BigTV English
Advertisement

OTT Movie : యాంకర్ శ్రీముఖి హీరోయిన్ గా నటించిన ఒకే ఒక్క సినిమా ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

OTT Movie : యాంకర్ శ్రీముఖి హీరోయిన్ గా నటించిన ఒకే ఒక్క సినిమా ఏ ఓటీటీలో ఉందో తెలుసా?

OTT Movie : యాంకర్ గా కోట్లాది మంది తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న శ్రీముఖి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆమె హీరోయిన్ గా నటించిన ఒకే ఒక్క సినిమా ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం పదండి.


శ్రీముఖి హీరోయిన్ గా నటించిన ఫస్ట్ మూవీ

శ్రీముఖి 2013 లో వచ్చిన ‘ప్రేమ ఇష్క్ కాదల్’ (Prema Ishq Kaadhal) అనే తెలుగు రొమాంటిక్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. దీనికి పవన్ సాదినేని దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ మూవీని యూట్యూబ్ (Youtube) లో ఫ్రీగానే చూడవచ్చు. ఇక ఈ మూవీ స్టోరీలోకి వెళ్తే… అర్జున్ ఒక FM రేడియోలో జాకీగా పని చేస్తుంటాడు. ఇతను ప్లే బాయ్ లా లైఫ్ ని గడుపుతుంటాడు. ఒకరోజు శాంతి (శ్రీముఖి) అనే అమ్మాయిని చూస్తాడు. ఆమె అందానికి పిచ్చెక్కి, తనని ఎలాగైనా పొందాలని అనుకుంటాడు. ఆమెతో పరిచయం పెంచుకుని, సమయం గడుపుతుంటాడు. కానీ శాంతి తన కెరీర్ కోసం బాస్‌తో క్లోజ్ గా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటుంది. ఒక పార్టీలో శాంతి తన బాస్ తో మధ్యపానం సేవించి సన్నిహితంగా గడుపుతుంది. ఈ విషయం అర్జున్ కి తెలిసిపోతుంది.


అయితే శాంతి దాన్ని కేవలం ప్రమోషన్ కోసం చేశానని సర్దిచెప్పుకుంటుంది. అర్జున్‌ ను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంది. నిజానికి అర్జున్ తన ప్లేబాయ్ ఇమేజ్‌ ను పక్కన పెట్టి, ఆమెపై నిజమైన ప్రేమను పెంచుకుంటాడు. చివరికి అర్జున్ ని శాంతి ప్రేమిస్తుందా ? లేదంటే తన కోసం తాను బతుకుతుందా ? అనేది ఈ సినిమాను చూసి తెలుసుకోండి. ఈ సినిమాలో ఇంకా రెండు వేరు వేరు స్టోరీలు ఉంటాయి. అవి కూడా మంచి రొమాంటిక్ ఎంటర్టైనర్లే. ఇక ఈ మూవీ తరువాత శ్రీముఖి పలు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. అలాగే గెస్ట్ రోల్స్ కూడా పోషించింది. ప్రస్తుతం అడపా దడపా సినిమాల్లో నటిస్తూనే, యాంకరింగ్ తో దుమ్మురేపుతోంది శ్రీముఖి.  మరి ఆమె నటించిన సినిమాలు ఏంటి? అవి ఇప్పుడు ఏ ఓటీటీల్లో స్ట్రీమింగ్ అవుతున్నాయో ఓ లుక్కేద్దాం పదండి.

శ్రీముఖి నటించిన సినిమాలు – వాటి ఓటీటీలు
1. జులాయి – అమెజాన్ ప్రైమ్ వీడియో
2. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ – హాట్‌స్టార్
3. బాబు బాగా బిజీ – ప్రైమ్ వీడియో
4. నేను శైలజ – సన్ నెక్స్ట్
5. క్రేజీ అంకుల్స్ – ఆహా
6. మాస్ట్రో – హాట్ స్టార్
7. భోళా శంకర్ – నెట్ ఫ్లిక్స్

Read Also : ఈ మూవీ చూశాక మాల్ లో పొరపాటున కూడా డ్రెస్ ట్రయల్స్ వేయరు… ట్విస్ట్ లతో అదిరిపోయే మలయాళ క్రైమ్ థ్రిల్లర్

Tags

Related News

Dude OTT: ‘డ్యూడ్’ ఓటీటీ డేట్ లాక్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

OTT Movies: 3 రోజుల వ్యవధిలో 4 చిత్రాలు స్ట్రీమింగ్..ముందు ఏది చూడాలి?

OTT Movie : న్యూయార్క్ నగర మేయర్‌గా ఇండియన్ ఫిలిం మేకర్ తనయుడు… మీరా నాయర్ సినిమాలు ఏ ఓటీటీలో ఉన్నాయంటే ?

OTT Movie : పెళ్ళికి రెడీ అవుతూ ప్రియుడితో… మీరా నాయర్ ఫ్యాన్స్ మిస్ అవ్వకుండా చూడాల్సిన ప్రేమ కావ్యం

OTT Movie : అద్దెకొచ్చిన వాళ్ళతో ఆ పాడు పని… గ్రిప్పింగ్ థ్రిల్లర్, ఊహించని టర్నులు ఉన్న సైకలాజికల్ థ్రిల్లర్

OTT Movie : పక్కింటోళ్ల రొమాన్స్‌ను పనులు పక్కన పెట్టి చూసే సైకో… థ్రిల్లింగ్ సీరియల్ కిల్లర్ స్టోరీ

OTT Movie : మిస్సింగ్ అమ్మాయిల కోసం మాజీ సైనికుడి వేట… మైండ్ బ్లోయింగ్ థ్రిల్లర్

OTT Movie : యాక్సిడెంట్ తరువాత కళ్ళు తెరిచి చూస్తే బంకర్‌లో… కన్నింగ్ గాడి ట్రాప్‌లో… స్పైన్ చిల్లింగ్ సర్వైవల్ థ్రిల్లర్

Big Stories

×