NAL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది సువర్ణవకాశం. సీఎస్ఐఆర్- నేషనల్ ఏరోస్పేస్ లాబొరెటరీస్ (ఎన్ఏఎల్) లో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న వారు వెంటనే ళఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం కూడా ఉంటుంది. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హతలు, ముఖ్యమైన తేదీలు, వయస్సు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, తదితర వివరాల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
బెంగళూరులోని సీఎస్ఐఆర్ – నేషనల్ ఏరోస్పేస్ లాబొరెటరీస్ (ఎన్ఏఎల్) లో ఖాళీగా ఉన్న టెక్నీషియన్ -1 పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. జులై 10న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆ లోగా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలి.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 86
ఇందులో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. టెక్నీషియన్ -1 ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో టెన్త్, ఇంటర్, ఐటీఐ పాసై ఉంటే సరిపోతుంది. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 28 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: సెలెక్ట్ అయిన వారికి మంచి వేతనం ఉంటుంది. నెలకు రూ.19,900 నుంచి రూ.63,200 జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఉద్యోగం సాధించండి.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ఆధారంగా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు ప్రారంభ తేది: జూన్ 6
దరఖాస్తుకు చివరి తేది: జులై 10
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500 ఫీజు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు, మహిళా అభ్యర్థులకు ఎలాంటి ఫీజు లేదు.
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ట్రేడ్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను సందర్శించండి.
అఫీషియల్ వెబ్ సైట్: https://nal.res.in/
నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 86
దరఖాస్తుకు చివరి తేది: జులై 10
ALSO READ: MTS JOBS: పదితో భారీగా మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే రూ.56వేల జీతం