E-Paper
Advertisement

విద్యార్థులకు బంపరాఫర్.. 9 నుంచి పీజీ వరకు, నెలకు వెయ్యి మీ సొంతం, ఇంకెందుకు ఆలస్యం

విద్యార్థులకు బంపరాఫర్.. 9 నుంచి పీజీ వరకు, నెలకు వెయ్యి మీ సొంతం,  ఇంకెందుకు ఆలస్యం
Advertisement

Merit Scholarship-2026:  ప్రతిభ గల విద్యార్థులకు చదివే స్తోమత లేదా? డబ్బు లేకపోవడంతో స్కూల్, కాలేజీలకు వెళ్లడం మానేస్తున్నారా? చదువు విషయంలో ఎలాంటి దిగులు చెందాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో ప్రతిభ గల విద్యార్థులను ప్రొత్సహించేందుకు స్కాలర్‌షిప్‌లు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. తాజాగా జేఎం సేథియా స్కాలర్‌షిప్ అందుబాటులోకి వచ్చింది. ఇప్పుడు దాని గురించి తెలుసుకుందా?

విద్యార్థులకు బంపరాఫర్.. 9 నుంచి పీజీ వరకు

Advertisement

విద్యకు ఖర్చులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. దీంతో చదివేందుకు చాలామంది విద్యార్థుల తల్లిదండ్రులు వెనక్కి అడుగులు వేస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన, ప్రతిభ కలిగిన విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఉపయోగపడుతున్నాయి. అలాంటి విద్యార్థులకు చేయూతనివ్వడానికి జేఎం సేథియా స్కాలర్‌షిప్-JM Sethia Charitable Trust అందుబాటులోకి వచ్చింది.

ఆ సంస్థ స్కాలర్‌షిప్‌లకు సంబంధించి విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. 9వ తరగతి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్న విద్యార్థులు అర్హులు. నెలకు రూ. 1,000 వరకు ఆర్థిక సహాయం సంబంధిత సంస్థ అందించనుంది. దీనివల్ల విద్యార్థులు చదువు మధ్యలో ఆపకుండా కొనసాగించేందుకు పుస్తకాలు, ఫీజులు, ఇతర ఖర్చులకు ఈ స్కాలర్‌షిప్ ఎంతో సహాయపడుతుంది.

Advertisement

నెలకు వెయ్యి మీ సొంతం, ఇంకెందుకు ఆలస్యం

ఈ స్కాలర్ షిప్‌కు సంబంధించి అర్హతలు, డాక్యుమెంట్లు ఏమి ఉండాలి? ఎంపిక విధానం ఏంటి? అప్లికేషన్ ప్రాసెస్ వంటి వివరాలు తెలుసుకుందాం. జేఎం సేథియా స్కాలర్‌షిప్ ప్రధాన ఉద్దేశ్యమేంి? ఆర్థిక ఇబ్బందుల వల్ల విద్యార్థులు చదువులు ఆపకుండా చేసే చిన్న సహాయం. గ్రామీణ ప్రాంతాలు, మధ్యతరగతి-పేద కుటుంబాల విద్యార్థులు చదువులు కొనసాగించేందుకు ప్రోత్సహించడం ఈ ట్రస్టు లక్ష్యం.

ముఖ్యంగా ప్రతిభావంతులైన విద్యార్థులకు ఉన్నత విద్య కోసం ఆర్థిక మద్దతు ఇవ్వడం. ఈ స్కాలర్‌షిప్‌కు 9 తరగతి నుంచి పీజీ వరకు చదువుకునే విద్యార్థులు అప్లై చేయవచ్చు. పాఠశాల విద్య నుంచి ఉన్నత విద్య వరకు చాలా మంది విద్యార్థులకు ఈ స్కాలర్‌షిప్ సువర్ణ అవకాశం.

ALSO READ: ఇంటర్ పూర్తి అయ్యిందా? భరోసా వచ్చేసింది, ఆ స్కీమ్‌లో చేరితే హాయిగా చదువు కంటిన్యూ

విద్యార్థులు గత విద్యాసంవత్సరంలో మంచి మార్కులతో పాస్ అయి ఉండాలి. మెరిట్ ఆధారంగా స్కాలర్ షిప్ ఎంపిక జరుగుతుంది. విద్యార్థులు తప్పనిసరిగా భారతీయ పౌరుడై ఉండాలి. ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు ప్రాధాన్యత. ఈ స్కాలర్‌షిప్ కింద ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ. 1,000 వరకు సహాయం అందుతుంది.

దరఖాస్తు చేసే సమయంలో విద్యార్థులు డాక్యుమెంట్లు ఉండాల్సిందే. పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, గత పరీక్షల మార్కుల మెమో, ఆదాయ ధృవీకరణ పత్రం, బోనాఫైడ్ సర్టిఫికేట్, విద్యా అర్హత పత్రాలు కచ్చితంగా ఉండాల్సిందే. ఈ స్కాలర్‌షిప్‌కు Online లేకుంటే Offline ద్వారా అప్లై చేయవచ్చు.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×