AP EDCET 2026 Result: ఆంధ్రప్రదేశ్‌లో బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఏపీ ఎడ్‌సెట్-2026 ఎంట్రన్స్ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి. దాదాపు 99.3 శాతం మంది విద్యార్థులు అర్హత సాధించారు. ఉత్తీర్ణత సాధించినవారికి మంత్రి లోకేష్ అభినందనలు తెలిపారు.
ఏపీ ఎడ్‌సెట్-2026 ఫలితాలు.. 99.3 శాతం ఉత్తీర్ణత
ఏపీ ఎడ్‌సెట్-2026 ఎంట్రన్స్ పరీక్షా ఫలితాలను మంత్రి నారా లోకేష్ విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 99.30 శాతం మంది ఉత్తీర్ణత శాతం సాధించారు. ఈ పరీక్షకు 19,880 మంది హాజరయ్యారు. వారిలో 19,741 మంది అభ్యర్థులు అర్హత సాధించారు.
ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను అభినందిస్తూ ఉపాధ్యాయ వృత్తిలోకి అడుగు పెట్టాలనుకునే వారు తమ కెరీర్‌లో ముందుకు సాగే క్రమంలో ఈ ఫలితాలు ముందడుగు అని లోకేష్ చెప్పారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ ర్యాంక్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫలితాలు వాట్సాప్ 9552300009 సేవల ద్వారా అందుబాటులో ఉంటాయని అధికారులు వెల్లడంచారు.
ఉత్తీర్ణత సాధించినవారికి మంత్రి అభినందనలు
ఎడ్‌సెట్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్‌కు హాజరై, వివిధ కళాశాలల్లో బీఎడ్ కోర్సుల్లో ప్రవేశాలు పొందనున్నారు. కౌన్సెలింగ్ ఎప్పుడు అనేది అధికారులు వెల్లడించనున్నారు. ఒకప్పుడు బీఎడ్ సీట్లకు లక్షల్లో విద్యార్థులు హాజరయ్యారు. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఆ సంఖ్య 19 వేలకు పడిపోయింది. కేవలం టీచర్ కావాలనే ఉద్దేశంతో ఉన్నవారు మాత్రమే దీనికి హాజరైనట్టు కొందరు విద్యార్థులు చెబుతున్నారు.