OTT Movie : ఓటీటీలో క్రైమ్ థ్రిల్లర్ సినిమాలు, వెబ్ సిరీస్ లు ఇప్పుడు దుమ్ము రేపుతున్నాయి. ప్రేక్షకులు వీటిని వదిలి పెట్టకుండా చూస్తున్నారు. అయితే ఇప్పుడు మనం చెపుకోబోయే క్రైమ్ థ్రిల్లర్ మూవీ ఒక వృద్ధురాలి చుట్టూ తిరుగుతుంది. ఆమె తన మనవరాలికి జరిగిన అన్యాయానికి, రివేంజ్ తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. ఈ మూవీ ఎన్నో అవార్డులను కూడా సొంతం చేసుకుంది. ఈ మూవీ పేరు ఏమిటి ? ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది ? అనే వివరాల్లోకి వెళితే …
అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో
క్రైమ్ థ్రిల్లర్ మూవీ పేరు ‘అజ్జి’ (Ajji). 2017 లో విడుదలైన ఈ మూవీకి దేవాశిష్ మఖిజా దర్శకత్వం వహించారు. ఇందులో సుషమా దేశ్‌పాండే, శర్వాణి సూర్యవంశీ, అభిషేక్ బెనర్జీ, సదియా సిద్ధిఖీ, వికాస్ కుమార్, మనుజ్ శర్మ, సుధీర్ పాండే, కిరణ్ ఖోజే, స్మితా తాంబే ప్రధాన పాత్రలు పోషించారు. ‘అజ్జీ’ పాత్ర పోషించిన సుషమా దేశ్‌పాండే, UK ఆసియన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ది ఫ్లేమ్ అవార్డును గెలుచుకుంది. ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ లాస్ ఏంజెల్స్‌లో ఆమె నటనకు ప్రత్యేక జ్యూరీ ప్రస్తావన వచ్చింది. ప్రస్తుతం ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
స్టోరీలోకి వెళితే
ముంబైలోని ఒక స్లమ్ ఏరియాలో నివసించే పది ఏళ్ల చిన్నారి మందా, ఒక రోజు రాత్రి కనిపించకుండా పోతుంది. ఆమె అమ్మమ్మ అజ్జి స్థానిక వేశ్య అయిన లీలా సహాయంతో ఆమెను వెతుకుతూ వెళుతుంది. చివరకు ఆమె ఊరి చివర ఒక చెత్త కుప్పలో గాయాలతో పడి ఉంటుంది. ఆమెను అజ్జి ఇంటికి తీసుకెళ్ళి ఏం జరిగిందో తెలుసుకుంటుంది.
మందాపై ఒక సీరియల్ రేపిస్ట్, స్థానిక రాజకీయ నాయకుడి కొడుకు ధవలే లైం*గిక దాడి చేసినట్లు తెలుస్తుంది. స్థానిక పోలీసు అధికారి, రాజకీయ ప్రభావం కారణంగా ధవలేను అరెస్టు చేయడానికి భయపడతాడు. మందా కుటుంబాన్ని కేసు పెట్టనీయకుండా బెదిరిస్తాడు. మందా తల్లిదండ్రులు భయంతో ఇక సైలెంట్ గా ఉండాలని నిర్ణయించుకుంటారు.
Read Also : వందేళ్ల వయసులో భార్యమీద అనుమానం… విడాకుల కోసం కోర్టు మెట్లెక్కే వృద్ధుడు… ఈ మలయాళం మూవీ ఏ ఓటీటీలో ఉందంటే?
కానీ అజ్జి తన మనవరాలి బాధను చూసి తట్టుకోలేక, న్యాయం కోసం స్వయంగా తానే రంగంలోకి దిగుతుంది. ఆమె ముసలి వయసులో ఆర్థరైటిస్ సమస్యలతో కూడా బాధపడుతూ ఉంటుంది. ధవలే కదలికలను గమనిస్తూ, ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతుంది. ఒక స్థానిక మాంసం కొట్టులో, ఆమె మాంసం కోయడం నేర్చుకుంటుంది. అతనిపై దాడి చేయడానికే అలా చేస్తుంది. చివరకు అజ్జి ప్రతీకారం తీర్చుకుంటుందా ? ధవలేను చంపడానికి ఎటువంటి పథకం వేస్తుంది? అనే విషయాలను, ఈ సినిమాను చూసి తెలుసుకోండి.