E-Paper
Advertisement

ఇంటర్ పూర్తి అయ్యిందా? భరోసా వచ్చేసింది, ఆ స్కీమ్‌లో చేరితే హాయిగా చదువు కంటిన్యూ

ఇంటర్ పూర్తి అయ్యిందా? భరోసా వచ్చేసింది, ఆ స్కీమ్‌లో చేరితే హాయిగా చదువు కంటిన్యూ
Advertisement

Inter Students: ఇంటర్ కావడంతో బీటెక్, డిగ్రీ, ఉన్నత చదువుల కోసం మధ్యతరగతి ప్ర జలు ఆలోచనలోపడ్డారు. డబ్బు లేదని దిగులు పడాల్సిన అవసరంలేదు. ఆ స్కీమ్‌లో చేరితో ఎంచక్కా పిల్లల ఎడ్యుకేషన్ పూర్తి అవుతుంది. ఇంకెందుకు ఆలస్యం, ఆ స్కీమ్ వివరాలు ఒక్కసారి తెలుసుకుందాం.

ఇంటర్ పూర్తి చేసిన విద్యార్థులకు పూర్తి భరోసా

Advertisement

తెలుగు రాష్ట్రాలతోపాటు సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. ఫెయిలైన వారు పూర్తి చేయాలనే ఆలోచనలో పడ్డారు. పాసైన వారు ఐఐటీ, ఐఐఎంల్లో చదవాలన్నది వారి కోరిక. కాకపోతే డబ్బుల సమస్య వెంటాడుతోంది. పీఎం విద్యాలక్ష్మి స్కీమ్‌లో చేరితే ఎలాంటి దిగులు అవసరం లేదు. ఎందుకంటే పూచీకత్తు లేకుండా 10 లక్షల రూపాయల వరకు ఎడ్యుకేషన్ లోన్ అందుతుంది.

మరి ఇంకెందుకు ఆలస్యం. పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ గురించి ఇంకొన్ని విషయాలు తెలుసుకుందా? ఇప్పుడున్న రోజుల్లో ఎడ్యుకేషన్ ఖర్చులు క్రమంగా పెరుగుతున్నాయి. ఇంజినీరింగ్, మెడిసిన్, మేనేజ్‌మెంట్, డిగ్రీ, వంటి కోర్సులు చదవాలంటే లక్షల్లో తల్లిదండ్రులు ఖర్చు చేస్తున్నారు. ప్రతిభ ఉన్న విద్యార్థులు ఫైనాన్స్ సమస్యల వల్ల ఉన్నత విద్యను కొనసాగించలేక సందర్భాలు చాలానే ఉన్నాయి.

Advertisement

ఆ స్కీమ్ లో చేరితే ఉన్నత చదువులు హాయిగా పూర్తి చేయొచ్చు

అలాంటి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చింది ‘పీఎం విద్యాలక్ష్మి స్కీమ్’ ఈ పథకం ద్వారా విద్యార్థులు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ.10 లక్షల వరకు ఎడ్యుకేషన్ లోన్ సులభంగా పొందవచ్చు. ఒక్కమాటలో చెప్పాలంటే ప్రతిభ గల విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనుంది. వడ్డీ రాయితీ, క్రెడిట్ గ్యారంటీ వంటి అదనపు ప్రయోజనాలు ఉంటాయి.

పీఎం విద్యాలక్ష్మి స్కీమ్ అనేది కేంద్ర ప్రభుత్వం సపోర్టుతో అమలు చేస్తున్న ఎడ్యుకేషన్ లోన్ పథకం. ఉన్నత విద్య కోసం డబ్బులు అవసరమైన విద్యార్థులకు బ్యాంకుల ద్వారా రుణాలు అందించడం. ఈ పథకం ముఖ్య ఉద్దేశ్యం. ఈ స్కీమ్ ద్వారా విద్యార్థులు సంబంధిత పోర్టల్ ద్వారా బ్యాంకులకు అప్లై చేసుకోవచ్చు. ఈ స్కీమ్‌లో ప్రస్తుతం 37కు పైగా బ్యాంకులు భాగస్వామ్యంగా ఉన్నాయి.

ALSO READ: సీబీఎస్ఈ ఇంటర్ ఫలితాలు విడుదల.. అబ్బాయిల కంటే అమ్మాయిల ఉత్తీర్ణత ఎక్కువ

చదువు ఓకే.. ఈ స్కీమ్ లో చేరేందుకు రూల్స్ ఏంటని అనుకుంటున్నారా? అక్కడికే వచ్చేద్దాం. తొలుత భారతీయ విద్యార్థి అయి ఉండాలి. ఈ పథకం కేవలం భారతీయ విద్యార్థులకు మాత్రమే వర్తిస్తుంది. టాప్ కాలేజీల్లో అడ్మిషన్ కచ్చితంగా రావాలి. NIRF ర్యాంకింగ్ ఆధారంగా టాప్-860 హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అడ్మిషన్ పొంది ఉండాలి.

అండర్ గ్రాడ్యుయేట్-UG, పోస్ట్ గ్రాడ్యుయేట్-PG, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, ప్రొఫెషనల్(మేనేజ్మెంట్) కోర్సుల విద్యార్థులు అర్హులు. మెరిట్ ఆధారంగా సీటు పొందిన విద్యార్థులకు అధిక ప్రాధాన్యం ఉండనుంది. ఈ స్కీమ్ ద్వారా విద్యార్థులు గరిష్టంగా రూ.10 లక్షల వరకు లోన్ పొందవచ్చు. ముఖ్యంగా కాలేజ్ ఫీజులు, హాస్టల్ ఫీజులు, పుస్తకాలు, ల్యాప్‌టాప్, ల్యాబ్ ఫీజులు, ఎగ్జామ్ ఫీజులు, ఇతర విద్యా ఖర్చులు ఉపయోగించుకోవచ్చు.

ఈ స్కీమ్ కోసం ఆస్తి పత్రాలు లేదా పూచీకత్తు అవసరం లేకపోవడం విద్యార్థులకు బిగ్ రిలీఫ్. మధ్యతరగతి, ప్రతిభ కగిలిన కుటుంబాలకు ఎంతగానో ఉపయోగపడుతోంది. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల లోపు ఉంటే.. ప్రభుత్వం 75 శాతం క్రెడిట్ గ్యారంటీ ఇస్తుంది కూడా. దీంతో బ్యాంకులు లోన్ మంజూరు చేసే అవకాశం మరింత తేలిక అవుతుంది. 3 శాతం వడ్డీ రాయితీ లభించనుంది. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ స్కీమ్ ను ఉపయోగించుకుని ఉన్నత చదువులు హాయిగా చదువుకోవచ్చు.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×