BEML Limited: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం అని చెప్పవచ్చు. భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ వివిధ యూనిట్లలో ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత ఉన్న వారికి ఇది గోల్డెన్ అపార్చునిటీ అని చెప్పవచ్చు. సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం కూడా ఉంటుంది.. బీఈ, బీటెక్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు. నోటిఫికేషన్ కు సంబంధించిన విద్యార్హత, ఉద్యోగ ఎంపిక విధానం, దరఖాస్తు విధానం, ముఖ్యమైన తేదీలు, జీతం, తదితర విషయాల గురించి క్లియర్ కట్ గా తెలసుకునే ప్రయత్నం చేద్దాం.
భారత రక్షణ మంత్రిత్వ శాఖ పరిధి, ప్రముఖ మల్టీ-టెక్నాలజీ కంపెనీ (BEML Limited) భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్ వివిధ యూనిట్లలో, మార్కెటింగ్ ఆఫీసుల్లో జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులను భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేశారు. పాలక్కాడ్, కేజీఎఫ్, మైసూర్ యూనిట్లు, బెంగళూరు, దిల్లీ, పుణే, హైదరాబాద్ మార్కెటింగ్ ఆఫీసుల్లో ఉద్యోగ ఖాళీలు ఉన్నాయి.
ఇంటర్వ్యూ ద్వారానే ఈ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు. ఆగస్టు 11, 12 తేదీల్లో ఇంటర్వ్యూ ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 94
పోస్టులు – వెకెన్సీలు:
జూనియర్ ఎగ్జిక్యూటివ్ – మెకానికల్: 94 పోస్టులు
పోస్టుల వివరాలు..
జూనియర్ ఎగ్జిక్యూటివ్ – మెకానికల్
పాలక్కాడ్: 38
కేజిఎఫ్: 23
మైసూర్: 13
మార్కెటింగ్ విభాగంలో (బెంగళూరు, దిల్లీ, పుణే, హైదరాబాద్): 5
జూనియర్ ఎగ్జిక్యూటివ్- ఎలక్ట్రికల్
పాలక్కాడ్: 6
మైసూర్: 2
మార్కెటింగ్ విభాగంలో (బెంగళూరు, దిల్లీ, పూణే): 3
జూనియర్ ఎగ్జిక్యూటివ్- మెటలర్జీ
పాలక్కాడ్: 3
కేజిఎఫ్: 2
జూనియర్ ఎగ్జిక్యూటివ్- ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ
పాలక్కాడ్: 1
విద్యార్హత: 60 శాతం మార్కులతో బీఈ, బీటెక్ పాసై ఉంటే సరిపోతుంది. మెకానికల్, ప్రొడక్షన్, ఇండస్ట్రియల్ ఇంజినీరింగ్, మెకాట్రానిక్స్, ఆటోమొబైల్, ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రానిక్స్ & కమ్యూనికేషన్, ఎలక్ట్రికల్ & ఇన్‌స్ట్రుమెంటేషన్, మెటలర్జీ, మెటీరియల్ సైన్స్ & ఇంజినీరింగ్ కంప్యూటర్ సైన్స్ / ఐటీ విభాగాల్లో పాసై ఉండాలి.
వయస్సు: ఇంటర్వ్యూ డేట్స్ నాటికి 29 ఏళ్ల వయస్సు మించరాదు. నిబంధనల ప్రకారం వయస్సు సడలింపు ఉంటుంది. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. దివ్యాంగ అభ్యర్థులక పదేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది.
జీతం: సెలెక్ట్ అయిన అభ్యర్థులకు మంచి వేతనం ఉంటుంది. నెలకు మొదటి సంవత్సరం రూ.35,000; రెండో సంవత్సరం రూ.37,500, మూడో ఏడాది రూ.40,000; 4వ ఏడాది రూ.43,000 జీతం ఉంటుంది.
ఉద్యోగ ఎంపిక విధానం: ఇంటర్వ్యూ బేస్ చేసుకుని ఉద్యోగానికి ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు చివరి తేది: 2025 ఆగస్టు 9
ఇంటర్వ్యూ డేట్స్: ఫ్రెషర్స్ కు ఆగస్టు 11న, ఎక్స్ పీరియన్స్ అభ్యర్థులకు ఆగస్టు 12న ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు.
నోటిఫికేషన్ కు సంబంధించి ఎలాంటి సందేహాలున్నా అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://recruitment.bemlindia.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు.. వెంటనే ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోండి. మంచి వేతనం ఉంటుంది. నెలకు మొదటి సంవత్సరం రూ.35,000; రెండో సంవత్సరం రూ.37,500, మూడో ఏడాది రూ.40,000; 4వ ఏడాది రూ.43,000 జీతం ఉంటుంది. ఆలస్యం చేయకుండా వెంటనే అప్లై చేసుకోండి. ఉద్యోగం సాధించండి. ఆల్ ది బెస్ట్.
ఉద్యోగ ఎంపిక విధానం:
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 94
దరఖాస్తుకు చివరి తేది: ఆగస్టు 9
ఇంటర్వ్యూ డేట్స్: ఆగస్టు 11, 12
ALSO READ: OICL Recruitment: ఇంటర్ పాసైతే ఎనఫ్.. చాలా తక్కువ పోటీ.. నెలకు రూ.62వేల జీతం