OTT Movie : రోబోలు ఒక మనిషిని రీప్లేస్ చేయగలవా? అంటే ఇప్పటికైతే సమాధానం కష్టమే. అయితే ఇలాంటి ఫ్యాంటసీ సినిమాలలో అయితే తీరుతుంది. అలాంటి ఓ ఇంట్రెస్టింగ్ మలయాళ మూవీ గురించి ఈరోజు తెలుసుకుందాం. ఇందులో ఏకంగా ఓ వృద్ధుడు తన కొడుకు ప్లేస్ లో రోబోను తెచ్చుకుంటాడు. ఇందులో గ్రిప్పింగ్ స్టోరీతో పాటు హృదయానికి హత్తుకునే ఎమోషనల్ సీన్స్ కూడా ఉంటాయి. మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందో తెలుసుకుందాం.
ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్
ఈ మూవీ పేరు “Android Kattappa”. 2019లో విడుదలైన మలయాళ చిత్రం “Android Kunjappan Version 5.25” తెలుగు డబ్బింగ్ వెర్షన్. ఈ చిత్రం రతీష్ బాలకృష్ణన్ పొడువల్ దర్శకత్వంలో సంతోష్ టి. కురువిల్లా నిర్మించిన సైన్స్-ఫిక్షన్ కామెడీ-డ్రామా. సూరజ్ వెంజరమూడు (భాస్కరన్), సౌబిన్ షాహిర్ (సుబ్రమణ్యం), కెండి జిర్డో (హిటోమి), సూరజ్ థెలక్కడ్ (కుంజప్పన్ రోబోట్) ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం ఒక వృద్ధుడు, అతని కొడుకు మధ్య సంబంధాన్ని, అలాగే ఒక AI హ్యూమనాయిడ్ రోబోట్ ద్వారా వచ్చే హార్ట్ టచింగ్ ట్విస్ట్ తో ఆకట్టుకుంటుంది. తెలుగులో Aha OTT ప్లాట్‌ఫారమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది.
కథలోకి వెళ్తే…
కథ కేరళలోని పయ్యనూర్ అనే గ్రామంలో జరుగుతుంది. భాస్కరన్ పొడువల్ (సూరజ్ వెంజరమూడు), ఒక సంప్రదాయవాది, సాంకేతికతను అసహ్యించుకునే వృద్ధుడు. తన కొడుకు సుబ్రమణ్యం (సౌబిన్ షాహిర్)తో కలిసి నివసిస్తాడు. సుబ్రమణ్యం, ఒక మెకానికల్ ఇంజనీర్, రష్యాలో ఉద్యోగ అవకాశాల కోసం చూస్తాడు. కానీ భాస్కరన్ తన చివరి రోజుల్లో కొడుకు తనతోనే ఉండాలని కోరుకుంటాడు. భాస్కరన్ స్నేహితుడు కుంజప్పన్ బలి (చావు ఆచారం) సన్నివేశంతో సినిమా ప్రారంభమవుతుంది. భాస్కరన్ టీవీ, ఫోన్‌లు కూడా వాడడు. పైగా కొడుకుతో కఠినంగా ఉంటాడు.
Read Also : అర్దరాత్రి డోర్ వెనకుండి దాగుడు మూతలాడే దెయ్యం… ఈ హర్రర్ మూవీని చూశాక నిద్ర పట్టడం కష్టమే
సుబ్రమణ్యం, తన కెరీర్ కోసం రష్యాకు వెళ్లే అవకాశం వస్తుంది. కానీ తండ్రిని ఒంటరిగా వదిలి వెళ్ళాలా అని ఆందోళన చెందుతాడు. భాస్కరన్ కఠినమైన స్వభావం వల్ల ఇంట్లో పని మనిషిని ఉంచడం కూడా కష్టమవుతుంది. ఈ సమస్యను పరిష్కరించడానికి, సుబ్రమణ్యం రష్యా నుండి ఒక AI హ్యూమనాయిడ్ రోబోట్ (వెర్షన్ 5.25) తీసుకొస్తాడు. దానిని తండ్రి సంరక్షణ కోసం ఉపయోగించాలని నిర్ణయిస్తాడు. ఈ రోబోట్‌ను గ్రామస్తులు గందరగోళంలో “కుంజప్పన్” అని పిలుస్తారు. మొదట భాస్కరన్ ఈ రోబోట్‌ను చూసి భయపడతాడు, దానిని తిరస్కరిస్తాడు. “డబ్బా” అని పిలుస్తూ దాన్ని అసహ్యించుకుంటాడు. అయితే అవేమీ పట్టించుకోకుండా కుంజప్పన్ రోబోట్ భాస్కరన్ రొటీన్ అవసరాలను (వంట, మాట్లాడడం) చూసుకోవడం ప్రారంభిస్తుంది. క్రమంగా భాస్కరన్ దానితో అనుబంధం ఏర్పరచుకుంటాడు. అలాగే అతనికి గతంలో ఉన్న లవర్ ను కలవడంలో కూడా ఉపయోగపడుతుంది. అయితే ఓసారి భాస్కరన్ కాలు విరుగుతుంది. ఆ టైమ్ లో రోబో ఎలా స్పందించింది? చివరికి రోబో తిరిగి వెళ్లిపోవల్సి వచ్చినప్పుడు ఏం జరిగింది ? అన్న విషయాలను తెరపై చూసి తెలుసుకోవాల్సిందే.