Raveena Tandon: సినీ సెలబ్రిటీలపై ప్రేక్షకుల ఫోకస్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారు ఏం మాట్లాడినా కాస్త జాగ్రత్తగా మాట్లాడాల్సి ఉంటుంది. ఒకవేళ వారి పొరపాటున ఏదైనా తప్పుగా మాట్లాడినా, సెన్సిటివ్ విషయాల్లో కామెడీ చేసినా దానికి రియాక్షన్స్ ఎలా ఉంటాయో కూడా ఊహించడం కష్టమే. అయిదేళ్ల క్రితం అలా ఒక సీనియర్ నటి, లేడీ డైరెక్టర్ చేసిన కామెంట్స్ వల్ల చట్టపరంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక అయిదేళ్ల తర్వాత ఇప్పటికీ వీరికి ఆ కేసు నుండి విముక్తి కలిగింది. ఆ సీనియర్ నటి మరెవరో కాదు.. రవీనా టండన్. ఇప్పటికే రవీనా లైఫ్‌లో ఎన్నో కాంట్రవర్సీలు ఉండగా అయిదేళ్ల క్రితం తనపై నమోదయిన కేసు నుండి తనకు ఫైనల్‌గా విముక్తి లభించింది.
వారందరిపై కేసు
దాదాపు అయిదేళ్ల క్రితం ‘బ్యాక్‌బెంచర్స్’ అనే ఒక షోలో రవీనా టండన్, ఫరా ఖాన్ చేసిన మతపరమైన వ్యాఖ్యలు చాలామంది ప్రేక్షకుల మనోభావాలను దెబ్బతీశాయి. ముందుగా ఆ షోకు హోస్ట్ అయిన భారతీ సింగ్ ఒక పదాన్ని తప్పుగా చెప్పడంతో ఈ కాంట్రవర్సీ మొదలయ్యింది. అది ఒక మతం గురించి తప్పుగా మాట్లాడినట్టుగా ఉందని ప్రేక్షకులు ఫైర్ అయ్యారు. దీంతో భారతీ సింగ్‌తో పాటు అదే షోలో ఉన్న స్క్రీన్ రైటర్ అబ్బాస్ అజీజ్ దలాల్, ఫరా ఖాన్, రవీనా టండన్‌పై ఎఫ్‌ఐఆర్ ఫైల్ అయ్యింది. 2019 డిసెంబర్‌లో అజ్నాలా పోలీస్ స్టేషన్‌లో ఈ కేసు నమోదయ్యింది. వీరి తరపున అభినవ్ సూద్ అనే లాయర్ వాదించి వీరికి కేసు నుండి ఊరట లభించేలా చేసినట్టుగా తెలుస్తోంది.
విచారణ వద్దు
రవీనా టండన్ (Raveena Tandon)తో పాటు ఇతరులపై ఫైల్ అయిన కేసును పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు పూర్తిగా కొట్టివేయలేదు. కానీ తర్వాత హియరింగ్‌ను మాత్రం జులై 14కు వాయిదా వేసింది. అప్పటి వరకు ఈ కేసు విషయంలో ఎవ్వరినీ విచారణ చేయాల్సిన అవసరం లేదని పోలీసులను ఆదేశించింది. దీంతో వీరందరికీ ఈ కేసులో కాస్త ఊరట లభించినట్టు తెలుస్తోంది. వీరందరిపై కేసు నమోదయినా కూడా అసలు వారి మాటలు ఎవరినీ ఉద్దేశించినవి కాదని, ఏ మతవాసులను హర్ట్ చేయాలని వారు అలా మాట్లాడలేదని వారి తరపున లాయర్ వాదించారు. మొత్తానికి జులై 14న తర్వాత హియరింగ్ తర్వాత ఈ కేసుకు ఫైనల్ జడ్జిమెంట్ వస్తుందేమో అని రవీనాతో పాటు మిగతా వాళ్లు కూడా ఆశిస్తున్నారు.
Also Read: పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్.. ఏమన్నారంటే.?
వారుసురాలి ఎంట్రీ
ఒకప్పుడు హిందీతో పాటు సౌత్ భాషల్లో కూడా హీరోయిన్‌గా నటించి అందరినీ మెప్పించింది రవీనా టండన్. అప్పుడు మాత్రమే కాదు.. ఇప్పటికీ తనకు బీ టౌన్‌లో మంచి డిమాండ్ ఉంది. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేయకపోయినా తనకు వచ్చే మంచి పాత్రలను మాత్రం రిజెక్ట్ చేయకుండా అప్పుడప్పుడు వెండితెరపై అలరిస్తూనే ఉంది రవీనా. ఇక తాజాగా తన కుమార్తె రాషా తడానీని కూడా హీరోయిన్‌గా మార్చేసింది. కానీ రాషా కూడా ఇతర నెపో కిడ్స్‌లాగానే తన డెబ్యూ సినిమాతో ప్రేక్షకులను డిసప్పాయింట్ చేసింది.