OTT Movie : కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు, జీవితం కళ్ళ ముందు కనపడుతున్నట్లు ఉంటుంది. ఈ రోజుల్లో కుటుంబ సంబంధాలు ఎలా ఉన్నాయి అనేది ఈ సినిమాలో చూపించారు. వృద్ధాప్యంలో ఉన్న ఒక తండ్రిని, కొడుకులు ఎలా అడ్డు తొలగించుకున్నారనేది తెలిస్తే రక్తం మరిగిపోతుంది. నిజ జీవితాల్లో ఇటువంటివి చాలానే జరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో కుటుంభ సభ్యుల కంటే, ఒక అనామకున్ని గొప్పగా చూపించారు. ఇందులో నానా పటేకర్ తన నటనతో కంటతడి పెట్టించాడు. ఈ సినిమా కొందరికైనా కనువిప్పు కలిగిస్తుందని ఆశిద్దాం. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
స్టోరీలోకి వెళితే
దీపక్ త్యాగి (నానా పటేకర్) అనే వృద్ధుడు మతిమరుపుతో బాధపడుతూ ఉంటాడు. తన భార్య విమల చనిపోవడంతో ఒంటరిగా జీవిస్తుంటాడు. దీపక్ తన ముగ్గురు కొడుకులు, వారి భార్యలు, మనవళ్లతో కలిసి షిమ్లాలో నివసిస్తాడు. అతను తన భార్యతో గడిపిన మధుర జ్ఞాపకాలను తరచూ గుర్తు చేసుకుంటాడు. కానీ అతని మతిమరుపు కారణంగా కుటుంబ సభ్యులతో తరచూ గొడవలు ఏర్పడతాయి. దీపక్ తన బంగళాను తన భార్య పేరిట ట్రస్టుగా మార్చాలని నిర్ణయించడంతో, అతని కొడుకులు ఆస్తి కోసం కుట్ర పన్నుతారు. అతన్ని వారణాసిలో విడిచిపెట్టాలని పథకం వేస్తారు. దీపక్‌ను అతని కొడుకులు అతని గుర్తింపు పత్రాలు లేకుండా, మెమరీ మాత్రలు లేకుండా వారణాసిలో వదిలేస్తారు. వారు షిమ్లాకు తిరిగి వచ్చి, దీపక్ గంగానదిలో మునిగిపోయాడని అందరికీ చెప్పి నమ్మిస్తారు.
మరోవైపు ఒంటరిగా, అయోమయంలో ఉన్న దీపక్‌కు, వీరూ అనే ఒక చిన్న దొంగతో పరిచయం ఏర్పడుతుంది. వీరూ, తన శక్తికి మించి దీపక్‌కు సహాయం చేస్తాడు. ఈ అనుకోని స్నేహం దీపక్, వీరూ జీవితాలను మార్చివేస్తుంది, అలాగే వారి చుట్టూ ఉన్నవారి జీవితాలను కూడా ప్రభావితం చేస్తుంది. చివరికి దీపక్ తన కుటుంభ సభ్యులను కలుస్తాడా ? వీరూతో కలసి జీవిస్తాడా ? చివరి రోజుల్లో దీపక్ ఎటువంటి నిర్ణయం తీసుకుంటాడు ? ఈ విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే, ఈ సినిమాను మిస్ కాకుండా చూడండి.
Read Also : భర్తలో దొరకంది ప్రియుడిలో దొరికింది… ఈ తీరని దాహానికి ఆ బో*ల్డ్ సీన్స్ సాక్ష్యం… సింగిల్స్ లో సెగ పెంచే మూవీ
(Zee 5) లో
ఈ ఫ్యామిలీ డ్రామా మూవీ పేరు ‘వనవాస్’ (Vanvaas). 2024 లో వచ్చిన ఈ సినిమాకు అనిల్ శర్మ దర్శకత్వం వహించారు. ఇందులో నానా పటేకర్ ప్రధాన పాత్రలో నటించగా, ఉత్కర్ష్ శర్మ, రాజ్‌పాల్ యాదవ్, సిమ్రత్ కౌర్, ఖుష్బూ సుందర్, అశ్వినీ కల్సేకర్ తదితరులు సహాయక పాత్రల్లో నటించారు. ఈ సినిమా స్టోరీ దీపక్ త్యాగి అనే వృద్ధుడి చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా 2024 డిసెంబర్ 20న థియేటర్లలో విడుదలైంది. 2025 మార్చి 14 నుంచి జీ 5 (Zee 5) లో అందుబాటులో ఉంది.