Indian Railway: భారతీయ రైల్వేను రానున్న దశాబ్ద కాలంలో ప్రపంచంలోనే అగ్రగామిగా నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఐదు సంవత్సరాలలో 1,000 కొత్త రైళ్లను ప్రవేశపెట్టాలని భావిస్తున్నట్లు వెల్లడించారు. 2027 నాటికి బుల్లెట్ రైలు సేవలను ప్రారంభించబోతున్నట్లు తెలిపారు. ప్రభుత్వ సామర్థ్యాన్ని పెంచడం, ఖర్చులను తగ్గించడం, ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచడం, మౌలిక సదుపాయాలు, తయారీలో భారీగా పెట్టుబడి పెట్టడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వైష్ణవ్ తెలిపారు.
11 ఏళ్లలో 35 వేల కి.మీ ట్రాక్స్ నిర్మాణం
భారత్ గత 11 సంవత్సరాలలో 35,000 కి.మీ ట్రాక్‌లను నిర్మించినట్లు అశ్విని వైష్ణవ్ తెలిపారు. ఇది జర్మనీ మొత్తం నెట్‌వర్క్ పరిమాణానికి సమానం అన్నారు. ఒక్క సంవత్సరంలోనే 5,300 కి.మీ రైల్వే ట్రాక్స్ నిర్మించినట్లు తెలిపారు. ఏటా 30,000 వ్యాగన్లు, 1,500 లోకోమోటివ్‌లు తయారు చేస్తున్నట్లు తెలిపారు. ఇది ఉత్తర అమెరికా, యూరప్ సంయుక్త ఉత్పత్తి కంటే ఎక్కువ అన్నారు. రైల్వేలలో పెట్టుబడి రూ. 25,000 కోట్ల నుంచి రూ. 2.52 లక్షల కోట్లకు పెరిగిందన్నారు. PPPల నుంచి అదనంగా రూ. 20,000 కోట్లు వచ్చినట్లు వెల్లడించారు.
తక్కువ ధరలో సరుకు రవాణా
అటు లాజిస్టిక్స్ అనేది రైల్వేశాఖ పరివర్తనాత్మక మార్పును సూచిస్తున్నట్లు తెలిపారు. రైల్వే.. హైవేలతో పోలిస్తే టన్ను-కి.మీ.కు సగం కంటే తక్కువ ఖర్చుతో సరుకు రవాణాను అందిస్తున్నాయన్నారు. 95% పర్యావరణ అనుకూలమైనవి రవాణా సాధ్యం అవుతుందన్నారు. గత దశాబ్దంలో కార్గో హ్యాండ్లింగ్ లో రైల్వే వాటా 26% నుంచి 29%కి పెరిగిందనన్నారు. రానున్న రోజుల్లో 35%కి పెంచాలనే లక్ష్యంతో రైల్వే పని చేస్తుందన్నారు.
2027 నాటికి బుల్లెట్ రైలు సేవలు
ఇండియన్ హైస్పీడ్ రైల్వే ప్రాజెక్టు అయిన బుల్లెట్ రైలు ప్రాజెక్ట్.. జపాన్ సహకారంతో శరవేగంగా నిర్మాణం జరుపుకుంటుందన్నారు. ఫస్ట్ మోడల్ 2026లో అందుబాటులోకి రానునన్నట్లు తెలిపారు. 2027 నాటికి ప్రజలకు అందుబాటులోకి వస్తుందన్నారు.
Read Also: తత్కాల్ తస్కరణ.. రైల్వేని బోల్తా కొట్టిస్తున్న ఏజెంట్లు, ఇదిగో ఇలా స్కామ్ చేస్తున్నారు!
2 ఏళ్లలో 2 వేల జనరల్ కోచ్ లు
ప్రయాణీకుల అనుభవాన్ని మెరుగుపరచడానికి, ప్రభుత్వం గత రెండు సంవత్సరాలలో 2,000 జనరల్ కోచ్‌లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు వైష్ణవ్ తెలిపారు. అమృత్ భారత్, నమో భారత్ వంటి రైళ్లను ప్రారంభించిందన్నారు. అదే సమయంలో రైల్వే ప్రయాణాన్ని మరింత చౌకగా మార్చుతున్నట్లు తెలిపారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే ఛార్జీలు తక్కువగా ఉన్నాయన్నారు. గత దశాబ్దంలో మొత్తం రైలు ప్రమాదాలు 80% తగ్గాయని వైష్ణవ్ తెలిపారు. భారత్ తన కోసం రైల్వే కోచ్ లు, లోకో మోటివ్ లను నిర్మించుకోవడమే కాకుండా, రైల్వే రంగంలో కీలకమైన ప్రపంచ సరఫరాదారుగా మారే అవకాశం ఉందన్నారు.
Read Also: సైకిల్ పై ప్రపంచ యాత్ర చేస్తుంటే కిడ్నాప్.. ఇతడు చెప్పింది చదివితే చెమటలు పడతాయ్!