E-Paper
Advertisement

NMDC Jobs: డిగ్రీ అర్హతతో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇంకా 4 రోజులే, రూ.లక్షల్లో జీతాలు

NMDC Jobs: డిగ్రీ అర్హతతో భారీ ఉద్యోగాలకు నోటిఫికేషన్.. ఇంకా 4 రోజులే, రూ.లక్షల్లో జీతాలు

NMDC STEEL LIMITED Recruitment: నిరుద్యోగులకు ఇది బంపర్ ఆఫర్ న్యూస్. ఐటీఐ, డిగ్రీ, బీఈ, బీటెక్, డిప్లొమా, పీజీ, సీఏ, ఎంఏ, ఎంబీఏ, పీజీడీఎంలో పాసైన అభ్యర్థులకు ఇది శుభవార్త. నేషనల్ మినరల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఎన్ఎండీసీ స్టీల్ లిమిటెడ్) లో పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. అర్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగంలో సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోండి.

నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(NMDC STEEL LIMITED), ఛత్తీస్ గఢ్ లో కాంట్రాక్ట్ విధానంలో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న సీఈ పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు దరఖాస్తు చేసుకోండి. మే 8 న దరఖాస్తు గడువు ముగియనుంది. ఆలోగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి.

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 934

నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌(NMDC STEEL LIMITED), ఛత్తీస్ గఢ్ లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో సీఈ (కాంట్రాక్ట్ ఎంప్లాయ్) ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి.

పోస్టులు – వెకెన్సీలు:

సీఈ (కాంట్రాక్ట్ ఎంప్లాయ్) : 934 ఉద్యోగాలు

దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 24

దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 8

విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్‌, బీఈ, డిప్లొమా, ఐటీఐ, పీజీ, సీఏ, ఎంఏ, ఎంబీఏ/పీజీడీఎం పాసై ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.

వయస్సు: 50 ఏళ్ల మించరాదు. రూల్స్ ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులకు పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.

ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఇంటర్వ్యూ ఆధారంగా ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

జీతం: పోస్టులను బట్టి శాలరీని నిర్ణయించారు. పోస్ట్‌ కోడ్‌ సీఈ-2 నుంచి సీఈ-10 వరకు ఉద్యోగాలున్నాయి. నెలకు రూ.40,000 నుంచి రూ.1,70,000 వరకు జీతం ఉంటుంది.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

అఫీషియల్ వెబ్ సైట్: https://nmdcsteel.nmdc.co.in

అర్హత ఉన్న అభ్యర్థులు వెంటనే ఈ జాబ్స్ కు అప్లై చేసుకోండి. మంచి వేతనం కూడా ఉంటుంది. నెలకు ఉద్యోగాన్ని బట్టి రూ.40,000 నుంచి రూ.1,70,000 వరకు జీతం ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం. వెంటనే జాబ్స్ కి అప్లికేషన్ పెట్టుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.

Also Read: Planning Department: ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీలు.. నెలకు రూ.60,000 జీతం.. ఇదే మంచి అవకాశం..

నోటిఫికేషన్ ముఖ్య సమాచారం:

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 934

దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 8

Related News

టాప్ కంపెనీల్లో ప్లేస్‌మెంట్స్.. ICFAI హైదరాబాద్ 2026 అడ్మిషన్ల నోటిఫికేషన్ విడుదల

NEET Exam: నీట్ రీఎగ్జామ్ వ్యవహారం.. సుప్రీంకోర్టు కీలక తీర్పు

సీబీఎస్ఈ ఇంటర్‌లో ఆన్-స్క్రీన్ మార్కింగ్ వివాదం.. ఆ బాధ్యత నాదే-మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

సీబీఎస్ఈ ఇంటర్ రీవాల్యుయేషన్‌.. 4 లక్షల మంది విద్యార్థులు అప్లై.. ఒకరి పేపర్లు మరొకరి, పేరెంట్స్ షాక్

ఇంటర్ విద్యార్థులకు అదిరిపోయే బ్రేక్‌ఫాస్ట్.. ఇడ్లీ మొదలు, జూన్ 12 నుంచి అమలు

AP EDCET 2026 Result: ఏపీ ఎడ్‌సెట్‌-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత, వారికి మంత్రి అభినందనలు

తెలంగాణలో ఎప్‌సెట్‌ ఫలితాలు-2026, కేవలం వారం రోజుల్లో, టాపర్స్ వీళ్లే

ఐఐటీ చేరేందుకు మరో పరీక్ష.. జేఈఈ అడ్వాన్సుడ్ నేడు, కొత్త మార్గదర్శకాలు

Big Stories

×