Blind Dating Event: బెంగళూరులో తరచుగా ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంటుంది. కొద్ది రోజు క్రితం ఐపీఎల్ ఈవెంట్ లో తొక్కిసలాట జరిగి పలువురు చనిపోడంతో వార్తల్లో నిలిచింది. తాజాగా ఆన్ లైన్ ప్లాట్ ఫామ్ BookMyShow పుణ్యమా అని కొత్త వివాదం మొదలయ్యింది. నగరంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన ప్రదేశాలలో ఒకటైన ఐకానిక్ కబ్బన్ పార్క్ ఇప్పుడు ఊహించని వివాదానికి కేంద్రంగా మారింది.
ఇంతకీ అసలు వివాదం ఏంటంటే?
ప్రముఖ టికెటింగ్ ప్లాట్ ఫామ్ అయిన BookMyShow, కబ్బన్ పార్క్ లో ‘బ్లైండ్ డేట్’ ఈవెంట్ ను నిర్వహించనున్నట్లు ప్రకటించింది. “నిజమైన సంబంధాలు అర్థవంతమైన సంభాషనలు, నవ్వులతో ప్రారంభమవుతాయయి.’సరదా, విశ్రాంతి కార్యక్రమంలో పాల్గొనండి” అంటూ BookMyShow ప్రకటించింది. ఈ ఈవెంట్ లో పాల్గొనే వారు రూ. 199 చెల్లించాల్సి ఉంటుంది. 2 గంటల పాటు డేటింగ్ స్లాట్‌ను అందిస్తుంది. ఈ ఈవెంట్ లో 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు పాల్గొనవచ్చు. ఈ డేటింగ్ సెషన్‌లు ఆగస్టు 2 నుంచి ఆగస్టు 31 వరకు ప్రతి ఆదివారం షెడ్యూల్ చేయబడతాయని నిర్వాహకులు తెలిపారు. బుకింగ్‌లు అధికారిక BookMyShow వెబ్ సైట్ లో చేసుకునే అవకాశం ఉంటుంది.
ఎంట్రీ ఫీజు రూ. 199 నుంచి ప్రారంభం
BookMyShow నిర్వహించే ‘బ్లైండ్ డేట్’ ఈవెంట్‌లో ప్రవేశ రుసుము రూ.199, రూ.399, రూ.1299 నుంచి రూ.1499 వరకు ఉంటుంది. ప్రతి సెషన్ సాయంత్రం 5:00 గంటలకు ప్రారంభమవుతుంది. 18 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వాళ్లు ఈ ఈవెంట్ లో పాల్గొంటారు. ఇక్కడ అపరిచిత వ్యక్తులను కలిసి వారితో ఫ్రెండ్షిప్ ఏర్పర్చుకునే అవకాశం ఉంటుంది
‘బ్లైండ్ డేటింగ్’ ఈవెంట్ పై తీవ్ర విమర్శలు
అటు కబ్బన్ పార్క్ లో బ్లైండ్ డేటింగ్ నిర్వహిస్తామని BookMyShow ప్రకటించడం పట్ల తీవ్ర వివాదం చెలరేగింది. ప్రజల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఉద్యానవన శాఖ, బ్లైండ్ డేటింగ్ ఈవెంట్ కు అనుమతి ఇవ్వడం లేదని ప్రకటించింది. ఈ విషయంపై పోలీసులకు కూడా ఫిర్యాదు చేసింది. “ఈ విషయం మాకు నిన్న సాయంత్రం తెలిసింది. కబ్బన్ పార్క్ దగ్గర అమ్మాయిలు, అబ్బాయిల మధ్య డేట్ మీట్ అప్ లను నిర్వహించడానికి BookMyShow వాళ్లు ఛార్జీలు ఫిక్స్ చేస్తున్నారు. BookMyShow యాప్‌పై చర్య తీసుకోవాలని మేము పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదును చేశాం” అని ఉద్యానవనశాఖ అధికారులు తెలిపారు.
బెంగళూరులోని గ్రీన్ లంగ్స్ గా పిలిచే కబ్బన్ పార్క్ లో, పిల్లలు, సీనియర్ సిటిజన్లు, మార్నింగ్ వాకర్స్, సాంస్కృతిక సమూహాలు, పాఠకులు, పర్యాటకులకు ఒక చక్కటి గమ్యస్థానంగా కొనసాగుతోంది. BookMyShow ఇప్పుడు ఆ పార్క్ ను డేటింగ్ వేదికగా మార్చాలనే ఆలోచన చేయడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే, ఈ ఈవెంట్ నిర్వహణ ఉంటుందా? లేదా? అనే అంశంపై BookMyShow ఇంకా ఎలాంటి ప్రకటన చేయలేదు.
Read Also: మొదటిసారి శాఖాహారం తిన్న సింహం.. దాని ఎక్స్‌ప్రెషన్ చూస్తే.. గంట నవ్వుతారు!