CM Rekha Gupta Luxury Chair: ఢిల్లీ ముఖ్యమంత్రి రేఖా గుప్తా ఇటీవల ఉపయోగించిన ఒక ఖరీదైన ఆఫీస్ చైర్ ఇప్పుడు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఢిల్లీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆమె కార్యాలయంలో తీసిన ఒక ఫోటో వైరల్ కావడంతో, అందులో కనిపించిన లగ్జరీ కుర్చీపై నెట్టింట జోరుగా చర్చ మొదలయ్యింది. ముఖ్యంగా ఆ కుర్చీ ధర, ఫీచర్లు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.
రేఖా గుప్తా ప్రస్తుతం ఢిల్లీ 9వ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. షాలిమార్ బాగ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన ఆమె, దాదాపు 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు. బీజేపీ అధిష్టానం ఆమెకు ఢిల్లీ ముఖ్యమంత్రిగా అవకాశం కల్పించారు. అయితే, ఇటీవల ఆమె ఒక ప్రత్యేకమైన ఎగ్జిక్యూటివ్ కుర్చీలో కూర్చున్న ఫోటో బయటకు రావడంతో వివాదం మొదలైంది. సోషల్ మీడియాలో వైరల్ అయిన పోస్టుల ప్రకారం, ఆ కుర్చీ ధర రూ.66 వేల నుంచి రూ.82 వేల మధ్య ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. చాలామంది నెటిజన్లు, ప్రతిపక్ష నాయకులు ఈ చైర్ పై విమర్శలు గుప్పించారు.
ఆ కుర్చీ పేరు రెడ్ ఓక్ ఇంపీరియో లగ్జరీ ఎగ్జిక్యూటివ్ చైర్. ఈ కుర్చీలో మసాజ్ ఫీచర్, రిక్లైనర్ సిస్టమ్, ఆటోమేటిక్ ఫుట్ రెస్ట్ లాంటి లగ్జరీ సౌకర్యాలు ఉన్నాయి. ఎక్కువసేపు పని చేసే అధికారుల కోసం దీన్ని ప్రత్యేకంగా రూపొందించినట్లు తెలుస్తోంది. అలాగే ప్రీమియం లెదర్ ఫినిషింగ్, హై డెన్సిటీ ఫోమ్ కుషనింగ్ లాంటి సౌకర్యాలు కూడా ఇందులో ఉన్నాయి.
This is a Red Oak Imperio. Costs 66K including taxes, not 1 Lakh. Not a big sum for a CM.https://t.co/ku90hX5yJs https://t.co/RqWMwqcLRF
— Diva Jain (@DivaJain2) May 26, 2026
ప్రస్తుతం ఈ చైర్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మీమ్స్, ట్రోల్స్ మొదలయ్యాయి. ఓవైపు ఆడంబరాలకు పోవద్దని చెప్తున్న బీజేపీ ప్రభుత్వాలు మరోవైపు ఇంత ఖరీదైన కుర్చీ ఉపయోగించడం సరైనదేనా? అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. ముఖ్యంగా రేఖా గుప్తా మెట్రోలో ప్రయాణించిన ఫోటోలను గుర్తుచేస్తూ, సాధారణ జీవితం ఒకవైపు.. లగ్జరీ కుర్చీ మరోవైపు అంటూ పోస్టులు పెడుతున్నారు. ఇక ప్రతిపక్ష పార్టీలు కూడా ఈ కుర్చీపై విమర్శలు చేస్తున్నాయి. ప్రజల డబ్బుతో విలాసవంతమైన వస్తువులు కొనడం అవసరమా? అని ప్రశ్నించాయి. ప్రభుత్వ ఖర్చుల్లో పారదర్శకత ఉండాలని డిమాండ్ చేశాయి.
మరోవైపు బీజేపీ నాయకులు, మద్దతుదారులు మాత్రం ఈ విమర్శలను తిప్పికొడుతున్నారు. ముఖ్యమంత్రి కార్యాలయంలో ఉన్న ఫర్నిచర్ ప్రభుత్వ ప్రమాణాల ప్రకారమే ఉంటుందని, దీనిని అనవసరంగా రాజకీయ రంగు పులుముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పెద్ద బాధ్యతలు నిర్వహించే నాయకులకు సౌకర్యవంతమైన సీటింగ్ అవసరమంటున్నారు.
Read Also: 22 ఏళ్లకే ఆరోసారి ప్రెగ్నెంట్.. 5 గురు ఉన్నా మగబిడ్డకోసం ఆరాటం.. డాక్టర్ రియాక్షన్ ఇదే!