Milk Valley: జమ్మూ కాశ్మీర్‌లోని బుద్గాం జిల్లాలో దూద్‌పత్రి ఓ అదిరిపోయే టూరిస్ట్ స్పాట్. దీన్ని ‘పాల లోయ’ అని కూడా పిలుస్తారు. శ్రీనగర్ నుంచి కేవలం 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. పచ్చటి కొండలు, పైన్ చెట్లతో చుట్టూ అందంగా ఉంటుంది. సిటీ జీవితం హడావిడి నుంచి రిలాక్స్ అవ్వాలనుకుంటే ఇది సూపర్ పీస్‌ఫుల్ ప్లేస్.
ఒక అద్భుతమైన పర్యాటక ప్రదేశం. ఈ ప్రాంతం తన సహజ సౌందర్యం, హరిత విశాలతలు, మంచుతో కప్పబడిన హిమాలయ పర్వతాలు, గొలుసు కట్టినట్లున్న చెట్లు, పచ్చని పొలాలతో సందర్శకులను ఆకర్షిస్తుంది. దూద్‌పత్రి శ్రీనగర్ నుండి సుమారు 42 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ లోయలో ప్రవహించే షలిగంగ నది దూద్‌పత్రికి ప్రత్యేక ఆకర్షణను ఇస్తుంది.
వేసవి, వసంత ఋతువుల్లో దూద్‌పత్రి అనేక రకాల వన్య పుష్పాలతో నిండి ఉంటుంది. ఈ రంగురంగుల పుష్పాలు లోయను ఒక సహజ ఉద్యానవనంగా మార్చుతాయి, ఇది ఫోటోగ్రాఫర్లకు, ప్రకృతి ప్రేమికులకు స్వర్గంలా అనిపిస్తుంది.
ఎందుకు దూద్‌పత్రి వెళ్లాలి?
దూద్‌పత్రి మెత్తటి పచ్చిక మైదానాలు, చల్లటి గాలితో నేచర్ లవర్స్‌కి పర్ఫెక్ట్. అందమైన వ్యూస్, స్వచ్ఛమైన చెరువులు, ఫ్రెష్ ఎయిర్ ఎంజాయ్ చేయొచ్చు. ఫ్యామిలీ లేదా ఫ్రెండ్స్‌తో పిక్నిక్, ఫోటోగ్రఫీ, ఫన్ టైమ్ స్పెండ్ చేయడానికి బెస్ట్ స్పాట్. వింటర్‌లో మంచుతో కవర్ అయిపోతుంది. స్కీయింగ్, స్నో బైకింగ్ లాంటి అడ్వెంచర్ యాక్టివిటీస్‌కి సూపర్ ఆప్షన్.
టూరిజంలో కొత్త డెవలప్‌మెంట్స్
జమ్మూ కాశ్మీర్ టూరిజం డిపార్ట్‌మెంట్ దూద్‌పత్రిని ఇంకా ఫేమస్ చేయడానికి ఫుల్ ట్రై చేస్తోంది. ATV రైడ్స్, స్నో స్పోర్ట్స్ లాంటివి స్టార్ట్ చేశారు. ఇండియన్ ఆర్మీ నిర్వహించే దూద్‌పత్రి ఫెస్టివల్ లాంటి ఈవెంట్స్ ఈ ఏరియా బ్యూటీ, హాస్పిటాలిటీని షోకేస్ చేస్తున్నాయి. ఇవి బోలెడు టూరిస్టులను ఆకర్షిస్తున్నాయి.
ఎలా వెళ్లాలి?
శ్రీనగర్ నుంచి దూద్‌పత్రికి కార్ లేదా టాక్సీలో ఒక గంటలో చేరొచ్చు. బుద్గాం గ్రామీణ ఏరియాల గుండా వెళ్లే ఈ ట్రిప్ చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. లోకల్ గైడ్స్, హోంస్టేలు మీ ట్రిప్‌ని కంఫర్టబుల్, మర్చిపోలేనిదిగా మారుస్తాయి.
ఎప్పుడు వెళ్లాలి?
సమ్మర్: పచ్చటి మైదానాల కోసం ఏప్రిల్-జూన్ వెళ్లడం మంచిది.
వింటర్: స్నో యాక్టివిటీస్ ఎంజాయ్ చేయాలనుకునే వారు డిసెంబర్-ఫిబ్రవరి నెలల్లో వెళ్లొచ్చు. వింటర్‌లో వార్మ్ క్లోత్స్, కంఫర్టబుల్ షూస్, బ్యూటిఫుల్ వ్యూస్ కోసం కెమెరా వంటివి వెంట తీసుకెళ్లడం మంచిది.
జాగ్రత్తలు:
లోకల్ రూల్స్ ఫాలో అవ్వాలి, ట్రిప్‌కి ముందు వెదర్ ఇన్ఫర్మేషన్ చెక్ చేయాలి. దూద్‌పత్రి ఓ హిడెన్ ట్రెజర్ లాంటి ప్లేస్. దీని నేచురల్ బ్యూటీ, ఇంప్రూవ్ అవుతున్న టూరిస్ట్ ఫెసిలిటీస్‌తో రిలాక్సేషన్ కోసం పర్ఫెక్ట్ డెస్టినేషన్.