BigTV English
Advertisement

Kannappa Movie: బాహుబలిలో ప్రభాస్.. కన్నప్పలో విష్ణు ఇద్దరూ ఒక్కటేనా?

Kannappa Movie: బాహుబలిలో ప్రభాస్.. కన్నప్పలో విష్ణు ఇద్దరూ ఒక్కటేనా?

Kannappa Movie: మంచు విష్ణు(Manchu Vishnu) తన డ్రీం ప్రాజెక్ట్ కన్నప్ప(Kannappa)తో త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ సినిమా చేయాలనే దశాబ్దపు కల నెరవేరి మరొక వారం రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో చిత్ర బృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తూ ఉన్నారు.ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇన్ని రోజులు ఉత్తరాది రాష్ట్రాలలో ఘనంగా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించిన చిత్ర బృందం ఇప్పుడు హైదరాబాద్లో ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహిస్తున్నారు. హైదరాబాద్ జెఆర్ సీ కన్వెన్షన్ లో ఎంతో ఘనంగా కన్నప్ప సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరుగుతుంది.


దశాబ్దాలు వెనక్కి..

ఈ కార్యక్రమానికి చిత్ర బృందం మొత్తం హాజరై సందడి చేశారు.ఈ కార్యక్రమంలో భాగంగా నటుడు శివబాలాజీ (Shiva Balaji)మాట్లాడుతూ ఎన్నో విషయాలను తెలియచేశారు. కన్నప్ప సినిమా అనేది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అని తెలిపారు. ఈ సినిమా కోసం ఆయన కొన్ని దశాబ్దాలు వెనక్కి వెళ్లి, ఎన్నో గ్రంథాలను పుస్తకాలను చదువుతూ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారని తెలిపారు. ఈ సినిమాని ఏ విధంగా ప్రేక్షకులలోకి తీసుకెళ్లాలి, వారికి ఎలా చూపించాలనే విషయాలపై ఎంతో శ్రద్ధ చూపిస్తూ ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారని వెల్లడించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ సినిమాపై మంచి అంచనాలను పెంచడంతో తెలుగు రాష్ట్రాలలో కన్నప్ప సినిమా పండుగ మొదలైందని శివ బాలాజీ తెలియజేశారు.


ప్రభాస్ బాహుబలి…

ఇక ఈ సినిమా కోసం విష్ణు ఎంతో కష్టపడ్డారు ఎంతలా అంటే బాహుబలి(Bahubali) సినిమాలో ప్రభాస్(Prabhas) ఏ విధంగా అయితే సినిమా కోసం కష్టపడ్డారో, కన్నప్ప సినిమాలో కూడా మంచు విష్ణు అంతగా కష్టపడి పని చేశారని తెలిపారు. బాహుబలి సినిమాలో ప్రభాస్ శివలింగాన్ని ఎలా భుజం మీద ఎత్తుకొని తీసుకొస్తారు అదేవిధంగా కన్నప్ప సినిమాలో కూడా మంచు విష్ణు శివలింగాన్ని తన తలపై పెట్టుకుని ఇన్ని రోజులు బరువు మోసారు అంటూ , ఈ సినిమా కోసం విష్ణు పడిన కష్టాన్ని తెలియజేశారు. ఇలా కన్నప్ప సినిమాలో మంచు విష్ణు నటన, ప్రభాస్ బాహుబలి సినిమాకు ఏమాత్రం తీసిపోదని ఈయన చెప్పకనే చెప్పేశారు.

కన్నప్ప పండగ మొదలైంది…

కన్నప్ప కోసం విష్ణు ఎంతో కష్టపడ్డారని స్పష్టంగా తెలుస్తోంది. మరి ఈయన పడిన కష్టానికి తగిన ప్రతిఫలం అందుతుందా? లేదా? అనేది తెలియాలి అంటే జూన్ 27వ తేదీ వరకు ఎదురు చూడాల్సిందే. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషలలో ఒకేసారి విడుదల కాబోతోంది. పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్, మలయాళ నటుడు మోహన్ లాల్ , కాజల్ అగర్వాల్ ప్రభాస్ వంటి నటీనటులు భాగమైన విషయం తెలిసిందే. ఇలా స్టార్ సెలబ్రిటీలు ఈ సినిమాలో భాగం కావడంతో సినిమాపై కూడా మంచి అంచనాలే ఉన్నాయి ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కూడా సినిమాపై అంచనాలను పెంచేసింది.

Also Read:  Nagarjuna: అఖిల్ హిట్టు కొడతాడా? నాగ్ సమాధానం ఇదే!

Related News

Vijay Sethupathi : నువ్వు బెడ్ మీదే పడుకుంటున్నావా? ఆండ్రియా గురించి విజయ్ సేతుపతి ఇలా అనేసారేంటి?

Rajinikanth : రజనీకాంత్ 173వ సినిమాకి అనిరుధ్ ఫిక్స్, కంప్లీట్ డీటెయిల్స్ ఇవే

Deepika Padukone: ఇండస్ట్రీలో వివక్షత ఉంది.. మళ్ళీ మొదలు పెట్టిన దీపిక!

Karan Johar: ఒంటరిగా ఉండలేకపోతున్నా..53 ఏళ్ల వయసులో తోడు కోసం బాధ పడుతున్న డైరెక్టర్!

Anaganaga Oka raju : సంక్రాంతికి ఖాయం, అపోహలకు బ్రేక్ పడినట్లే, ప్రస్తుతం షూటింగ్ అక్కడే 

Thiruveer: ప్రీ వెడ్డింగ్ షో హిట్..మరో సినిమాకు కమిట్ అయిన తిరువీర్..పూర్తి వివరాలివే!

RT76 : భక్త మహాశయులకు విజ్ఞప్తి గ్లిమ్స్ రెడీ, రవితేజ ఏదైనా గట్టెక్కిస్తుందా?

Jana Nayagan : ఈ అంశాలు గమనిస్తే రీమేక్ సినిమా అని ఈజీగా అర్థమయిపోతుంది. 

Big Stories

×