Indian Coast Guard: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది శుభవార్త భారత తీర రక్షక దళంలో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత ఉన్న వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి మంచి భవిష్యత్తు ఉంటుంది. ఎగ్జామ్ పాసైన వారికి ఉద్యోగాన్ని బట్టి జీతాన్ని నిర్ణయిస్తారు. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, వెకెన్సీలు, అందులో ఉన్న పోస్టులు, వయస్సు, ముఖ్యమైన తేదీలు, ఉద్యోగ ఎంపిక విధానం గురించి క్లియర్ కట్ గా తెలుసుకుందాం.
భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీరరక్షక దళం, కోస్ట్ గార్డ్ ఎన్‌రోల్డ్ పర్సనల్ టెస్ట్ (CGEPT)-01/ 2026 అండ్ 02/ 2026 బ్యాచ్ ద్వారా నావిక్ (జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అదికాులు నోటిఫికేషన్ విడుదల చేశారు. రాత, శరీరదారుడ్య, వైద్య పరీక్షల ద్వారా ఈ ఉద్యోగ నియామకం చేపట్టనున్నారు. ఈ ఉద్యోగాలకు జూన్ 25న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఉద్యోగాలకు అప్లికేషన్ పెట్టుకోవాల్సి ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 630
భారత తీర రక్షక దళంలో వివిధ రకాల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఇందులో యాంత్రిక్, నావిక్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.
సీజీఈపీటీ- 01/26 బ్యాచ్, సీజీఈపీటీ- 02/26 బ్యాచ్ ద్వారా శిక్షణ ఇస్తారు.
ఉద్యోగాలు – వెకెన్సీలు:
సీజీఈపీటీ- 01/26 బ్యాచ్ ద్వారా..
నావిక్(జనరల్ డ్యూటీ): 260 పోస్టులు
యాంత్రిక్(మెకానికల్/ ఎలక్ట్రికల్/ ఎలక్ట్రానిక్స్): 60 పోస్టులు
సీజీఈపీటీ- 02/26 బ్యాచ్ ద్వారా
నావిక్(జనరల్ డ్యూటీ): 260 పోస్టులు
నావిక్ (డొమెస్టిక్ బ్రాంచ్): 50
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి విద్యార్హతను నిర్ణయించారు. నావిక్ పోస్టులకు ఇంటర్ (మ్యాథ్స్/ ఫిజిక్స్), నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ పోస్టులకు టెన్త్ క్లాస్, యాంత్రిక్ పోస్టులకు టెన్త్ లేదా ఇంటర్ తో పాటు సంబంధిత విభాగంలో డిప్లొమా పాసై ఉండాలి. ఎలాంటి ఎక్స్ పీరియన్స్ అవసరం లేదు.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 జూన్ 11
దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 25
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 18 నుంచి 22 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: ఉద్యోగాన్ని బట్టి జీతాన్ని నిర్ణయించారు. నెలకు నావిక్ పోస్టులకు రూ.21,700 జీతం ఉంటుంది. యాంత్రిక్ పోస్టులకు రూ.29,200 జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: స్టేజ్-1, స్టేజ్-2, స్టేజ్-3, స్టేజ్-4 పరీక్షలు, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ఫీజు: రూ.300 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఫీజు మినహాయింపు ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ఎగ్జామ్ డేట్స్: స్టేజ్- 2025 సెప్టెంబర్, స్టేజ్ 2- 2025 నవంబర్, 2026 ఫిబ్రవరి, స్టేజ్ 3- 2026 ఫిబ్రవరి, 2026 జులై
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ALSO READ: BEL: డిగ్రీ అర్హతతో బెల్‌లో ఉద్యోగాలు.. రూ.60వేల జీతం, డోంట్ మిస్
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఖాళీల సంఖ్య: 630
లాస్ట్ డేట్: జూన్ 25