BigTV English
Advertisement

UPSC Recruitment: యూపీఎస్సీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. జస్ట్ ఇంటర్వ్యూ ద్వారానే జాబ్

UPSC Recruitment: యూపీఎస్సీ నుంచి ఉద్యోగ నోటిఫికేషన్.. జస్ట్ ఇంటర్వ్యూ ద్వారానే జాబ్

UPSC Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. బీటెక్‌/బీఈ, డిప్లొమా, బీఏఎంఎస్, బీయూఎంఎస్, ఎంఎస్సీ, ఎంఈ/ఎంటెక్‌ పాసైన వారికి ఇది గోల్డెన్ ఛాన్స్ అని చెప్పవచ్చు. ఇందులో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఇస్తారు. దీనికి సంబంధించిన పూర్తి నోటిఫికేషన్ వివరాల గురించి క్లియర్ కట్ గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(UPSC) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ మైనింగ్ ఇంజినీర్‌, ట్రైనింగ్‌ ఆఫీసర్‌ తదితర పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత గల అభ్యర్థులు మే 10వ తేదీ నుంచి 29 వరకు  జస్ట్ రూ.25 ఫీజు చెల్లించి ఆన్‌లైన్‌లో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 84


యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లో పలు రకాల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇందులో అసిస్టెంట్ మైనింగ్ ఇంజినీర్, ట్రైనింగ్ ఆఫీసర్ పోస్టులు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు:

రీసెర్చ్‌ ఆఫీసర్‌: 01
 డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆర్కియాలజికల్ ఆర్కిటెక్ట్: 02
 డిప్యూటీ సూపరింటెండింగ్‌ ఆర్కియాలజికల్ ఇంజినీర్‌: 15
 ప్రొఫెసర్‌(కెమికల్ ఇంజినీరింగ్‌): 01
 సైంటిఫిక్ ఆఫీసర్‌: 01
 అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌(కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్): 01
 అసిస్టెంట్ ప్రొఫెసర్(సాయిల్ మెకానిక్స్‌): 01
 మెడికల్‌ ఆఫీసర్‌(ఫీమేల్‌): 03
 సైంటిస్ట్‌-బి(ఫారెన్సిక్‌ సైకాలజీ): 02
 అసిస్టెంట్ డైరెక్టర్‌(సేఫ్టీ): 02
 అసిస్టెంట్ మైనింగ్‌ ఇంజినీర్‌(మైన్స్‌): 03
 అసిస్టెంట్‌ రీసెర్చ్‌ ఆఫీసర్‌: 01
 సీనియర్ అసిస్టెంట్ (కంట్రోలర్‌ ఆఫ్‌ మైన్స్‌): 02
 ఇంజినీర్‌ & షిప్‌ సర్వేయర్‌-కమ్ డిప్యూటీ జనరల్(టెక్నికల్): 02
 ట్రైనింగ్ ఆఫీసర్‌(ఎక్సెప్ట్ ఉమెన్‌ ట్రైనింగ్‌): 04
 ట్రైనింగ్ ఆఫీసర్‌(ఫిట్టర్‌): 21
 ట్రైనింగ్ ఆఫీసర్‌(మెకానిక్‌ డీసిల్‌): 04
 ట్రైనింగ్ ఆఫీసర్‌(మెషనిస్ట్‌): 01
 ట్రైనింగ్ ఆఫీసర్‌(ప్లంబర్‌): 03
 ట్రైనింగ్‌ ఆఫీసర్‌(సీవింగ్ టెక్నాలజీ): 04
 మెడికల్ ఆఫీసర్‌(ఆయుర్వేద): 09
 మెడికల్‌ ఆఫీసర్‌(యునాని): 01

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో బీటెక్‌/బీఈ, డిప్లొమా, బీఏఎంఎస్, బీయూఎంఎస్, ఎంఎస్సీ, ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణతతో సాధించి ఉండాలి. వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకంటారు.

వయస్సు: 35 నుంచి 55 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

దరఖాస్తు ప్రారంభ తేది: 2025 మే 10

దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 29

దరఖాస్తు ఫీజు: రూ.25 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడండి.

అఫీషియల్ వెబ్ సైట్: https://upsc.gov.in

అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు వెంటనే ఈ జాబ్స్ కు అప్లై చేసుకోండి.

Also Read: SBI Recruitment: ఎస్బీఐలో భారీగా ఉద్యోగాలు.. తెలుగు రాష్ట్రాల్లోనూ ఖాళీలు.. జీతం రూ.48,480

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 84

దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 29

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ద్వారా

Also Read: IOB Recruitment: డిగ్రీ అర్హతతో ఐఓబీలో భారీగా ఉద్యోగాలు.. నెలకు రూ.85,920 జీతం

Related News

BRO Notification: టెన్త్ క్లాస్ అర్హతతో భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. జీతమైతే అక్షరాల రూ.63,200.. ఇంకెందుకు ఆలస్యం

SBI Notification: డిగ్రీ అర్హతతో స్పెషలిస్ట్ ఉద్యోగాలు.. ఇలాంటి నోటిఫికేషన్ రేర్, జాబ్ వస్తే లైఫ్ అంతా సెట్

RITES Notification: డిగ్రీ, డిప్లొమా అర్హతతో భారీగా జాబ్స్.. ఉద్యోగ ఎంపిక విధానమిదే, ఇంకా వారం రోజులే

ISRO: ఇస్రోలో ఉద్యోగాలు.. రూ.1,77,500 జీతం, టెన్త్, డిగ్రీ పాసైతే చాలు

PNB LBO: నిరుద్యోగులకు పండుగే.. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో భారీగా ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు బ్రో

SEBI JOBS: సెబీలో ఆఫీసర్ ఉద్యోగాలు.. రూ.1,26,100 జీతం, దరఖాస్తు ప్రక్రియ షురూ

BEL Notification: బెల్‌లో భారీగా ఉద్యోగాలు.. బీటెక్ పాసైతే చాలు, జీతం అక్షరాల రూ.1,40,000

IB Jobs: ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు.. జిందగీలో ఇలాంటి జాబ్ కొట్టాలి భయ్యా.. లైఫ్ అంతా సెట్

Big Stories

×