Mount Abu Tour: రాజస్థాన్‌లోని వేడి ఎడారి ప్రాంతాల మధ్య ఉన్న మౌంట్ అబు ఒక ప్రత్యేకమైన హిల్ స్టేషన్. ఇది రాజస్థాన్ రాష్ట్రంలోని ఏకైక హిల్ స్టేషన్. ఆరావళి పర్వత శ్రేణి ఒడిలో ఉన్న ఈ నగరం మే నెలలో వేడి నుండి ఉపశమనం పొందడానికి ఒక అద్భుతమైన ఎంపిక. సమ్మర్ లోనూ ఇక్కడ వాతావరణం ఆహ్లాదకరంగా, చల్లగా ఉంటుంది. ముఖ్యంగా నార్త్ ఇండియా నుండి వచ్చే పర్యాటకులు ఇక్కడి పచ్చదనం, ప్రశాంతమైన వాతావరణం, సాంస్కృతిక ప్రదేశాలకు ఆకర్షితులవుతారు.
మౌంట్ అబూ చల్లని వాతావరణానికి ప్రసిద్ధి చెందింది. దీని మతపరమైన, సహజ, చారిత్రక ప్రదేశాలు కూడా ప్రజలను ఆకర్షిస్తాయి. మీరు ప్రకృతి ప్రేమికులైనా లేదా మతపరమైన యాత్ర చేయాలనుకున్నా.. మౌంట్ అబూలో ప్రతి ఒక్కరికీ ఏదో ప్రాంతం నచ్చుతుంది. ఇక్కడి సరస్సులు, దేవాలయాలు, వన్యప్రాణులు చిరస్మరణీయ ప్రయాణ అనుభవాన్ని మీకు అందిస్తాయి. మౌంట్ అబూలోని తప్పకుండా చూడాల్సిన ప్రధాన పర్యాటక ప్రదేశాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
మౌంట్ అబూలోని 6 ప్రధాన పర్యాటక ప్రదేశాలు:
నక్కీ సరస్సు:
మౌంట్ అబూలో అత్యంత ప్రసిద్ధ ఆకర్షణమై సరస్సు నక్కీ . ఇది పర్వతాలు, పచ్చదనంతో ఉన్న మానవ నిర్మిత సరస్సు. ఇక్కడ బోటింగ్ కూడా ఉంటుంది. అంతే కాకుండా ఈ సరస్సు ఒడ్డున నిర్మించిన మార్కెట్లో షాపింగ్ కూడా ఆనందించవచ్చు. ఇక్కడ ఈవినింగ్ సమయం చాలా మనోహరంగా ఉంటుంది.
దిల్వారా జైన దేవాలయాలు:
ఈ దేవాలయాలు అద్భుతమైన పాలరాయి శిల్పాలు, వాస్తుశిల్పానికి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. 11వ, 13వ శతాబ్దాల మధ్య నిర్మించబడిన ఈ జైన దేవాలయాలు భక్తులతో పాటు చరిత్ర ప్రియులను కూడా ఆకర్షిస్తాయి.
గురు శిఖర్:
ఇది మౌంట్ అబూ యొక్క ఎత్తైన శిఖరం. ఇక్కడ నుండి సిటీ మొత్తాన్ని చూడవచ్చు. ఇక్కడ ఉన్న గురు దత్తాత్రేయ ఆలయం మతపరమైన ప్రాముఖ్యతను కలిగి ఉంది. ట్రెక్కింగ్ ప్రియులకు ఇది బెస్ట్ ప్లేట్.
హనీమూన్ పాయింట్, సన్ సెట్ పాయింట్:
ఈ రెండు ప్లేస్‌లు ఫోటోగ్రఫీకి చాలా ప్రసిద్ధి చెందాయి. సాయంత్రం సూర్యాస్తమయం కూడా ఇక్కడ చాలా బాగుంటుంది.
Also Read: మన దేశంలోనే మినీ స్విట్జర్లాండ్, కట్టిపడేసే ప్రకృతి అందాలు
అచల్‌గఢ్ కోట:
ఈ చారిత్రాత్మక కోట 14వ శతాబ్దంలో నిర్మించబడింది. ఇక్కడి నుండి చుట్టుపక్కల ఉన్న కొండల అద్భుతమైన దృశ్యాన్ని చూడొచ్చు. అచలేశ్వర్ మహాదేవ్ ఆలయం కూడా దీనికి సమీపంలోనే ఉంది.
మౌంట్ అబు వన్యప్రాణుల అభయారణ్యం:
ఈ అభయారణ్యం వన్యప్రాణుల ఔత్సాహికులకు ఉత్కంఠభరితమైన అనుభవాన్ని అందిస్తుంది. ఇక్కడ వివిధ రకాల జంతువులు, పక్షులు, అరుదైన మొక్కలను మీరు చూడవచ్చు. జంగిల్ సఫారీని కూడా ఆస్వాదించవచ్చు.