FSNL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది మంచి అవకాశం. ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్ (ఎఫ్ఎస్ఎన్ఎల్) లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉన్న అభ్యర్థులకు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోండి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు డిగ్రీ, బీటెక్/బీఈ, ఎల్ఎల్‌బీ, డిప్లొమా, సీఏ, ఎంబీఏ/పీజీడీఎం, పీజీ డిప్లొమా, పీజీడీబీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. సెలెక్ట్ అయిన వారికి రూ.లక్షల్లో వేతనాలు ఉన్నాయి. నోటిఫికేషన్ పూర్తి వివరాల గురించి తెలుసుకుందాం.
ఫెర్రో స్క్రాప్ నిగమ్ లిమిటెడ్(FSNL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పలు పోస్టుల భర్తీకి అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి అభ్యర్థులు మే 19వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంటుంది.
మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 44
ఫెర్రో స్ర్రాప్ నిగమ్ లిమిటెడ్ లో పలు విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి. ఆపరేషన్, మెయంటనెన్స్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, మెటీరియల్ మేనేజ్ మెంట్
పోస్టులు – వెకెన్సీలు:
జూనియర్ మేనేజర్(ఈ1)/ అసిస్టెంట్ మేనేజర్(ఈ2): 11
మేనేజర్(ఈ4)/సీనియర్ మేనేజర్(ఈ5): 03
జూనియర్ మేనేజర్(ఈ1)/ అసిస్టెంట్ మేనేజర్(ఈ2): 06
మేనేజర్(ఈ4)/సీనియర్ మేనేజర్(ఈ5): 02
జూనియర్ మేనేజర్(ఈ1): 09
అసిస్టెంట్ మేనేజర్(ఈ2)/ డిప్యూటీ మేనేజర్(ఈ3): 01
మేనేజర్(ఈ4)/ సీనియర్ మేనేజర్(ఈ5): 02
ఎగ్జిక్యూటివ్(ఈ0)/ జూనియర్ మేనేజర్(ఈ1)/ అసిస్టెంట్ మేనేజర్(ఈ2): 07
ఎగ్జిక్యూటివ్(ఈ0)/ జూనియర్ మేనేజర్(ఈ1)/ అసిస్టెంట్ మేనేజర్(ఈ2): 03
Also Read: Court Jobs: నిరుద్యోగులకు భారీ గుడ్‌న్యూస్.. ఏపీలో 1620 ఉద్యోగాలకు నోటిఫికేషన్..
విద్యార్హత: ఉద్యోగాన్ని బట్టి సంబంధిత విభాగంలో డిగ్రీ, బీటెక్/బీఈ, ఎల్ఎల్‌బీ, డిప్లొమా, సీఏ, ఎంబీఏ/పీజీడీఎం, పీజీ డిప్లొమా, పీజీడీబీఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వర్క్ ఎక్స్ పీరియన్స్ ను కూడా పరిగణలోకి తీసుకుంటారు.
వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. 2025 మే 9వ తేదీ నాటికి జూనియర్ మేనేజర్‌కు 30 ఏళ్లు, అసిస్టెంట్ మేనేజర్‌కు 34 ఏళ్లు, మేనేజర్‌కు 42 ఏళ్లు, సీనియర్ మేనేజర్‌కు 46 ఏళ్లు, ఎగ్జిక్యూటివ్‌కు 28 ఏళ్లు, డిప్యూటీ మేనేజర్‌కు 38 ఏళ్ల వయస్సు ఉండాలి.
వేతనం: నెలకు జూనియర్ మేనేజర్‌కు రూ.40,000 – 1,40,000, అసిస్టెంట్ మేనేజర్‌కు రూ.50,000 – రూ.1,60,000, మేనేజర్‌కు రూ.70,000 – 2,00,000, సీనియర్ మేనేజర్‌కు రూ.80,000 – రూ.2,20,000, ఎగ్జిక్యూటివ్‌కు రూ.30,000 – రూ.1,20,000, డిప్యూటీ మేనేజర్‌కు రూ.60,000 – 1,80,000 జీతం ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 ఏప్రిల్ 25
దరఖాస్తుకు చివరి తేది: 2025 మే 9
ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా..
నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.
అఫీషియల్ వెబ్ సైట్: https://fsnl.co.in/
అర్హత ఉండి ఆసక్తి కలిగి వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. సెలెక్ట్ అయిన వారికి భారీ వేతనం కూడా ఉంటుంది.
Also Read: GMC Recruitment: ఆ జిల్లాలో భారీగా జాబ్స్.. పది పాసైతే చాలు, జీతం రూ.22,750