OTT Movie : హారర్ జానర్ కి ఉన్న ఒక ప్రత్యేత ఏమిటంటే, ప్రేక్షకలను భయపెడుతూ ఎంటర్టైన్ చేస్తుంటాయి. ఈ జానర్ ని ఫ్యామిలీ ఆడియన్స్ తో సహా అందరూ చూడటానికి ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే సినిమా గుజరాత్‌లోని రాణివాడ గ్రామంలో జరుగుతుంది. నవరాత్రి సమయంలో ఒక మంత్ర గత్తె పెట్టిన శాపంతో ఈ కథ నడుస్తుంది. ఈ గుజరాతీ సినిమాగా బాక్స్ ఆఫీస్ వద్ద 260 కోట్లు వసూలు చేసి రికార్డ్ సృష్టించింది. థియేటర్లలో హిట్ అయిన ఈ సినిమా, ఓటీటీలో డీసెంట్ వ్యూస్ సాధించింది. ఈ సినిమా జస్ట్‌వాచ్‌లో ఇండియా స్ట్రీమింగ్ చార్ట్స్‌లో 76వ స్థానంలో నిలిచింది. ఈ సినిమా పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? స్టోరీ ఏమిటి ? అనే వివరాలను తెలుసుకుందాం పదండి.
‘ఝంకుడి’ 2024లో విడుదలైన గుజరాతీ హారర్ కామెడీ మూవీ. ఉమంగ్ వ్యాస్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో మానసీ పరేఖ్, విరాజ్ ఘెలానీ, సంజయ్ గోరడియా, ఓజస్ రావల్, చేతన్ దైయా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమా 2024 మే 31న థియేటర్లలో విడుదలై, షెమరూ మీలో 2024 అక్టోబర్ 17 నుంచి స్ట్రీమ్ అవుతోంది. 2 గంటల 32 నిమిషాల రన్‌టైమ్ తో, ఈ సినిమా IMDbలో 6.4/10 రేటింగ్ పొందింది.
గుజరాత్‌లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. గర్బా నృత్యాలతో రాష్ట్రం సందడిగా ఉంటుంది. అయితే రాణీవాడ అనే చిన్న గ్రామం మాత్రం శతాబ్దాలుగా చీకటిలో మునిగి ఉంటుంది. ఈ గ్రామంలో గర్బా నృత్యం చేయడం ఝంకుడి అనే దుష్ట మంత్రగత్తె శాపం కారణంగా నిషేధించబడింది. ఈ శాపం గురించి గ్రామస్థులు భయపడుతూ, నవరాత్రి సమయంలో గర్బా నృత్యం చేయకుండా జాగ్రత్త పడతారు. ఎందుకంటే ఈ నియమాన్ని ఉల్లంఘిస్తే, ఝంకుడి లాంటి భయంకరమైన శక్తులు మళ్లీ విజృంభిస్తాయని వారి నమ్మకం.
ఈ సినిమా కథ బబ్లో అనే తెలివైన, కానీ కొంచెం తమాషాగా ఉండే రియల్ ఎస్టేట్ ఏజెంట్ చుట్టూ తిరుగుతుంది. బబ్లో నగరంలో తన జీవితాన్ని గడుపుతూ, తన సొంత లాభాల కోసం చిన్న చిన్న ట్రిక్స్ ఉపయోగిస్తూ ఉంటాడు. అతను ఊహించని విధంగా రాణీవాడ గ్రామానికి తిరిగి రావాల్సి వస్తుంది. ఎందుకంటే గ్రామంలో ఒక పెద్ద సమస్య ఏర్పడుతుంది. ఇదే సమయంలో కుముద్ అనే ఒక ఎన్ఆర్ఐ గ్రామంలోని రాజవంశం వారసురాలు, తన కుటుంబ వారసత్వాన్ని తిరిగి పొందడానికి గ్రామానికి వస్తుంది.గ్రామంలో నవరాత్రి సమయంలో, కొందరు గ్రామస్థులు ఝంకుడి శాపం గురించి తెలియక, గర్బా నృత్యం చేయడం ద్వారా నియమాలను ఉల్లంఘిస్తారు.
దీంతో ఝంకుడి దుష్ట శక్తులు మళ్లీ పుట్టుకొస్తాయి. గ్రామంలో భయంకరమైన సంఘటనలు ప్రారంభమవుతాయి. గ్రామస్థులు భయపడుతూ, ఈ శాపం నుండి బయటపడే మార్గం కోసం వెతుకుతారు. బబ్లో తన తెలివితేటలతో ఈ సమస్యను పరిష్కరించడానికి ముందుకు వస్తాడు. కుముద్ గ్రామంతో ఉన్న అనుబంధంతో, బబ్లోతో కలిసి ఈ మిస్టరీని ఛేదించడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఇద్దరూ ఝంకుడి శాపం మూలాన్ని కనుగొనేందుకు ఒక సాహసయాత్రను ప్రారంభిస్తారు. బబ్లో, కుముద్ ఝంకుడి రహస్యాన్ని ఛేదించడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, అనేక భయానక సంఘటనలను ఎదుర్కొంటారు. బబ్లో, కుముద్ ఈ రహస్యాన్ని కనిపెడతారా ? ఝంకుడి ఈ గ్రామానికి ఎందుకు ఆ శాపం పెట్టింది ? ఆమె గతం ఏమిటి ? అనే విషయాలను ఈ సినిమాను చూసి తెలుసుకోవాల్సిందే.
Read Also : ట్రాన్స్ జెండర్ల బ్రూటల్ రివేంజ్… ఒక్కో ట్విస్టుకు గూస్ బంప్స్… పెద్దలకు మాత్రమే ఈ మూవీ