Rishabh Pant : ఇంగ్లాండ్ పర్యటనలో భారత్ చాలా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది అని అనుకుంటున్న సమయంలోనే ఎదురుదెబ్బ తగిలింది. కేవలం 471 పరుగులకే టీమిండియా ఆలౌట్ అయింది. లీడ్స్ వేదికగా జరుగుతున్న తొలిటెస్ట్ లో ముగ్గురు సెంచరీలు చేశారు. యశస్వి జైస్వాల్ 101, శుబ్ మన్ గిల్ 147, రిషబ్ పంత్ 134 పరుగులు చేసి ఔట్ అయ్యాడు. అయితే నిన్న హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న పంత్ ఇవాళ ఆట ప్రారంభం నుంచి దూకుడుగా ఆడాడు. ముఖ్యంగా పంత్ సిక్స్ కొట్టి సెంచరీ పూర్తి చేయడం విశేషం. సెంచరీ చేయగానే రిషబ్ పంత్ ఐపీఎల్ మ్యాచ్ లో గంతులు వేసినట్టు ఇంగ్లాండ్ పర్యటనలో కూడా గంతులు వేశాడు. అనంతరం కెప్టెన్ శుబ్ మన్ గిల్ కి హగ్ ఇచ్చాడు. ఈ నేపథ్యంలోనే క్రికెట్ దిగ్గజం.. కామెంటేటర్ సునీల్ గవాస్కర్ పంత్ పై పొగడ్తల వర్షం కురిపించారు. సెంచరీ పూర్తి కాగానే.. సూపర్బ్.. సూపర్బ్ అంటూ అభినందించారు. బీజీటీలో పంత్ విఫలమైనప్పుడు గవాస్కర్ స్టుపిడ్..స్టుపిడ్ అంటూ తిట్టిన విషయం తెలిసిందే.
Also Read : Mohammed Siraj : సిరాజ్ చెవిలో ఆ సీక్రెట్ పరికరం ఏంటి..?
తాజాగా మరో ఆసక్తికర ఘటన చోటు చేసుకోవడం విశేషం. వైస్ కెప్టెన్ రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఫ్రంట్ పుట్ కి వచ్చి బ్యాటింగ్ చేశాడు. అయితే ఈ సమయంలోబ్యాట్ మిస్ అయింది. అలాగే షూలు కూడా మిస్ అయ్యాయి. కాలు షూ ఊడిపోయినప్పటికీ.. పంత్ మాత్రం అలాగే పరుగెడతాడు. బ్యాట్ ను సైతం వదిలేస్తాడు. ఫ్రంట్ పుట్ కి వెళ్లి బ్యాటింగ్ చేసినప్పటికీ స్టంప్ మిస్ అయింది. దీంతో సోషల్ మీడియాలో ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తెగ వైరల్ కావడం విశేషం. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా 500 పరుగులకు పైగా బ్యాటింగ్ చేస్తుందని అటు అభిమానులు భావిస్తే.. వెంట వెంటనే వికెట్లు పడిపోయి రాణించలేకపోయింది. తొలిరోజు ఆడిన ఆటను ఇవాళ టీమిండియా ప్రదర్శించలేకపోయింది. కొందరూ క్రీడాభిమానులు మాత్రం ఇంగ్లాండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడానికి ఇలా వికెట్లు తీయాలనే కారణమే అయి ఉండవచ్చని పేర్కొంటున్నారు.
మరోవైపు టీమిండియా తరపున వికెట్ కీపర్ రిషబ్ పంత్ టెస్ట్ క్రికెట్ లో సరికొత్త చరిత్ర ను లిఖించాడు. భారత్ తరపున అత్యధిక టెస్టు సెంచరీలు బాదిన తొలి వికెట్ కీపర్ గా పంత్ రికార్డు నెలకొల్పాడు. ఇంగ్లాండ్ తో జరుగుతున్న తొలి టెస్ట్ లో ఆయన ఈ ఘనత సాధించాడు. ఈ నేపథ్యంలోనే భారత క్రికెట్ దిగ్గజం ఎం.ఎస్. ధోనీ (6)ని పంత్ అధిగమించాడు. వీరిద్దరి తరువాత వృద్ధిమాన్ సాహా 3 సెంచరీలు చేశాడు. ముఖ్యంగా భారత్ లోయర్ ఆర్డర్ విఫలం అయింది. చివరి చివరి 7 వికెట్లు కేవలం 41 పరుగుల కే కోల్పోవడం గమనార్హం. ఇంగ్లాండ్ బౌలర్లలో స్టోక్స్ 4, టంగ్ 4, కార్స్, బషీర్ చెరో వికెట్ తీసుకున్నారు. ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ ఏవిధంగా చేస్తుందో వేచి చూడాలి మరీ.
— Out Of Context Cricket (@GemsOfCricket) June 21, 2025