక్కువగా హర్యానీ పాటలు పాడుతాడు.  అతడి పాటలు హింసను ప్రేరేపించేలా ఉన్నాయనే ఆరోపణలు ఉన్నాయి. గన్ కల్చర్ కు మద్దతు ఇస్తాడనే ప్రచారం ఉంది. రీసెంట్ గా ఆయన పలు వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన పాడిన పాటలు కూడా కొన్ని వివాదాలకు కారణం అయ్యాయి. ముఖ్యంగా హర్యానా, పంజాబ్ రాష్ట్రాల మధ్య గొడవలకు కారణం అయ్యింది. గుర్ గ్రామ్ లో జరిగిన ఓ ఈవెంట్ లో అతడిని ప్రేక్షకులు ఓ నిషేధిత పాటను పాడాలని ప్రేక్షకులు కోరారు. అయితే, తాను ఆ పాట పాడలేనని, ప్రేకులే పాడాలన్నాడు. ఆయన వ్యాఖ్యలు తీవ్ర వివాదం రేపాయి.  అటు ఓ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్ కూడా వివాదం అయ్యింది. చండీగఢ్ లో ఏర్పాటు చేసిన ఓ ఈవెంట్ లో గొవడ జరిగింది. ఈ ఘటనలో ఓ విద్యార్థి చనిపోయాడు. ముగ్గురు గాయపడ్డారు. అతడి పాటులు, ప్రదర్శనలపై తీవ్ర చర్చ జరిగింది. కొంతమంది ఆయనను సమర్థిస్తే, మరికొంత మంది వ్యతిరేకించారు. అతడి ఫోటోను సుఖ్ వేందర్ కరెన్సీ నోటుపై గీయడం తీవ్ర దుమారం రేపుతోంది.

Read Also: క్రూయిజ్ షిప్ అనుకున్న టైమ్ కి బయల్దేరకపోతే ఫైన్ వేస్తారా? ఆశ్చర్యంగా ఉందే!

Related News

Gurgaon man: మోడల్ ను చూసి ఆపుకోలేక.. రోడ్డు మీదే ఆ పాడు పని.. మరీ ఇలా తయారయ్యారేంట్రా?

Liquor party: కోడలు మందు పార్టీ.. మామ రివేంజ్.. పోలీసుల ఎంట్రీ!

Beggar Viral News: ఆ బిచ్చగాడికి ఇద్దరు భార్యలు.. కలెక్టర్ కు.. వింత రిక్వెస్ట్, నవ్వకండి సీరియస్ మేటర్!

Gujarat Bridge: భలే ఐడియా.. గుజరాత్ వంతెనపై చిక్కుకున్న లారీ.. ఎయిర్ బెలూన్స్‌ తో ఇలా సేవ్ చేశారు!

Rules In Village: ఇదేం దిక్కుమాలిన నియమాలు.. వ్యక్తిని తాకితే రూ.5000 జరిమానా! ఎక్కడో తెలుసా?

Street Food: నూనె ప్యాకెట్ కట్ చేయకుండా నేరుగా.. ఇక్కడ బజ్జీలు తింటే పాడెక్కడం ఖాయం!

Big Stories

×