BigTV English

19 Yrs Old Google Techie : స్కూల్ స్థాయిలోనే గూగుల్ ఉద్యోగం – అయినా వర్శిటీల్లో అడ్మిషన్లు రిజెక్ట్ – కోర్టుకెక్కిన యువకుడు

19 Yrs Old Google Techie : స్కూల్ స్థాయిలోనే గూగుల్ ఉద్యోగం – అయినా వర్శిటీల్లో అడ్మిషన్లు రిజెక్ట్ – కోర్టుకెక్కిన యువకుడు

19 Yrs Old Google Techie : అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్శిటీల అడ్మిషన్ల విషయంలో జాతి వివక్షను చూపిస్తాయని.. వాటిపై పోరాటానికి న్యాయస్థానాన్ని ఆశ్రయించేందుకు ఓ యువకుడు సిద్ధమయ్యాడు. చిన్న వయస్సులోనే గూగుల్ లో సాఫ్ట వేర్ ఉద్యోగం సంపాదించినా… పోటీ పరీక్షల్లో ఉత్తమ స్కోర్ ఉన్నప్పటికీ.. ఉన్నత విద్యనభ్యసించేందుకు అమెరికాలోని అనేక యూనివర్శిటీలు రిజెక్ట్ చేశాయని ఆరోపిస్తూ.. చైనా మూలాలున్న ఓ యువకుడు ఆరోపిస్తున్నారు. తన వాదనను నిరూపించుకునేందుకు అన విద్యార్హతల్నే రుజువులుగా చూపిస్తున్నాడు.


చైనా నుంచి యూఎస్ వెళ్లి స్థిరపడిన ఓ కుటుంబానికి చెందిన స్టాన్లీ జాంగ్ అద్భుత ప్రతిభ ఉన్నవాడు. ఏటా SAT పరీక్ష రాసే 20 లక్షలకు పైగా అభ్యర్థుల్లో స్టాన్లీ జాంగ్ స్కోర్ 1590. మొత్తం అభ్యర్థుల్లో తొలి 2 వేల మందిలో స్థానం సంపాదించాడు.. స్టాన్లీ. అంతే కాదు.. ఇతని హైస్కూల్ GPA 4.0 స్కేల్‌లో 4.42 స్కోర్ సంపాదించాడు. ఇంతటి ప్రతిభతో పాటుగా చిన్నప్పటి నుంచి తండ్రి దగ్గర నేర్చుకున్న కోడింగ్ సామర్థ్యంతో.. పీహెచ్ డీ చేస్తే కానీ లభించని ఉద్యోగాన్ని ఇంకా గ్రాడ్యుయేషన్ స్థాయి కూడా దాటకుండానే అందుకున్నాడు. ప్రతిష్టాత్మక గూగుల్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ గా సేవలందిస్తున్నాడు. అంతటి సామర్థ్యమున్నా, ప్రతిభాపాటవాలు ఉన్నా.. అమెరికన్ యూనివర్శిటీలు తనపై వివక్ష చూపిస్తున్నాయని అంటున్నాడు.

గ్రాడ్యుయేషన్ స్థాయిలో కంప్యూటర్ సైన్స్ చదవాలనుకుంటున్న స్టాన్లీ.. హై స్కూల్ స్టూడెంట్ గా ఉన్నప్పుటే.. సొంత స్టార్టప్ ను ప్రారంభించాడు. ఈ-డాక్యుమెంట్ సిగ్నేచర్ ప్లాట్‌ఫామ్ రాబిట్-సైన్‌ అనే సైట్ ని నిర్వహించి తన ప్రతిభతో మెప్పించాడు. అతని ప్రతిభకు మెచ్చిన గూగుల్ సంస్థ.. స్టాన్లీకి ఉద్యోగ అవకాశం కల్పించింది. అతని విద్యార్హతలకు ఎవరైనా ఇతనికి హార్వర్డ్ యూనివర్శిటీనో, లేదా MITకి వెళ్లే అవకాశమో వస్తుందని ఊహిస్తారు. కానీ.. 19 ఏళ్ల స్టాన్లీ, 2023లో వివిధ యూనివర్శీల్లో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకోగా ఏకంగా 16 కాలేజీలు అతని అభ్యర్థిత్వాన్ని నిరస్కరించాయి. కేవలం.. ఆస్టిన్ లోని టెక్సాస్ యూనివర్శిటీ, మేరీల్యాండ్ యూనివర్శిటీలు మాత్రమే.. ప్రవేశాలు కల్పించాయి.


అతను దరఖాస్తు చేసుకున్న వాటిలో కాల్ పాలీ శాన్ లూయిస్ ఒబిస్పో, కాల్టెక్, కార్నెగీ మెల్లన్, కార్నెల్ విశ్వవిద్యాలయం, జార్జియా టెక్, MIT, స్టాన్‌ఫోర్డ్, UC బర్కిలీ, UC డేవిస్ సహా.. ఇల్లినాయిస్, మిచిగాన్, వాషింగ్టన్ యూనివర్శిటీలు ఉన్నాయి. ఇతని ప్రవేశాన్ని అంగీకరించిన ఆస్టిన్‌లోని టెక్సాస్ యూనివర్శిటీ, మేరీల్యాండ్ వర్శిటీలు – వరుసగా 31%, 44% అడ్మిషన్ రేట్లతో ప్రవేశం కల్పించాయి. ఈ ఫలితాల్ని చూసి స్టాన్లీతో పాటు అతని తండ్రి నాన్ జోంగ్ ఆశ్చర్యపోయారు. కాలేజీ అడ్మిషన్ల విషయంలో ఆసియన్లు అధిక స్థాయిలో వివక్షను ఎదుర్కొంటున్నారంటూ ఆరోపించారు. కాలేజీల తిరస్కరణలు ఒకదాని తర్వాత ఒకటి వచ్చినప్పుడు.. తొలుత ఆశ్చర్యపోయానని, ఆ తర్వాత ఆశ్చర్యంతో మొదలైనది నిరాశగా మారి చివరికి కోపంగా మారిపోయిందంటూ స్టాన్లీ తెలిపారు.

Also Read : Trump on IND PAK : భారత్ పై విమర్శలు-పాకిస్తాన్ కు కృతజ్ఞతలు-ట్రంప్ విధానమేంటి?

ఈ పరిణామాలతో కోపంగా ఉన్న స్టాన్సీ తండ్రి.. తన కొడుకును తిరస్కరించిన పాఠశాలలపై కోర్టుకు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. వర్శిటీల్లో వివక్ష కారణంగా పిల్లలు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 2023 జూన్‌లో కళాశాల అడ్మిషన్లలో ఇలాంటి చర్యల్ని సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఆసియా విద్యార్థులను కావాలనే నిర్లక్ష్యం చేస్తున్నారని గుర్తించి, అలాంచి చర్యలు సమర్థనీయం కాదని వ్యాఖ్యానించింది. పైగా.. యూఎస్ లో యూనివర్శిటీ అడ్మిషన్లలో జాతి వివక్షను నిషేధించే చట్టాలున్నాయి. ఈ నేపథ్యంలోనే సదరు కళాశాలలపై దావా వేయాలని స్టాన్లీ నిర్ణయించుకున్నారు.

Related News

Volodymyr Zelenskyy: మేం ఊరుకోం… శాంతి చర్చల ముందు ఉక్రెయిన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీ స్ట్రాంగ్ వార్నింగ్

Donald Trump: ట్రంప్ మామూలోడు కాదు.. భార్య మరణాన్ని కూడా అలా వాడుకున్నాడు

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

Big Stories

×